కేయూ ప్రొఫెసర్ రవీందర్‌కు అరుదైన గౌరవం | Keyu the rare honor of Professor ravindar | Sakshi
Sakshi News home page

కేయూ ప్రొఫెసర్ రవీందర్‌కు అరుదైన గౌరవం

Published Sat, Dec 6 2014 6:20 AM | Last Updated on Sat, Sep 2 2017 5:44 PM

Keyu the rare honor of Professor ravindar

  • రాయల్ కెమికల్ సొసైటీ ఫెలోగా ఎంపిక
  • వరంగల్: కాకతీయ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ వడ్డె రవీందర్ ప్రతిష్టాత్మకమైన రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ ఫెలోగా ఎంపికయ్యారు. తెలంగాణ వర్సిటీల నుంచి ప్రథమంగా రవీందర్‌కు ఈ గౌరవం లభించింది. మూడు దశాబ్దాలకుపైగా బోధన, పరిశోధనల అనుభవం ఉన్న ప్రొఫెసర్ రవీందర్ 115 పరిశోధన పత్రాలను సమర్పించారు. రెండు పుస్తకాలు రచించారు. ఆయన పేరున రెండు పేటెంట్లు ఉన్నాయి.

    2010లో రాష్ర్ట ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు, 2013లో అప్‌కాస్ట్ డీఎస్‌టీ ఆఫ్ సెన్సైస్ అవార్డు అందుకున్నారు. పలు విదేశీ వర్సిటీలకు విజిటింగ్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. కాగా, కేయూలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో రవీందర్‌కు రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ మెడల్, సర్టిఫికెట్, బ్యాడ్జీని ఐఐసీటీ డెరైక్టర్ లక్ష్మీకాంతం అందజేశారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement