కాకతీయ విశ్వవిద్యాలయం పీజీ పరీక్షలు మే నెల 5వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి తెలిపారు.
హైదరాబాద్: కాకతీయ విశ్వవిద్యాలయం పీజీ పరీక్షలు మే నెల 5వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి తెలిపారు. పీజీ నాల్గవ సెమిస్టర్ పరీక్షలు మే 5 నుంచి, రెండో సెమిస్టర్ పరీక్షలు మే 6 నుంచి ప్రారంభం కానున్నాయి.
పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ నిర్వహిస్తారు. రెండో సెమిస్టర్ పరీక్షలు మే 6, 10, 12, 17, 19, 21 23 తేదీలలో, నాల్గవ సెమిస్టర్ పరీక్షలు మే 5, 7, 9, 11, 13, 16 తేదీలలో జరుగుతాయి.