కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : అధ్యాపకులు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొం దించుకోవాల్సిన అవసరం ఉందని కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ బి.వెంకటరత్నం అన్నారు. కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖ, నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ఐసీటీ అనే కార్యక్రమంలో భాగంగా కేయూ ఇంజినీరింగ్ కళాశాలలో మైక్రోసాఫ్ట్ సంస్థ సహకారంతో అధ్యాపకులకు పది రోజులుగా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీపై నిర్వహిస్తున్న శిక్షణ గురువా రం ముగిసింది.
ఈ సందర్భంగా వీసీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం అన్నారు. కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అధ్యాపకులు ఐసీటీ పరిశోధనలతోపాటు, తరగతి గదిలో విరివిగా ఉపయోగించుకునే అవకాశాలున్నాయని వివరించారు. ఇలాంటి శిక్షణ శిబి రాలు నూతన టెక్నాలజీపై ఎంతో అవగాహన కలిగిస్తాయని తెలిపారు.
కేయూలో అకడమిక్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాల ఏర్పాటు చేసే యోచన ఉందని, ఈ మేరకు ప్రతిపాదనలను కూడా రూపొందించామన్నారు. గ్రంథాలయం లో విద్యార్థి సాధికారిత విభాగం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.సాయిలు మాట్లాడుతూ నేడు ఈ క్లాస్ రూం, ఈ బుక్స్, ఈ జర్న ల్స్, ఈ కాంటెంట్ సర్వసాధారణమయ్యాయని చెప్పా రు. వీటిని అధ్యాపకులు ఉపయోగించుకోవాలని కోరా రు.
పది జీబీఎస్‌తో క్యాంపస్‌లో వైఫై ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ సీనియర్ ప్రాజెక్టు మేనేజర్ షహీనా షఫీ మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న అంశాలను తోటి అధ్యాపకులు, విద్యార్థులకు నేర్పాలని సూచించారు. ప్రోగ్రాం కన్వీనర్, కేయూ వెబ్ ఇన్‌చార్‌జ ఎన్.రమణ మాట్లాడుతూ కొందరు అధ్యాపకులకు శిక్షణ ఇచ్చామన్నారు.
కేయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసులు మాట్లాడుతూ కంప్యూటర్ బోధనలో అనేక మార్పులు వచ్చాయని తెలిపారు. మైక్రోసాఫ్ట్ ప్రతినిధి తోమర్, ఎస్.నర్సింహాచారి, వై.వెంక య్య, ఎం.సురేఖ, షాయదా, ముంజం శ్రీనివాస్ పాల్గొన్నారు. శిక్షణ పొందిన అధ్యాపకులకు వీసీ వెంకటరత్నం సర్టిఫికెట్లను అందజేశారు.
కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి
Published Fri, Apr 11 2014 5:30 AM | Last Updated on Sat, Sep 2 2017 5:54 AM
Advertisement
Advertisement