కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ వార్షిక పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 41 కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ వార్షిక పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 41 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ పురుషుల, మహిళా డిగ్రీ కళాశాలల్లో సౌకర్యాలు లేక విద్యార్థులు నానా తంటాలు పడ్డారు. మహిళ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు తరగతి గదిలో కూర్చొని చదువుకునే విధంగా ఒకే బెంచీపై ముగ్గురు విద్యార్థులు, విరిగిన కూర్చీలపై పరీక్ష రాశారు. చీకటి గదిలో కూర్చోబెట్టడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. పురుషుల కళాశాలలో కూడా ఇనుప కూర్చీల్లోనే కూర్చొబెట్టి పరీక్ష రాయించారు.
ఏడాది పాటు కష్టపడి చదివిన పరీక్ష ప్రశాంతంగా రాసెందుకు కూడా సౌకర్యా లు కల్పించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ రోజు మొ దటి, తృతీయ సంవత్సరం విద్యార్థులు పరీక్ష రాశారు. ఈ పరీక్షలు ఏప్రిల్ 1వరకు జరుగుతాయి. కాగా, జిల్లా వ్యాప్తంగా 74 మంది డిబా ర్ అయ్యారు. ఇందులో కడెంలో 30, ఖానాపూర్‌లో 25, మంచిర్యాలలో 20 మంది ఉన్నారు. కడెం మండలంలోని ఏఆర్‌ఎస్ కళాశాలలో ఎల్‌ఎంఆర్ డిగ్రీ క ళాశాలకు చెందిన 450 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. కాకతీయ యూనివర్సిటీ వరంగల్ కు చెందిన ముగ్గురు ప్రొఫెసర్ల బృందం స్క్వాడ్‌లుగా వచ్చారు. మాస్ కాపీయిండ్‌కు పాల్పడుతున్న 130 మంది పరీక్ష కేంద్రం నుంచి వెళ్లగొట్టారు.
సకాలంలో చేరని జవాబు పత్రాలు
మంచిర్యాల సిటీ : కాకతీయ యునివర్సిటీ డిగ్రీ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉదయం తృతీయ సంవత్సరం పరీక్షకు హాజరైన విద్యార్థుల జవాబు పత్రములు సాయంత్రం వరకు కూడా మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల నోడల్ కేంద్రానికి చేరుకోలేదు. దీంతో యూనివర్సిటీ అధికారుల ఆదేశాలను పలువురు పరీక్ష కేంద్రం నిర్వాహకులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నా యి. సాయంత్రం 7 గంటల వరకు కూడా పలు ప్రైవేటు పరీక్ష కేంద్రం వారు జవాబు పత్రములు పంపలేదని నోడల్ కేంద్రం వారు తెలిపారు. ఈ విషయమై నోడల్ కేంద్రం పరీక్ష విభాగం ఇన్‌చార్జి గోపాల్ మాట్లాడుతూ కెటాయించిన సమయం ప్రకారం జవాబు పత్రములు రాకుంటే ఉపేక్షించేది లేదన్నారు.