ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ఇటీవల క్విక్ కామర్స్ సర్వీస్ ప్రారంభించింది. అంటే ఏదైనా వస్తువు బుక్ చేసుకుంటే నిమిషాల వ్యవధిలోనే డెలివరీ చేస్తారన్నమాట. బెంగళూరు వాసి ల్యాప్‌టాప్ బుక్ చేసుకున్న ఏడు నిమిషాల్లోనే ఫ్లిప్‌కార్ట్ అతనికి డెలివరీ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
బెంగళూరుకు చెందిన సన్నీ గుప్తా అనే వ్యక్తి ల్యాప్‌టాప్ ఆర్డర్ చేసుకున్నారు. అతినికి నిమిషాల వ్యవధిలోనే డెలివరీ అయింది. ఈ అనుభవాన్ని అతడు సోషల్ మీడియాలో వివరించారు. ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ నుంచి ల్యాప్‌టాప్‌ని ఆర్డర్ చేసాను. 7 నిమిషాలలోనే డెలివరీ అయింది. బుక్ చేసుకున్నప్పటి నుంచి డెలివరీ అయ్యేవరకు పట్టిన సమయం 13 నిముషాలు మాత్రమే అని తెలుస్తోంది.
చాలాకాలంగా గుప్తా ల్యాప్‌టాప్ తీసుకోవాలని అనుకుంటున్నట్లు, ఇందులో భాగంగానే ఏసర్ ప్రిడేటర్ ల్యాప్‌టాప్ ఆర్డర్ చేశారు. దీని ధర రూ. 95000 నుంచి రూ. 2.5 లక్షల మధ్య ఉంది. ఆర్డర్ చేసిన నిమిషాల వ్యవధిలో డెలివరీ రావడం చాలా గొప్ప విషయం. దీనికి గుప్తా ఫ్లిప్‌కార్ట్‌కు ధన్యవాదాలు తెలిపారు.
గుప్తా తన అనుభవాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. దీనిపైన పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఒకరు ఇది నా కొత్త భారతదేశం, ఇలాంటి సేవలు మున్ముందు ఇంకా వేగంగా ఉంటాయని అన్నారు. మరొకరు ఇది నిజంగా ఒక విప్లవం. ఫ్లిప్‌కార్ట్ విజయవంతమైతే, ఇది ఖచ్చితంగా అమెజాన్‌కు గట్టి పోటీ ఇస్తుందని అన్నారు.
Just ordered a laptop from @Flipkart minutes.
7 minutes delivery.
Will keep this thread posted.— Sunny R Gupta (@sunnykgupta) August 22, 2024
Comments
Please login to add a commentAdd a comment