లోటు.. రూ.14.01కోట్లు | Deficit of Rs .14.01 crore .. | Sakshi
Sakshi News home page

లోటు.. రూ.14.01కోట్లు

Published Thu, Mar 27 2014 5:09 AM | Last Updated on Sat, Sep 2 2017 5:12 AM

Deficit of Rs .14.01 crore ..

  •      ఎనిమిది భాగాలుగా కేయూ బడ్జెట్
  •      సెనేట్ సమావేశంలో ఆమోదం
  •      తెలంగాణలో యూనివర్సిటీ   మరింత అభివృద్ధి : వీసీ వెంకటరత్నం
  •  కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్: కాకతీయ యూనివర్సిటీ వార్షిక(2014-15) బడ్జెట్‌ను బుధవారం ఆమోదించారు. క్యాంపస్‌లోని పరిపాలన భవనంలోని సెనేట్ హాల్‌లో కేయూ వీసీ ప్రొఫెసర్ బి.వెంకటరత్నం అధ్యక్షతన 29వ అకడమిక్ సెనేట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కామ ర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం సీనియర్ ప్రొఫెసర్ ఎం.సుబ్రమణ్యశర్మ వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.190.07 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.170.42కోట్ల రాబడి వస్తుందని అంచనా వేయడంతో పాటు రూ.190.07కోట్లు ఖర్చు ప్రతిపాదించారు. ప్రస్తుతం రూ.5.64కోట్లు నిలువ ఉండగా.. రూ.14.01కోట్లు లోటు ఉంటుందని వివరించారు.
     
    ఆదాయం ఇలా...
     
    రాష్ట్ర ఉన్నత విద్యామండలి సూచనల మేరకు కాకతీయ యూనివర్సిటీ బడ్జెట్‌ను ఎనిమిది భాగాలుగా రూపొందించారు. ప్రతీ భాగం కింద ఆదాయ వ్యయాలను చూపారు. ఇందులో నాన్‌ప్లాన్ రెవెన్యూ బడ్జెట్‌గా రూ.190.07 కోట్లు, డెవలప్‌మెంట్ ఫండ్ ప్లాన్ బడ్జెట్ రూ.10.25కోట్లు,స్పెషల్ ఫండ్స్ బడ్జెట్ రూ. 1.78 కోట్లు, డిపాజిట్లు, అడ్వాన్సుల బడ్జెట్ రూ.5.77 కోట్లు, సెల్ఫ్ సపోర్టింగ్ ప్రోగ్రామ్స్ బడ్జెట్ రూ.7.08 కోట్లు, దూరవిద్య బడ్జెట్ రూ.16.62కోట్లు, వనరుల సమీకరణ బడ్జెట్ రూ.33.36కోట్లు కేటాయించారు. రాష్ర్ట ప్రభుత్వం నుంచి వేతన భత్యాల కింద రూ. 47.88 కోట్లు గ్రాంట్ ఇన్‌ఎయిడ్‌గా రానుందని, మిగ తా ఆదాయాన్ని అంతర్గతవనరుల ద్వారా సమీకరిం చనున్నామన్నారు. అయితే బడ్జెట్‌లో 40శాతం వేతనా లు, పెన్షన్లకు 17శాతం, అభివృద్ధి పనులకు 21 శాతం వెచ్చించనున్నట్లు అంచనా ప్రతిపాదించారు.
     
    ఇవీ కేటాయింపులు..
     
    వచ్చే సంవత్సరం యూనివర్సిటీలో చేపటనున్న అభివృద్ధి పనులకు రూ.37.47కోట్లు కేటాయించగా ప్రధానంగా నూతన భవనాల నిర్మాణానికి రూ.18కోట్లు, రూ. 50లక్షలు ఆడిటోరియం కోసం కేటాయించారు. యూనివర్సిటీలోని ఇంజినీరింగ్ కళాశాలకు రూ.10 కోట్లు, క్రీడావిభాగానికి రూ.1.02కోట్లు, ఎన్‌ఎస్‌ఎస్ విభాగానికి రూ. 1.69కోట్లు, ఇంటర్నెట్ సౌకర్యానికి రూ.7లక్షలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అలాగే, పరీక్షల నిర్వహణకు రూ.31,51కోట్లు, కేంద్ర గ్రంథాలయానికి రూ.13.35లక్షలు, ఆరోగ్య కేంద్రానికి రూ. 7.80లక్షలు, వెల్ఫేర్ రిక్రియేషనల్ కార్యక్రమాలకు రూ.9.50లక్షలు, స్టూడెంట్ సర్వీసెస్‌కు రూ.10.25లక్షలు, లైబ్రరీకి రూ 3లక్షలు, అవెన్యూ ప్లాంటేషన్, క్యాంపస్ సుందరీకరణ లాన్స్‌కు రూ.17లక్షలు, రోడ్ల కు రూ.30లక్షలు కేటాయించారు. ఇంకా విద్యార్థుల హాస్టల్ సౌకర్యాల అభివృద్ధి, కొత్త హాస్టళ్లలో సౌకర్యాల కల్పనకు రూ.25లక్షలు, హాస్టళ్ల పునరుద్ధరణకు రూ. 25లక్షలు, విద్యార్థినుల మెస్ నిర్మాణానికి రూ.25లక్షలు, న్యాక్ డెవలప్‌మెంట్‌కు రూ.50లక్షలు, క్యాంటీన్ నిర్మాణానికి రూ.25లక్షలు కేటాయించారు.
     
    యూనివర్సిటీ అభివృద్ధికి తోడ్పడాలి
     
    వీసీగా తాను యూనివర్సిటీలో పలు కోర్సులు, నూత న కళాశాలల ఏర్పాటుకు కృషి చేశానని వీసీ వెంకటరత్నం తెలిపారు. సెనేట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనందున రానున్న రోజుల్లో కేయూ ఇంకా అభివృద్ధి చెందుతుం దని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు సెనేట్ సభ్యులు కూడా కృషి చేయాలని కోరారు. ఈ ఏడాది మే నెలలో యూనివర్సిటీ స్నాతకోత్సవం నిర్వహించాలని భావి స్తున్నట్లు తెలిపారు.
     
    అనంతరం సెనేట్ సభ్యులు మాజీ వీసీ విద్యావతి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, ఎకనామిక్స్ ప్రొఫెసర్ విజయ, న్యాయవాది కేఎస్‌ఆర్‌జీ.ప్రసాద్, బొమ్మ ల కట్టయ్య, ప్రొఫెసర్ దామోదర్ మాట్లాడారు. సమావేశంలో కేయూ రిజి స్ట్రార్ కె.సాయిలు, ఎస్డీఎల్‌సీఈ డెరైక్టర్ డి.రాజేంద్రప్రసాద్, ఫైనాన్స్ ఆఫీసర్ పీవీ.రమేష్‌కుమార్, డిప్యూటీ రిజిస్ట్రార్లు మామిడాల సుధాకర్, ఎండీ.సలీం అహ్మద్‌తో పాటు ప్రొఫెసర్లు ఎన్.రామస్వామి, జి.భద్రునాయక్, కె.యాదగిరి, కె.రాజిరెడ్డి, టి.శ్రీనివాసులు, రాంనాథ్‌కిషన్, ఎంఏ.సింగరాయచార్య, టి.రవీందర్‌రెడ్డి, ఎంవీ.రంగారావు, టి.యాదగిరిరావు, దిగంబర్‌రావు, కె.సీతారామారావు, డాక్టర్ బి.సురేష్‌లాల్, డాక్టర్ మోయిజ్ అహ్మద్, డాక్టర్ సుమతి ఉమామహేశ్వరి, రఘురామారావు, డాక్టర్ వై.నర్సింహారెడ్డి, ఎం. గౌరీశంకర్, డి.రఘుపతి, ఇ.సురేష్‌బాబు, ఆర్.వెంకటేశ్వర్లు, నేతాజీ పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement