ఆన్‌లైన్ ఆర్డర్ పెడితే.. డెలివరీ తీసుకునే వరకు వచ్చింది మనం పెట్టిన ఆర్డర్ అవునా? కాదా? అని సందేహమే. ఎందుకంటే గతంలో కొందమంది పెట్టిన ఆర్డర్స్ కారకుండా రాళ్లు వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి ఘటనే తాజాగా మరొకటి వెలుగులోకి వచ్చింది.
ఒక వ్యక్తి అమెజాన్‌లో వివో వై20ఏ మొబైల్ ఆర్డర్ చేశారు. డెలివరీ కూడా వచ్చింది. వచ్చిన డెలివరీని అన్‌బాక్సింగ్ చేసి చూస్తే ఒక్కసారిగా షాకయ్యాడు. ఎందుకంటే మొబైల్ ఫోన్‌కు బదులు అందులో మూడు సబ్బులు ఉన్నాయి. ఇది చూసి ఖంగుతిన్న కస్టమర్ అమెజాన్ కస్టమర్ కేర్ నుంచి సహాయం పొందటానికి ప్రయత్నించి విఫలమయ్యడు.
తాను ఎదుర్కొన్న సమస్యను ఆ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫోటోలను కూడా షేర్ చేశారు. అమెజాన్‌లో మొబైల్ ఆర్డర్ పెడితే.. సబ్బులు వచ్చాయని, దీనిపైన అమెజాన్ స్పందించలేదని పేర్కొన్నారు. ఆన్‌లైన్ మార్కెట్లో ఎంత పెద్ద మోసాలు జరుగుతున్నాయో ఆలోచించండి అంటూ ట్వీట్ చేసాడు.
मेरी भांजी @Anuja7Jha ने @amazonIN से फ़ोन मंगाया। उसमें फ़ोन की जगह साबुन का टुकड़ा भेज दिया गया है। @AmazonHelp कोई मदद भी नहीं कर रहा है।
सोचें,क्या ऐसे ऑनलाइन मार्केटिंग चल सकती है? इतना बड़ा फ्रॉड। आग्रह कि आमेजन पर दबाव बनाएँ। थैंक्स pic.twitter.com/8udb1uzTUB— Narendra Nath Mishra (@iamnarendranath) June 14, 2024
Comments
Please login to add a commentAdd a comment