computer technology
-
ఇప్పటి విలువలో దాని ధర రూ. 53 కోట్లు!
బరువేమో ఏకంగా 27 టన్నులు!.. ఆక్రమించే స్థలం 1800 చదరపు అడుగులు! .. తయారీకైన ఖర్చు సంగతి సరేసరి... ఈ రోజు విలువలో ఏకంగా రూ.53 కోట్లు! .. ఏమిటీ వివరాలు అనుకుంటున్నారా? ఈ రోజుల్లో మన అరచేతుల్లో ఇమిడిపోయి... విద్య, వినోద, విజ్ఞాన ప్రపంచానికి కిటికీగా మారిన కంప్యూటర్ తొలి రూపం గురించి! ఇప్పుడు ఎందుకంటారా.... మనకు పరిచయమై 75 ఏళ్లు అవుతోంది కాబట్టి! ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్... క్లుప్తంగా ఇనియాక్! ప్రపంచంలో తొలి కంప్యూటర్ ఏదంటే వచ్చే సమాధానం ఇదే. 1946 ఫిబ్రవరిలో తొలిసారి ఇది ప్రపంచానికి పరిచయమైంది. అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీలోని మూర్ స్కూల్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో 1943లో ఇనియాక్ నిర్మాణం మొదలైంది. ఎనభై అడుగుల పొడవులో యూ ఆకారంలో తయారైన ఇనియాక్‌లో మొత్తం 18,800 రేడియోవాల్వ్‌లు, వ్యాక్యూమ్ ట్యూబ్‌లు ఉండేవి. క్షిపణుల ప్రయాణ మార్గాన్ని లెక్కించి ఇవ్వడం ఈ తొలితరం కంప్యూటర్ ప్రధాన లక్ష్యం. ‘ప్రాజెక్ట్ పీఎక్స్’పేరుతో అమెరికన్ మిలటరీ, పెన్సిల్వేనియా యూనివర్సిటీలు దీని తయారీని చేపట్టాయి. డాక్టర్ జాన్ డబ్ల్యూ మాచ్లీ, జే.ప్రెస్పర్ ఎకర్ట్ జూనియర్ల ఆధ్వర్యంలో సిద్ధమైంది. భారీ వ్యవస్థ... ఇప్పుడంటే కంప్యూటర్ అనేది అరచేతిలో ఇమిడిపోయిందిగానీ.. ఇనియాక్ మాత్రం ఓ భారీ వ్యవస్థను పోలి ఉండేది. ముందుగా చెప్పుకున్నట్లు మొత్తం 18,800 రేడియో వాల్వ్‌లు, వ్యాక్యూమ్ ట్యూబ్‌లు మాత్రమే కాదు.. సుమారు 70 వేల రెసిస్టర్లు, 10 వేల కెపాసిటర్లు, 6 వేల స్విచ్‌లు... ఎకాఎకిన 50 లక్షల సోల్డరింగ్ జాయింట్లు చేరితే ఇనియాక్ అయింది. అంతేనా... ఊహూ కానే కాదు. 1,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భారీ వ్యవస్థలో 9 అడుగుల ఎత్తైన ప్యానెళ్లు 42 ఉండగా.. వాటిని అడుగు మందమున్న ఉక్కుతో తయారు చేశారు. ఒక్కో ప్యానెల్ పైభాగంలో వ్యవస్థను చల్లబరిచేందుకు ఫ్యాన్ల వంటివి ఏర్పాటు చేశారు. ఇంతటి భారీ వ్యవస్థతో పనిచేసేందుకు ఏకంగా 150 కిలోవాట్స్/గంటల విద్యుత్తు అవసరమయ్యేదంటే ఆశ్చర్యమేమీ లేదు. లెక్కలు వేయాల్సిన ప్రతిసారి ఉన్న 6 వేల స్విచ్‌లలో కొన్నింటిని భౌతికంగా సరి చేయాల్సి వచ్చేది. అప్పట్లో ఇందుకోసం ప్రత్యేకంగా మహిళా సిబ్బందిని నియమించారు. కే మెక్‌నల్టీ, బెట్టీ జెన్నింగ్స్, బెట్టీ స్నైడర్, మార్లిన్ వెస్కాఫ్, ఫ్రాన్ బిలాస్, రూథ్ లిచెటర్‌మ్యాన్ అనే మహిళలు ఈ ప్రోగ్రామింగ్‌ను చేసేవారు. ఈ లెక్కన ప్రపంచంలోనే తొలి ప్రోగ్రామర్లు ఎవరంటే.. ఈ మహిళలనే చెప్పాలన్నమాట. రెండో ప్రపంచ యుద్ధంలో వినియోగించనున్న ఆధునిక ఆయుధాల కోసం ఇనియాక్‌ను సిద్ధం చేయాలనుకున్నా జపాన్ అమెరికాకు లొంగిపోయిన తరువాత అంటే రెండో ప్రపంచ యుద్ధం పూర్తయ్యే సమయానికిగానీ ఇది తయారు కాలేదు. కాకపోతే ఇది హిరోషిమా, నాగసాకీలపై పడిన అణుబాంబుల తయారీలో భాగస్వామిగా మారింది. ప్రస్తుతం ఇనియాక్‌ను ముక్కలు ముక్కలుగా చేసి పెన్సిల్వేనియా వర్సిటీతోపాటు లండన్‌లోని స్మిత్సోనియన్ సైన్స్ మ్యూజియం తదితర ప్రాంతాల్లో ప్రదర్శనకు ఉంచారు. జనగణన మొదలుకొని అధ్యక్షుడి ఎంపిక వరకూ.. ఇనియాక్గా మొదలైన ఆధునిక కంప్యూటర్ ప్రస్థానం ఎక్కువ కాలం కొనసాగలేదు. 1955 నాటికి ఇనియాక్‌ను మూతవేయగా మాచ్లీ, ఎకర్ట్లు అప్పటికే రెండో తరం కంప్యూటర్ ఎడ్వ్యాక్ డిజైన్‌ను సిద్ధం చేసుకున్నారు. ఎకర్ట్–మాచ్లీ కంప్యూటర్ కార్పొరేషన్ పేరుతో ఓ సంస్థను స్థాపించి వాణిజ్యస్థాయిలో కంప్యూటర్ల తయారీ చేపట్టారు. ఈ సంస్థ తయారు చేసిన యునివాక్ కంప్యూటరే 1950 నాటి అమెరికా జనాభా లెక్కల గణన చేపట్టింది. ఆ తరువాత 1952లో విజయవంతంగా అమెరికా అధ్యక్ష ఎన్నిక విజేతను అంచనా కట్టింది కూడా. – సాక్షి, హైదరాబాద్ చదవండి: లగ్జరీ గృహాల అద్దెల్లో హైదరాబాద్ టాప్ -
‘ఈ’ నైపుణ్యాలుంటే కొలువు మీదే!
ఉద్యోగ నియామకాలకు కీలకమవుతున్న కంప్యూటర్ పరిజ్ఞానం కంప్యూటర్, ఇంటర్నెట్ లిటరసీతో విజయాలకు చేరువగా... మానవ జాతి పయనాన్ని ఎన్నో ఆవిష్కరణలు అద్భుతమైన మలుపులు తిప్పాయి. నిప్పు నుంచి మొదలు కరెంటు, ఆవిరియంత్రం, రైలు, విమానం, ముద్రణాయంత్రం, టీవీ ఇలా ఎన్నో వస్తువులు మనిషి జీవితాన్ని విలువైనదిగా మార్చేశాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే కంప్యూటర్ ఒక ఎత్తు. ఆన్లైన్లో ఆరటి పండ్లు కొనడానికైనా, అంతరిక్షంలోకి సుదూర యాత్రలకైనా కంప్యూటర్ అవసరం పెరిగిపోయింది. అందుకే నేడు ‘కంప్యూటర్ అక్షరాస్యత ప్రాధాన్యం ఏర్పడింది. కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలకూ కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పరీక్షించనున్నారనే వార్తల నేపథ్యంలో అభ్యర్థులకు అవసరమైన కంప్యూటర్ నైపుణ్యాలపై ఫోకస్... కంప్యూటర్ పరిజ్ఞానం ఎందుకు? ప్రస్తుతం ప్రతి రంగంలో కంప్యూటర్ ప్రాధాన్యం పెరిగింది. ప్రభుత్వ విభాగాల్లో కంప్యూటరీకరణ, ఆన్లైన్ సేవల విస్తరణలో వేగం పుంజుకుంది. ఈ-పాలనను సుసంపన్నం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పరీక్షించే అవకాశం ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు కొలువులకు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి అర్హతగా మారుతోంది. ఇప్పటికే బ్యాంకు ఉద్యోగ నియామక పరీక్షల్లో కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పరీక్షించేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. అవసరమైన కంప్యూటర్ నైపుణ్యాలు రోజువారీ కార్యకలాపాలకు అవసరమయ్యే కంప్యూటర్ ప్రాథమిక నైపుణ్యాలను సొంతం చేసుకోవాలి. కంప్యూటర్ ఇన్పుట్, అవుట్ పరికరాల పనితీరు, ఉపయోగాలపై అవగాహన అవసరం. ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ బేసిక్స్‌ను నేర్చుకోవాలి. ఓ అంచనా ప్రకారం దేశంలో ఇంటర్నెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ 2020 నాటికి 200 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది. దేశంలో ఇంటర్నెట్ విస్తృతిని దీన్నిబట్టి అర్థంచేసుకోవచ్చు. అందుకే ఇంటర్నెట్ ప్రయోజనాలు ఏమిటి? వాటిని ఎలా పొందవచ్చో తెలుసుకోవాలి. ఈ-మెయిలింగ్ నైపుణ్యాలు, వేగంగా అక్షరాలను టైప్ చేయగల నైపుణ్యాలను సొంతం చేసుకోవాలి. ఏ అంశాలను నేర్చుకోవాలి? విండోస్ ఎక్స్పీ/7/8: ఇందులో ఇంట్రడక్షన్ టు విండోస్, డెస్క్‌టాప్, బేసిక్ మౌస్ ఆపరేషన్స్, మై కంప్యూటర్, డెస్క్‌టాప్ సెట్టింగ్స్, ఫోల్డర్, నోట్‌ప్యాడ్ తదితర అంశాలుంటాయి. ఎంఎస్ వర్డ్: డాక్యుమెంట్; లే అవుట్, టూల్బార్, టాస్క్ ప్యాన్; హెడర్ అండ్ ఫుటర్; కామెంట్స్, ఆబ్జెక్ట్స్; సింబల్స్ అండ్ ఈక్వేషన్స్; పిక్చర్స్, స్మార్ట్ ఆర్ట్ అండ్ చార్ట్స్, టేబుల్స్; ఫార్మేటింగ్ ఫండమెంటల్స్; పేజ్ సెటప్, ప్రింట్ వ్యూ, ప్రింట్ వంటి అంశాలుంటాయి.: కంటెంట్స్ ఆఫ్ ఏ వర్క్‌షీట్, వర్క్‌బుక్, ఎడిటింగ్ డేటా, ఎడిటింగ్ ది వర్క్‌షీట్, ఫార్మేటింగ్ ది ఉ్ఠఛ్ఛి షీట్స్, టేబుల్, సెల్ స్టయిల్స్, ఫిల్ ది సెల్స్, ఇలుస్ట్రేషన్స్, చార్ట్స్, ఫార్ములాస్, ఇంపోర్ట్ ది డేటా, డేటా టూల్స్, పేజ్ సెటప్-ప్రివ్యూ-ప్రింట్ వంటివి ఉంటాయి. పవర్ పాయింట్: ప్రెజెంటేషన్, ఎంటరింగ్-ఎడిటింగ్ టెక్స్ట్, డ్రాయింగ్ ఆబ్జెక్ట్స్ ఇన్ పవర్ పాయింట్, పవర్ పాయింట్ ఆబ్జెక్ట్స్, ఇలుస్ట్రేషన్స్, గ్రాఫ్స్, యానిమేషన్ అండ్ ట్రాన్సిషన్స్, స్లయిడ్ షో వంటి అంశాలను నేర్చుకోవాలి. మైక్రోసాఫ్ట్ యాక్సెస్: క్రియేటింగ్ న్యూ డేటాబేస్, ఓపినింగ్ ఎక్సిస్టింగ్ డేటాబేస్, క్రియేట్ టేబుల్, క్రియేటింగ్ క్వెరీ, క్రియేటింగ్ ఫాం, క్రియేటింగ్ రిపోర్ట్స్, క్రియేటింగ్ పేజెస్, ఇంపోర్టింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్. ఇంటర్నెట్కు సంబంధించి నేర్చుకోవాల్సినవి: బ్రౌజర్, సైబర్ స్పేస్, డొమైన్ నేమ్, డౌన్లోడ్, ఈ-మెయిల్, హోంపేజ్, హెచ్‌టీఎంఎల్, హెచ్‌టీటీపీ, హైపర్ టెక్స్ట్, లింక్, సెర్చ్ ఇంజన్, యూఆర్ఎల్, వెబ్సైట్, వెబ్‌పేజ్ తదితరాలకు సంబంధించి అవగాహన అవసరం. ఎక్కడ నేర్చుకోవాలి? మార్కెట్లో దీనికి సంబంధించి సర్టిఫికెట్, డిప్లొమా స్థాయి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. రోజుకు రెండు గంటలు (గంట థియరీ, గంట ప్రాక్టికల్) చొప్పున నెల రోజుల్లో శిక్షణ పూర్తిచేసే అవకాశం కూడా కొన్ని సంస్థలు కల్పిస్తున్నాయి. గరిష్టంగా రూ.2 వేలుతో శిక్షణ పూర్తిచేయొచ్చు. కేంద్ర ప్రభుత్వ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఉచితంగా కంప్యూటర్ శిక్షణ ఇస్తుంటారు. వీటిని ఉపయోగించుకోవచ్చు. ఎవరు నేర్చుకోవచ్చు? పదో తరగతి ఉత్తీర్ణుల నుంచి చదువు పూర్తయి ఉద్యోగ వేటలో ఉన్న ప్రతి ఒక్కరూ అవసరాల మేరకు కంప్యూటర్ స్కిల్స్‌ను పెంపొందించుకోవచ్చు. ఎంఎస్ఎంఈ అయితే ఇంటర్ ఉత్తీర్ణులకు శిక్షణ ఇస్తోంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ప్రాధాన్యమిస్తున్నారు. ఇప్పుడే కంప్యూటర్ లిటరసీ దిశగా అడుగేయండి... కొత్తగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారైనా, ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్నవారు ఉన్నత స్థానాలకు ఎదగాలన్నా కంప్యూటర్ లిటరసీ ప్రధానం. నియామక పరీక్షల్లో వివిధ దశల్లో విజయం సాధించి, ఉద్యోగాల్లో చేరాక కంప్యూటర్ ప్రాథమిక పరిజ్ఞానం లేక పనిచేసే చోట ఎదిగే అవకాశాలను కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు. అందుకే కంప్యూటర్‌కు సంబంధించి బేసిక్స్‌పై థియరీ, ప్రాక్టికల్స్ పరంగా పట్టు సాధించడం ఈ రోజుల్లో ముఖ్యమన్నది గుర్తించాలి. ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ బేసిక్స్ పరిజ్ఞానం సంపాదించేందుకు ప్రయత్నించాలి. కొద్ది పాటి ఖర్చుతోనే మార్కెట్లో ఈ నైపుణ్యాలు అందించే ఇన్స్టిట్యూట్లు చాలానే ఉన్నాయి. ఎప్పుడో అవసరమైనప్పుడు చూద్దాంలే అని అనుకోకుండా ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలోనే కంప్యూటర్, ఇంటర్నెట్ అక్షరాస్యులుగా మారడం వల్ల జాబ్ మార్కెట్లో ముందు వరుసలో నిలవచ్చు. - ఎన్.రామకోటేశ్వరరావు, పీర్స్ టెక్నాలజీస్. -
ఉపాధికి మార్గం వేసే డిజిటల్ శిక్షణ
టాప్ స్టోరీ ప్రపంచం మొత్తం డిజిటల్ యుగం దిశగా దూసుకెళ్తోంది. అందివస్తున్న సాంకేతికత, చౌక ధరలకే లభ్యమవుతున్న ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్‌తో నవతరం డిజిటల్ వైపు మొగ్గుచూపుతోంది. రాబోయే కాలంలో విద్య, ఉద్యోగ సంబంధిత అంశాలతోపాటు ప్రభుత్వ పథకాలు, దైనందిన కార్యకలాపాలను అధిక శాతం డిజిటల్ మాధ్యమమే శాసించే అవకాశముంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అందరూ సాంకేతిక సాధికారత సాధించేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమమే.. నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్(ఎన్డీఎల్ఎం). తద్వారా పట్టణాలు, గ్రామాల్లోని యువత ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకోవచ్చు. 2015 చివరి నాటికల్లా 10 లక్షల మందికి డిజిటల్ శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలో ఈ శిక్షణ ద్వారా ప్రయోజనాలపై ఫోకస్... డిజిటల్ లిటరసీ అంటే.. అందరూ కంప్యూటర్ పరిజ్ఞానం అనుకుంటారు. వాస్తవానికి కావాల్సిన సమాచారాన్ని ఉపయోగించడం, నిక్షిప్తం చేయడం, విశ్లేషించే క్రమంలో డిజిటల్ సాంకేతికత, కమ్యూనికేషన్ టూల్స్/నెట్‌వర్క్‌ను ప్రభావవంతంగా వినియోగించే సామర్థ్యాన్ని కలిగి ఉండడమే డిజిటల్ లిటరసీ. వివరంగా చెప్పాలంటే.. సంప్రదాయ కంప్యూటర్లతోపాటు పీసీ, ల్యాప్‌టాప్ వంటి వాటి వినియోగంపై అవగాహన, కంప్యూటర్‌కు సంబంధించిన ప్రాథమిక పరికరాలపై పనిచేసే నేర్పు, కంప్యూటర్ నెట్వర్క్స్, ఈ-మెయిల్, సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ వంటివి వాడే విధానంపై స్పష్టత, కొన్ని సాఫ్ట్వేర్, హార్డ్వేర్ల వినియోగం వంటి అంశాల్లో నైపుణ్యాన్ని కలిగి ఉండటమే డిజిటల్ లిటరసీ. 2020 నాటికి.. ప్రపంచ డిజిటల్ ఎకానమీలో భారతదేశం అగ్రభాగాన నిలిచేలా నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్ దోహదపడుతుంది. రూరల్, అర్బన్ ప్రాంతాల ప్రజలు సాంకేతికంగా సాధికారత సాధించేలా చూడడమే దీని ప్రధాన ఉద్దేశం. డిజిటల్ సాంకేతికతతో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, ఈ-గవర్నెన్స్ ప్రాజెక్ట్‌లలో ప్రజలు చురుగ్గా పాల్గొనేలా చూడడం కూడా మరో లక్ష్యం. అంతేకాకుండా దేశంలోని గ్రామ పంచాయితీలను కూడా డిజిటల్ మాధ్యమం ద్వారా అనుసంధానించే కార్యక్రమం సైతం కొనసాగుతోంది. ఈ క్రమంలో 2020 నాటికి ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరైనా డిజిటల్ సంబంధిత అంశాల్లో నైపుణ్యం సాధించేలా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్‌ను ప్రారంభించారు. 18 నెలల కాలంలో 10 లక్షల మందికి దేశంలో వచ్చే 18 నెలల కాలంలో 10 లక్షల మందిని డిజిటల్ టెక్నాలజీలో అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (డైటీ) ఏర్పాటు చేసిన సీఎస్సీ-ఎస్పీవీ కం పెనీతో ద నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్(నాస్కామ్) ఫౌండేషన్ చేతులు కలిపింది. ఈ మేరకు నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్(ఎన్డీఎల్ఎం) తొలి దశ లక్ష్యాన్ని సాధించే దిశగా ఇరు సంస్థలూ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. పీపీపీ పద్ధతిలో పబ్లిక్-ప్రైవేట్-పార్ట్నర్షిప్ (పీపీపీ) పద్ధతిలో ఈ విభిన్న కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ క్రమంలో సీఎస్సీ-ఎస్పీవీ పాఠ్యాంశాలను రూపొందిస్తుంది. నాస్కామ్ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. దీని కోసం సైయంట్, కాగ్నిజెంట్, గూగుల్, ఇంటెల్ తదితర సంస్థలతో ఫౌండేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. రెండు కేంద్రాలు నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్‌లో భాగంగా.. నాస్కామ్.. జెన్సర్ టెక్నాలజీస్, డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఈ ఏడాది హైదరాబాద్, పుణెలలో కేంద్రాలను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లో ఈ ఏడాది జూలైలో, పుణెలో ఈ నెల ఆరో తేదీన ప్రారంభించిన కేంద్రాల్లో దాదాపు 3 వేల మందికి శిక్షణనిస్తారు. ఇందులో ప్రతి కుటుంబంలో ఒక్కరైనా డిజిటల్ విభాగాల్లో నైపుణ్యం సాధించేలా డిజిటల్ లిటరసీ, జాబ్ ఓరియెంటెడ్ ఇంగ్లిష్ ప్రోగ్రామ్, డీటీపీ, యానిమేషన్ సాఫ్ట్వేర్ డిజైన్, బిజినెస్- ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగామ్స్, వివిధ సామాజిక సమస్యలకు సంబంధించి అవగాహన, చర్చా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇవి లెక్చర్ సెషన్, గ్రూప్ ప్రాజెక్ట్, మోటివేషన్ సెషన్స్‌గా ఉంటాయి. డిజిటల్ లిటరసీ వీక్ నేషనల్ డిజిటల్ లిటరసీలో భాగంగా నాస్కామ్ తన భాగస్వామ్య కంపెనీలతో కలిసి సంయుక్తంగా డిసెంబర్ 8 నుంచి 12 వరకు డిజిటల్ లిటరసీ వీక్ నిర్వహించనుంది. ఇందులో భాగంగా వాలంటీర్ల రూపంలో ఐటీ ఉద్యోగుల సేవలను వినియోగించుకుని ఈ అంశంపై అవగాహన కల్పించనుంది. 2012లో ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 25వేల మందికి కంప్యూటర్ బేసిక్ స్కిల్స్‌ను నేర్పించారు. నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్ వెబ్సైట్: www.ndlm.in సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక ప్రయోజనాలు ‘‘నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్ ద్వారా వివిధ వర్గాల ప్రజలకు డిజిటల్ అక్షరాస్యత (డిజిటల్ లిటరసీ)పై అవగాహన పెంపొందిస్తారు. అంతేకాకుండా కంప్యూటర్ ఆధారితంగా పని చేసే పౌర సేవలను సులువుగా ఉపయోగించుకునే విధంగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒకరికి కంప్యూటర్ లేదా ఇతర డిజిటల్ సాధనాలను ఉపయోగించే విధానం, ఈ-మెయిల్ పంపడం.. చూసుకోవడం, ఈ-గవర్నెన్స్ ప్రాజెక్ట్‌లో చురుగ్గా పాల్గొనడం, కావాల్సిన సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి పొందే పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్‌లో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ప్రధానంగా యువత, మహిళలను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దీని ద్వారా ఆయా వర్గాలకు సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక ప్రయోజనాలు చేకూరతాయి. ఈ కార్యక్రమాన్ని సైయంట్ ఫౌండేషన్ ద్వారా హైదరాబాద్‌లోని కొన్ని ఎంపిక చేసిన పాఠశాలల్లో అమలు చేస్తారు. ఈ శిక్షణ కార్యమ్రాలకు సంబంధించిన మాడ్యూల్స్‌ను నాస్కామ్ ఫౌండేషన్ రూపొందిస్తుంది. ఇందులో ఆరోగ్యం, విద్య, అక్షరాస్యత, జీవన విధానాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి’’ -డాక్టర్ బి.వి. మోహన్ రెడ్డి, ఫౌండర్ అండ్ ట్రస్టీ, సైయంట్ ఫౌండేషన్. -
రేషన్-ఆధార్ అనుసంధానం 94 శాతమే !
శ్రీకాకుళం పాతబస్టాండ్: రేషన్ కార్డులకు సంబంధించి ఆధార్ నంబర్ల అనుసంధానం చేసే ప్రక్రియ గడువు ఆదివారంతో ముగియనుంది. ఈ మేరకు రాష్ట్ర పభుత్వం శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది. ఆదివారం నాటికి ఆధార్ సంఖ్యను ఆందజేయని రేషన్ కార్డు యూనిట్లను తొలగించి, శతశాతం ఆధార్ నమోదు లక్ష్యాలను చేరేందుకు అధికారులు సన్నద్ధమౌతున్నారు. మండల కార్యాలయాల్లోనూ, కలెక్టరేట్లోని కంప్యూటర్ టెక్నాలజీ సెంటర్లో పెద్ద ఎత్తున ఆధార్ అనుసంధాన కార్యక్రమంలో సివిల్ సప్లై ఆధికారులు బిజీ అయ్యూరు. అయితే పూర్తిస్థాయిలో ఆధార్ నంబర్ల అనుసంధానం జరగని కారణంగా జిల్లాలో పెద్ద ఎత్తున కార్డులతో పాటు సుమారుగా మూడు లక్షల యూనిట్లు రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే 220 మెట్రిక్ టన్నులు బియ్యం కూడా తగ్గనున్నాయి. ఈ ప్రభావం నిత్యవసర సరుకుల డీలర్లపై పడుతోందని వారు అందోళన చెందుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది జూన్ నెల నాటికి తెలుపు, అత్యోదయ, అన్నపూర్ణ, ర్యాప్, ట్యాప్ కార్డులు మొత్తం 7,79,562 ఉండేవి. ఆ కార్డులు సెప్టెంబర్ నాటికి 7,37,933 చేరాయి. అంటే ఈ మూడు నెలల్లో ఆధార్ అనుసంధానం, ఇతర కారణాల వల్ల సుమారుగా 31,629 కార్డులు వివిధ కారణాలవలన రద్దయ్యాయి. అలాగే కార్డులు ఉండి వాటిలో కొన్ని యూనిట్లకి ఆధార్ లేకపోవడంతో సుమారుగా మూడు లక్షల యూనిట్లు రద్దవుతున్నాయి. దీంతో భారీగా బియ్యం రేషన్‌లో కోత పడడం ఖాయం. ఈ పరిస్థితి డీలర్లకు తలనొప్పిగా మారే అవకాశం ఉంది. లబ్ధిదారులకు అందజేయలేక, ఒత్తిళ్లతో పాటు కార్డుదారుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని డీలర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఉన్న కార్డుల్లో 26,46,175 యూనిట్లు ఉన్నాయి. ఈ యూనిట్లకు ఇప్పటి వరకు 22,46,480 యూనిట్లు అనుసంధానం జరిగాయి. ఇంకా ఆధార్ అనుసంధానం కాని, రిజక్టు చేసిన యూనిట్లు 2,99,695 రద్దుకానున్నాయి. దీంతో సుమారుగా నెల వారీ విడుదలైన బియ్యంలో 220 మెట్రిక్ టన్నుల బియ్యం సెప్టెంబర్ నెలకు తగ్గుతున్నాయి. అంటే సగటున ప్రతి డీలర్‌కి 20 నుంచి 30 క్వింటాళ్ల వరకు బియ్యం తగ్గే అవకాశం ఉంది. దీంతో ఉన్న బియ్యాన్ని పంపిణీ చేయడం డీలర్లకు సమస్యగా మారనుంది. కాగా ఇప్పటి వరకూ జిల్లాలో సగటున 94.05 శాతం యూనిట్లకి ఆధార్ నంబర్లను అనుసంధానం చేశారు. ఈ ప్రక్రియ ఆదివారంతో ముగియడంతో అనుసంధానం కాని యూనిట్లను తొలగించే అవకాశం ఉండడంతో లబ్ధిదారులు నష్టపోయే అవకాశం ఉంది. ఇంకా విడుదల కాని సెప్టెంబర్ రేషన్ సెప్టెంబర్ నెల బియ్యం ఇంతవరకు ఒక్క డిపోకి కూడా విడుదల కాలేదు. ఈపీడీఎస్ విధానం అనుసరించడం, యూనిట్లు తగ్గించడంతో బియ్యం, ఇతర సరుకుల కోసం డీడీలు చెల్లించేందుకు డీలర్లు ముందుకు రావడంలేదు. ఇప్పటి వరకు డీలర్లకి ఆధార్ అనుసంధానం అనంతరం సవరించిన కీ రిజిస్టార్‌ను సంబంధిత ఆధికారలు అందజేయలేదు. అలాగే ఆధార్ లేక రద్దైన యూనిట్ల వివరాలతో కూడిన జాబితాను ఇవ్వలేదు. దీంతో డీలర్లు ఎమి చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. గతంలో తరువాత వచ్చే నెలకు సంబంధించి ముందుగానే 18వ తేదీ నాటికే డీడీలను కట్టేలా అధికారులు డీలర్లపై ఒత్తిడి చేసేవారు. అయితే ఈ నెల ఆధికారులు సకాలంలో కీ రిజిస్టార్లు అందజేయక ఇబ్బందులు పడుతున్నారు. -
సాఫ్ట్వేర్ లోపాలను సరిదిద్దే.. ఐటీ టెస్టర్
అప్‌కమింగ్ కెరీర్ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రాకతో నూతన ఉద్యోగావకాశాలు యువత తలుపు తడుతున్నాయి. వాటిలో ఒకటి ఐటీ టెస్టింట్. సాఫ్ట్వేర్లలోని లోపాలను పసిగట్టి, వాటిని సరిచేయడమే ఐటీ టెస్టింగ్. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారు ఈ రంగాన్ని ఎంచుకోవచ్చు. స్కిల్స్ పెంచుకుంటూ కష్టపడి పనిచేస్తే ఉన్నతస్థాయికి చేరుకోవచ్చు. దేశ విదేశాల్లో మంచి అవకాశాలు, భారీ వేతనాలు అందుకొనేందుకు వీలు కల్పిస్తున్న నయా కెరీర్.. ఐటీ టెస్టింగ్. నైపుణ్యం పెంచుకుంటే అధిక ఆదాయం కంపెనీలు తమ కార్యకలాపాల కోసం కంప్యూటర్లలో ఎన్నో రకాల సాఫ్ట్వేర్లను ఉపయోగిస్తుంటాయి. అవి సక్రమంగా పనిచేసినంత కాలం ఎలాంటి ఇబ్బంది ఉండదు. సాఫ్ట్వేర్లలో లోపాలు తలెత్తితే మాత్రం భారీ నష్టం జరుగుతుంది. ప్రధానంగా స్టాక్ ఎక్ఛేంజ్‌లు, బ్యాంకులు, విమానయాన సంస్థల్లో సాఫ్ట్వేర్లు సజావుగా పనిచేసేలా చూసేందుకు ఐటీ టెస్టర్లను నియమిస్తున్నారు. కార్పొరేట్ సంస్థల్లో వీరికి ఉద్యోగావకాశాలు దక్కుతున్నాయి. ఈ రంగంలో ప్రారంభంలో తక్కువ వేతనాలు ఉన్నా పరిజ్ఞానం, అనుభవం పెంచుకుంటే అధిక ఆదాయం ఆర్జించడానికి వీలుంటుంది. ఐటీ టెస్టర్లకు భారీ డిమాండ్ ఐటీ టెస్టింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలంటే.. దీనికి సంబంధించిన టెక్నాలజీ, టూల్స్‌పై నాలెడ్జ్ పెంచుకోవాలి. దీంతోపాటు లాజికల్ అనాలిసిస్, డిడక్షన్, అబ్జర్వేషన్, రీజనింగ్, ప్లానింగ్, టీమ్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ అండ్ రిపోర్టింగ్, ప్రజంటేషన్ స్కిల్స్‌ను అలవర్చుకోవాలి. ఫంక్షనల్ డొమైన్ నాలెడ్జ్, ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ తప్పనిసరిగా ఉండాలి. సాఫ్ట్వేర్ క్వాలిటీ ఇంజనీరింగ్, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు కూడా అవసరం. కొత్త కొత్త సాఫ్ట్వేర్లు తెరపైకి వస్తుండడంతో వాటి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. మనదేశంలో స్కిల్డ్ ఐటీ టెస్టర్లకు భారీ డిమాండ్ ఉందని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ అవసరాలకు తగినంత మంది టెస్టర్లు అందుబాటులో లేరని అంటున్నారు. ఐటీ టెస్టింగ్ రంగం వేగంగా వృద్ధి చెందుతోందని పేర్కొంటున్నారు. ఔత్సాహికులు ఇందులోకి నిరభ్యంతరంగా ప్రవేశించవచ్చని సూచిస్తున్నారు. అర్హతలు: ఐటీ టెస్టింగ్‌లో స్పెషలైజ్డ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్మీడియెట్, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత వీటిలో చేరొచ్చు. ఐటీ టెస్టింగ్‌పై శిక్షణ పొందిన బీఎస్సీ, బీఈ, బీసీఏ విద్యార్థులను కంపెనీలు ఎక్కువగా నియమించుకుంటున్నాయి. సాఫ్ట్వేర్ అభ్యర్థులు టెక్నికల్, సాఫ్ట్ స్కిల్స్‌పై దృష్టి పెట్టాలి. ్డ వేతనాలు: ట్రైనీ నుంచి డెరైక్టర్ వరకు వివిధ హోదాల్లో పనిచేసే ఐటీ టెస్టర్లకు వేర్వేరు వేతనాలు ఉంటాయి. టెస్ట్ ఇంజనీర్‌కు నెలకు రూ.8 వేల నుంచి రూ.13 వేలు, సీనియర్ టెస్ట్ ఇంజనీర్‌కు రూ.15 వేల నుంచి రూ.20 వేలు, టెస్ట్ లీడర్‌కు రూ.30 వేల నుంచి రూ.50 వేలు, టెస్ట్ ఆర్కిటెక్ట్‌కు రూ.50 వేల నుంచి రూ.75 వేలు, టెస్ట్ మేనేజర్‌కు రూ.75 వేల నుంచి రూ.లక్షన్నర, హెడ్ టెస్టింగ్‌కు రూ.లక్షన్నర నుంచి రూ.రెండున్నర లక్షల వేతనం అందుతుంది. ఐటీ టెస్టింగ్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు క్యూఏఐ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్: www.qaiglobalinstitute.com ఎడిస్టా టెస్టింగ్ ఇన్స్టిట్యూట్-బెంగళూరు వెబ్సైట్: www.edistatesting.com అమిటీ సాఫ్ట్-చెన్నై వెబ్సైట్: www.amitysoft.com సాఫ్ట్వేర్ క్వాలిటీ ఇంజనీరింగ్ వెబ్సైట్: www.sqe.com ఎన్నో రంగాల్లో అవకాశాలు శ్రీరాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్ రంగం మరింత విస్తరించనుంది. దేశ, విదేశాల్లోనూ మంచి కెరీర్ ఉన్న కోర్సు ఐటీ టెస్టింగ్. విద్య, వైద్యం, ఆరోగ్యం, ఫైనాన్స్ రంగాలతోపాటు ఐటీలోనూ ఐటీ టెస్టింగ్ నిపుణుల పాత్ర ఎంతో కీలకం. ఇది కెరీర్ పరంగా ఉన్నత స్థానానికి చేరేందుకు స్కోప్ ఉన్న కోర్సు. అయితే ప్రభుత్వ రంగంతో పోల్చితే ప్రైవేట్ రంగంలోనే అవకాశాలు అధికం. ఉద్యోగ అవకాశాలతోపాటు ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగేందుకు వీలుంది. ఆసక్తి ఉంటే స్నేహితులు, సహచరులతో కలిసి కన్సల్టెన్సీని ఏర్పాటు చేసుకోవచ్చ్ణు - ఆర్.లక్ష్మణ్‌నాయక్, క్యాంపస్ ప్లేస్మెంట్ ఇన్‌ఛార్జి, ఆర్.జి.యు.కె.టి. వైఎస్సార్ కడప జిల్లా కాంపిటీటివ్ కౌన్సెలింగ్ సివిల్స్ మెయిన్స్‌లో హిస్టరీ ఆప్షనల్‌కు ఎలా ప్రిపేర్ కావాలో తెలియజేయండి? - ఎస్.మేఘన సాయిశ్రీ, మలక్‌పేట సివిల్స్ మెయిన్సలో 250 మార్కుల చొప్పున రెండు పేపర్లుగా హిస్టరీ ఆప్షనల్ ఉంది. అందులో పేపర్-1లో కీలకంగా చెప్పుకోవాల్సింది మ్యాప్ పాయింటింగ్. దీనికి 50 మార్కులు కేటాయించారు. గతంలో ప్రదేశాల పేర్లు ఇచ్చి వాటిని మ్యాప్‌లో గుర్తించమనేవారు. అంతేకాకుండా మూడు నుంచి నాలుగు వాక్యాల వివరణ రాయాల్సి ఉండేది. ఈసారి పాయింట్లను గుర్తించిన మ్యాప్ ఇచ్చి, ఆ పాయింట్లో ఉండే ప్రాంతాన్ని కనుగొని, దానిపై వివరణ రాయమని అడిగారు. అయితే క్లూగా అది ఏ రకమైన ప్రాంతం అనే అంశాన్ని తెలిపారు. మ్యాప్‌పై, ఆయా ప్రదేశాలపై పూర్తి అవగాహన ఉంటేనే సులువుగా వీటికి సమాధానం రాయొచ్చు. మిగిలిన ప్రశ్నల విషయానికొస్తే గత ఆప్షనల్ ప్రశ్నలకు, ఇప్పుడిచ్చిన ప్రశ్నలకు పెద్ద వ్యత్యాసం లేదు. ప్రశ్నలన్నీ అధికంగా రాజకీయేతర అంశాల నుంచి అడిగారు. అయితే ఏ ప్రశ్నకు రెడీమేడ్ సమాధానం లభించదు. ప్రశ్న సరళిని బట్టి అభ్యర్థి వద్ద ఉన్న సమాచారాన్ని ప్రశ్నకనుగుణంగా మార్చి సమాధానం రాయాల్సి ఉంటుంది. అభ్యర్థులు అధ్యయనం సమయంలోనే ఆయా అంశాలపై ప్రశ్నలు ఏవిధంగా అడిగే అవకాశముంటుందో కొంత మేరకు ఊహించాలి. దానికనుగుణంగా పరిపూర్ణంగా సిద్ధమైతే ప్రశ్నలు ఎలా వచ్చినా అప్పటికప్పుడే సమాధానాన్ని రాయొచ్చు. గతేడాది కంటే ప్రశ్నల సంఖ్య పెరిగింది. అన్ని ప్రశ్నలకు సమాధానం రాయడానికి అభ్యర్థులకు సమయం సరిపోలేదు. బాగా సాధన చేసినవారే సమాధానాలు రాయగలిగారు. కాబట్టి అభ్యర్థులు ఈ మార్పులను దృష్టిలో ఉంచుకుని తమ ప్రిపరేషన్ శైలిని మార్చుకొంటేనే విజయం సాధ్యం. ఇన్పుట్స్: యాకూబ్‌బాష, సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ స్కాలర్షిప్స్, జాబ్స్ అలర్ట్స నేషనల్ స్కూల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ లోర్ ఇండియన్ ఫౌండేషన్ టెన్త్, ఇంటర్ చదువుతున్న విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న నేషనల్ స్కూల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులు కోరుతోంది. టీసీఎస్ రూపొందించిన ద లెర్నింగ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఎల్ఏటీ) పరీక్ష ద్వారా ప్రతిభావంతులను ఈ స్కాలర్షిప్కు ఎంపిక చేస్తారు. ఈ పరీక్షను హిందీ, ఇంగ్లిష్ భాషల్లో నిర్వహిస్తారు. ఎంపికైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌తో పాటు గవర్నెన్స కౌన్సిల్ నుంచి కెరీర్ గెడైన్స్‌ను పొందే అవకాశం లభిస్తుంది. ఐఐటీ, ఐఐఎం, ఐఎస్బీ, ఎంసీఐ, యూజీసీ లాంటి సంస్థలకు చెందిన ప్రొఫెసర్లు, రిటైర్డ్ ప్రొఫెసర్లు గవర్నెస్ కౌన్సిల్లో ఉంటారు. పూర్తి వివరాలకు www.lorefoundation.org వెబ్‌సైట్‌ను సదర్శించొచ్చు. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఏడీఏ) బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఏడీఏ) స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. స్టెనోగ్రాఫర్ అర్హతలు: ఏదైనా డిగ్రీ, జూనియర్ లెవల్ ఇంగ్లిష్ షార్ట్‌హ్యాండ్, ఇంగ్లిష్ టైప్‌రైటింగ్‌లో ఉత్తీర్ణులై ఉండాలి లేదా సెక్రటేరియల్/ కమర్షియల్ ప్రాక్టీస్‌లో డిప్లొమా, కంప్యూట ర్ అప్లికేషన్స్‌లో సర్టిఫికెట్ ఉండాలి. వయసు: 30 ఏళ్లకు మించకూడదు. ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా. చివరి తేది: ఆగస్టు 19 వెబ్సైట్: www.ada.gov.in. జనరల్ నాలెడ్‌జ భారత రాజ్యాంగ ఆధారాలు ఆధారం {Vహించిన అంశాలు భారత ప్రభుత్వ చట్టం-1935 కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల మధ్య అధికార విభజన, ద్విసభా విధానం, రాష్ర్టపతికి, రాష్ర్ట గవర్నర్లకు విచక్షణాధికారాలు బ్రిటన్ రాజ్యాంగం క్యాబినెట్ తరహా పార్లమెంటరీ విధానం, సమన్యాయ పాలన, ఏక పౌరసత్వం, స్పీకర్ హోదా, విధులు అమెరికా రాజ్యాంగం {పాథమిక హక్కులు, స్వతంత్ర న్యాయవ్యవస్థ, ఉపరాష్ర్టపతి ఎన్నిక, న్యాయ సమీక్ష, రాష్ర్టపతి తొలగింపు ఐర్లాండ్ రాజ్యాంగం ఆదేశిక సూత్రాలు, రాజ్యసభకు విశిష్ట వ్యక్తులను నామినేట్ చేయడం, రాష్ర్టపతి ఎన్నిక కెనడా రాజ్యాంగం సమాఖ్య విధానం, బలమైన కేంద్ర ప్రభుత్వం, కేంద్రానికి అవశిష్టాధికారాలు వైమర్ (జర్మనీ) రాజ్యాంగం అత్యవసర పరిస్థితికి సంబంధించిన అధికారాలు భారతదేశ చరిత్రలో ప్రముఖ యుద్ధాలు యుద్ధం జరిగిన సం॥ వివరాలు మొదటి మరాఠా యుద్ధం 1775-82 {బిటిషర్లకు, మరాఠాలకు మధ్య రెండో మరాఠా యుద్ధం 1803-05 {బిటిషర్లకు, మరాఠాలకు మధ్య మూడో మరాఠా యుద్ధం 1817-18 మరాఠాల తిరుగుబాటు మొదటి ఆంగ్లో-సిక్కు యుద్ధం 1845-46 సిక్కుల తిరుగుబాటు రెండో ఆంగ్లో-సిక్కు యుద్ధం 1848-49 పంజాబ్‌ను ఆక్రమించిన బ్రిటిష్ పాలకులు అంబూర్ యుద్ధం 1749 ముజఫర్ జంగ్, చందాసాహెబ్, ఫ్రెంచి గవర్నర్ డూప్లే కలిసి కర్ణాటక నవాబైన అన్వరుద్దీన్‌ను చంపారు వాందివాశి యుద్ధం 1760 {బిటిష్ సేనాని సర్ ఐర్ క్రూట్.. ఫ్రెంచి వారైన జనరల్ బుస్సీ,కౌంట్-డి-లాలీని ఓడించాడు నల్లమందు యుద్ధం 1856-1860 చైనీయులకు, బ్రిటిషర్లకు మధ్య జరిగింది. -
కంప్యూటర్ విద్య..బోధన మిథ్య
కొవ్వూరు : ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ఆధారిత విద్యావిధానం అటకెక్కింది. ఐదేళ్లపాటు నిర్వహణ బాధ్యతలు స్వీకరించిన కాంట్రాక్టు సంస్థల గడువు గత ఏడాది సెప్టెంబర్‌తో ముగిసింది. దీంతోకంప్యూటర్ ఫ్యాకల్టీలను (బోధకులు) తొలగించారు. జిల్లాలో 280 పాఠశాలల్లో కంప్యూటర్ విద్యావిధానం అమలులో ఉంది. వీటిలో పనిచేసే 560 మంది ఫ్యాకల్టీలను తొలగించడం తో కంప్యూటర్ ఆధారిత విద్యాబోధన పూర్తిగా నిలిచిపోయింది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఉపాధ్యాయుల చేతే కంప్యూటర్ విద్యావిధానాన్ని కొనసాగించాలని అధికారులు భావించారు. అయితే, సరైన శిక్షణ లేకపోవడం, అవగాహన కొరవడడంతో జిల్లాలోని అన్ని పాఠశాలల్లోను కంప్యూటర్లు మూలనపడ్డాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు కంప్యూటర్ విద్యను బోధించేవారు. 2008లో రాష్ట్రవ్యాప్తంగా 5 వేల పాఠశాలల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కంప్యూటర్ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలోని 6,300 పాఠశాలల్లో ఐదేళ్లపాటు కాంట్రాక్టు పద్ధతిన ప్రైవేటు సంస్థలకు నిర్వహణ బాధ్యతలను అప్పగిం చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 3,782 పాఠశాలల్లో ఈ విద్యావిధానం అమలులో ఉంది. ఉభయగోదావరి, కృష్ణా, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో కంప్యూటర్ ఆధారిత విద్యాబోధన బాధ్యతలను నిట్ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ సంస్థకు ఇచ్చిన గడువు గత ఏడాది సెప్టెంబర్‌తో ముగిసింది. ఒక్కో పాఠశాలకు ఇరువురు ఫ్యాకల్టీల చొప్పున 7,564 మంది ఫ్యాకల్టీలు ఉపాధి పొందేవారు. వీరందరినీ తొలగించడంతో ఉపాధి కోల్పోగా, విద్యార్థులు పూర్తిస్థాయిలో కంప్యూటర్ విద్యకు దూరమయ్యారు. తెరుచుకోని తాళాలు కంప్యూటర్ ఆధారిత విద్యాబోధన కోసం కోట్లాది రూపాయల్ని వెచ్చించి సర్వశిక్షాభియూన్ ఆధ్వర్యంలో ఒక్కో పాఠశాలకు 10 నుంచి 12 చొప్పున కంప్యూటర్లను అందజేశారు. ప్రింటర్, యూపీఎస్‌లను సైతం సమకూర్చారు. వీటి సాయంతో తెలు గు, లెక్కలు, ఇంగ్లిష్, పరిసరాల విజ్ఞానం పాఠాలు సులభమైన రీతిలో ఆడియో, వీడియో ద్వారా బోధించేవారు. విద్యార్థులకు నెలవారీ పరీక్షలు కూడా నిర్వహించేవారు. తరగతి గదులు మూతపడటంతో లక్షలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన కంప్యూటర్లు, జనరేటర్లు మూలనపడ్డాయి. ఈ నెల 12న పాఠశాలలు పునఃప్రారంభమయ్యూరుు. కం ప్యూటర్ ఫ్యాకల్టీలను నియమిస్తే తప్ప కంప్యూటర్ ఆధారిత విద్య అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. దీనిని పునరుద్ధరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యారంగ నిపుణులు కోరుతున్నారు. ఫ్యాకల్టీలను విధుల్లోకి తీసుకోవాలి గత ఏడాది కంప్యూటర్ ఫ్యాకల్టీలను తొలగించారు, ఒక్క సీ మాంధ్ర జిల్లాల్లోనే 7,564 మంది ఉపాధి కోల్పోయూరు. ఫ్యాకల్టీలను ప్రభుత్వం వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. కాంట్రాక్టు సంస్థల ద్వారా కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే కంప్యూటర్ విద్యా విధానాన్ని నడిపించాలి. ఫ్యాకల్టీలకు కనీస వేతనాన్ని అమలు చేయాలి. - వై.నరసింహరాజు, అధ్యక్షుడు, కంప్యూటర్ టీచర్స్ అసోసియేషన్ కొనసాగించాలి ప్రతి విద్యార్థికి కంప్యూటర్ పరి జ్ఞానం ఎంతో అవసరం. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్‌ను దృ ష్టిలో ఉంచుకుని కంప్యూటర్ వి ద్యను పునఃప్రారంభించాలి. ప్రై వేటు విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు తయారుకావడానికి కంప్యూటర్ విద్య విధా నం ఉపకరిస్తుంది. విద్యార్థులు కూడా ప్రతిభను పెంపొందించుకునే అవకాశం లభిస్తుంది. - వి.గంగాభవాని, ప్రధానోపాధ్యాయిని, కొవ్వూరు ఉపాధి కోల్పోయాం ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ఫ్యాకల్టీలను తొలగించి మా ఉపాధిని దెబ్బతీశారు. నూతన ప్రభుత్వం ఫ్యాకల్టీలను విధుల్లోకి తీసుకుని ఉపాధి కల్పించాలి. విద్యార్థులకు మెరుగైన కంప్యూటర్ విద్యను అందించే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించాలి. ఫ్యాకల్టీలను తొలగించడం వల్ల పాఠశాలల్లోని కంప్యూటర్లు మూలనపడ్డాయి. - ఎ.వీరబాబు, కంప్యూటర్ ఫ్యాకల్టీ, ఊనగట్ల -
మీసేవ.. మా ఇష్టం!.
కేంద్రాల్లో అనర్హులు - కేటాయింపులో నిబంధనలు బేఖాతరు - బినామీల నిర్వహణతో అస్తవ్యస్తం - పల్లెల పేరిట మంజూరు.. పట్టణాల్లో ఏర్పాటు - 60 కేంద్రాల్లో ఒక్క కంప్యూటరే దిక్కు - సేవల్లో జాప్యంతో ప్రజల బేజారు కర్నూలు(కలెక్టరేట్): మీసేవ కేంద్రాల్లో బినామీలు పాగా వేశారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ఉద్దేశించిన ఈ కేంద్రాల్లో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 287 మీసేవ కేంద్రాలను నిర్వహిస్తుండగా అధిక శాతం ఎలాంటి అర్హత లేని వ్యక్తుల చేతుల్లో ఉండటం గమనార్హం. పలుకుబడి.. పైరవీలతో దక్కించుకున్న కేంద్రాలను చాలా మంది లీజుకిచ్చి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం డిగ్రీ చదివి కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన నిరుద్యోగులకే వీటిని కేటాయించాల్సి ఉంది. అయితే 10వ తరగతి చదివి కనీసం కంప్యూటర్ పరిజ్ఞానం లేని వ్యక్తులకు సైతం మీసేవ కేంద్రాలను కట్టబెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. హెచ్‌సీఎల్‌కు సంబంధించి అర్బన్‌లో 12, ఇతర ప్రాంతాల్లో 54 కేంద్రాలు ఉండగా.. 10 సెంటర్లను బినామీలకు కట్టబెట్టారు. సీఎంఎస్ నిర్వహణలోని మీసేవ కేంద్రాలు 178 ఉండగా.. 50 వరకు ఇతరుల చేతుల్లో ఉన్నట్లు సమాచారం. ఏపీ ఆన్‌లైన్‌కు సంబంధించిన కేంద్రాలు 55 ఉండగా.. సగం వరకు బినామీలే నిర్వహిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. మీసేవ కేంద్రాలు ఏ గ్రామానికి మంజూరైతే అక్కడే ఏర్పాటు చేయాలనే నిబంధనను కాలరాశారు. గ్రామాల పేరుతో అనుమతి పొంది పట్టణాల్లో నిర్వహిస్తుండటంతో గ్రామీణులకు నిరాశే ఎదురవుతోంది. ఆదోని మండలంలోని సాదాపురం, బసాపురం గ్రామాలకు మీసేవ కేంద్రాలు మంజూరు కాగా.. వీటిని ఆదోని పట్టణంలో ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇలాంటి అక్రమాలు అనేకం చోటు చేసుకున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. ఇక మీసేవ కేంద్రాల్లో తగినంత మంది ఆపరేటర్లను నియమించకపోవడంతో సర్టిఫికెట్ల జారీ ఆలస్యమవుతోంది. హెచ్‌సీఎల్‌కు చెందిన అర్బన్ కేంద్రాల్లో పని ఒత్తిడి అధికంగా ఉన్నా అందుకు తగినట్లుగా ఆపరేటర్లను నియమించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఏపీ ఆన్లైన్, సీఎంఎస్ సెంటర్లలోనూ తగినన్ని కంప్యూటర్లు లేకపోవడంతో సేవల్లో జాప్యం జరుగుతోంది. ఒకే సిస్టంతో పని చేస్తున్న మీసేవ కేంద్రాలు జిల్లాలో 60 వరకు ఉన్నా అధికారులు చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. -
కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి
కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : అధ్యాపకులు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొం దించుకోవాల్సిన అవసరం ఉందని కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ బి.వెంకటరత్నం అన్నారు. కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖ, నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ఐసీటీ అనే కార్యక్రమంలో భాగంగా కేయూ ఇంజినీరింగ్ కళాశాలలో మైక్రోసాఫ్ట్ సంస్థ సహకారంతో అధ్యాపకులకు పది రోజులుగా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీపై నిర్వహిస్తున్న శిక్షణ గురువా రం ముగిసింది. ఈ సందర్భంగా వీసీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం అన్నారు. కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అధ్యాపకులు ఐసీటీ పరిశోధనలతోపాటు, తరగతి గదిలో విరివిగా ఉపయోగించుకునే అవకాశాలున్నాయని వివరించారు. ఇలాంటి శిక్షణ శిబి రాలు నూతన టెక్నాలజీపై ఎంతో అవగాహన కలిగిస్తాయని తెలిపారు. కేయూలో అకడమిక్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాల ఏర్పాటు చేసే యోచన ఉందని, ఈ మేరకు ప్రతిపాదనలను కూడా రూపొందించామన్నారు. గ్రంథాలయం లో విద్యార్థి సాధికారిత విభాగం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.సాయిలు మాట్లాడుతూ నేడు ఈ క్లాస్ రూం, ఈ బుక్స్, ఈ జర్న ల్స్, ఈ కాంటెంట్ సర్వసాధారణమయ్యాయని చెప్పా రు. వీటిని అధ్యాపకులు ఉపయోగించుకోవాలని కోరా రు. పది జీబీఎస్‌తో క్యాంపస్‌లో వైఫై ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ సీనియర్ ప్రాజెక్టు మేనేజర్ షహీనా షఫీ మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న అంశాలను తోటి అధ్యాపకులు, విద్యార్థులకు నేర్పాలని సూచించారు. ప్రోగ్రాం కన్వీనర్, కేయూ వెబ్ ఇన్చార్జ ఎన్.రమణ మాట్లాడుతూ కొందరు అధ్యాపకులకు శిక్షణ ఇచ్చామన్నారు. కేయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసులు మాట్లాడుతూ కంప్యూటర్ బోధనలో అనేక మార్పులు వచ్చాయని తెలిపారు. మైక్రోసాఫ్ట్ ప్రతినిధి తోమర్, ఎస్.నర్సింహాచారి, వై.వెంక య్య, ఎం.సురేఖ, షాయదా, ముంజం శ్రీనివాస్ పాల్గొన్నారు. శిక్షణ పొందిన అధ్యాపకులకు వీసీ వెంకటరత్నం సర్టిఫికెట్లను అందజేశారు. -
దొరకునా ‘మీసేవ’ ?
=నిరంతరం సర్వర్ల్ల డౌన్ =సమయపాలన లేదు =విద్యుత్‌కోతలతో అంతరాయం =అధిక చార్జీల వసూలు =సేవల్లో జాప్యం =కొన్నిచోట్ల విద్యుత్ బిల్లులు కట్టించుకోని నిర్వాహకులు =దరఖాస్తుదారులకు తిప్పలు జిల్లాలోని మీ-సేవ కేంద్రాలు అలంకారప్రాయంగా మారాయి. కొన్ని కేంద్రాల్లో నిర్ణీత చార్జీల కంటే అధికంగా వసూలు చేస్తున్నారు. కంప్యూటర్ పరిజ్ఞానం లేని ఆపరేటర్ల కారణంగా దరఖాస్తుదారులకు అవస్థలు తప్పడం లేదు. సర్టిఫికెట్ల కోసం నెలల తరబడి తిరుగుతున్న వారూ ఉన్నారు. ఇదేనా మీ-సేవ కేంద్రాల పనితీరు అంటూ జనం మండిపడుతున్నారు. సాక్షి, చిత్తూరు: ఈ సేవ పేరును మీ-సేవగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మార్చారు. జిల్లాలో 186 మీ-సేవ కేంద్రాలు ఉన్నాయి. కొత్తగా 81 కేంద్రాలకు ప్రతిపాదనలు పంపారు. మొత్తం 20 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 225 రకాల సేవలను ఈ కేంద్రాల ద్వారా అందిస్తామని అధికారులు ఘనంగా ప్రకటించారు. తక్కువ రోజుల్లోనే సర్టిఫికెట్ల జారీ, ఇక కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదంటూ ఊదరగొట్టారు. అయితే 30 లోపు సేవలు మాత్రమే ప్రజలకు అందుతున్నాయి. ఈ సేవలూ సర్వర్ సమస్య కారణంగా నెలలో పదిహేను రోజులు అందడం లేదు. ఈ పరిస్థితి మండల కేంద్రాల్లో మరింత ఎక్కువగా ఉంది. చాలాచోట్ల మీసేవ నిర్వాహకులు నిర్ణీత మొత్తం కంటే అధికంగా వసూలు చేస్తున్నారు. మదనపల్లెలో 14 మీసేవ కేంద్రాలు ఉన్నాయి. చాలా వాటిల్లో సమయపాలన పాటించడం లేదు. దరఖాస్తులను ఆయా విభాగాలకు పంపడంలో జాప్యం జరుగుతోంది. కొన్ని కేంద్రాలకు మీసేవ అనే బోర్డులూ లేవు. చాలా చోట్ల ఏఏ సేవలు పొందవచ్చో తెలిపే సూచికబోర్డులు లేవు. విద్యుత్‌బిల్లులు చెల్లించినా నిర్ణీత సమయంలో ఆన్లైన్ కాకపోవడంతో సర్వీసు కట్ చేస్తున్నారు. సత్యవేడు నియోజకవర్గంలో మీ-సేవా కేంద్రాల పనితీరుపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సర్వర్ల బ్రేక్, విద్యుత్ కోతల కారణంగా సకాలంలో సేవలు అందడం లేదు. పలమనేరు నియోజకవర్గంలో 17మీసేవ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ 25 సేవలు మాత్రమే అందుతున్నాయి. ఏఏ సేవలకు ఎంత చార్జీ అనే వివరాలు ఎక్కడా లేవు. బెరైడ్డిపల్లె మండలంలో ప్రతి కులానికీ అఫిడవిట్ కావాలని అడుగుతున్నారు. కులం సర్టిఫికెట్‌కు చార్జీ 30 రూపాయలు. అయితే అఫిడవిట్ కోసం పలమనేరుకు వచ్చి వెళ్లేందుకు రూ.400 వరకు ఖర్చవుతోంది. మీసేవ కేంద్రం నిర్వాహకులు సమయపాలన పాటించడం లేదు. సర్వర్లు అప్పుడప్పుడూ మొరాయిస్తున్నాయి. నిర్ణీత చార్జీలు వసూలు చేయడం లేదు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఆరు మీసేవ కేంద్రాలు ఉన్నాయి. వీటిని కంప్యూటర్ పరిజ్ఞానం లేనివారు నిర్వహిస్తున్నారు. నిర్ణీత సమయంలో సర్టిఫికెట్ల జారీ జరగడం లేదు. చిన్న సర్టిఫికెట్ కోసమూ నెలల తరబడి తిరుగుతున్న వారున్నారు. దీనిపై నిర్వాహకులు సరైన సమాధానం ఇవ్వడం లేదు. నగరి నియోజకవర్గంలో ఏడు మీసేవ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. కులం, ఆదాయం, ఓటరు కార్డు సేవలు మాత్రం అందుతున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖ సేవలు, మున్సిపల్ ఇంటిపన్ను కట్టించుకోవడం లేదు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 12 మీసేవ కేంద్రాలు ఉన్నాయి. శ్రీకాళహస్తి పట్టణంలో మున్సిపల్ అధికారులు, రిజిస్ట్రేషన్‌శాఖ అధికారులు సంబంధిత సర్టిఫికెట్ల జారీలో జాప్యం చేస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో నిర్ణీత చార్జీ కంటే అధికంగా వసూలు చేస్తున్నారు. కరకంబాడి, పాపనాయుడుపేట మీసేవ కేంద్రాలు విద్యుత్‌కోతల వల్ల పని చేయడం లేదు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కేంద్రాల నిర్వాహకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. తిరుపతి నియోజకవర్గంలో తొమ్మిది మీసేవ కేంద్రాలు ఉన్నాయి. సేవలు పూర్తి స్థాయిలో అందడం లేదు. బర్త సర్టిఫికెట్లు, మరికొన్ని రెవెన్యూసేవలు అందడం లేదు. ఒక్కో సర్టిఫికెట్ కోసం నాలుగైదు సార్లు తిప్పించుకుంటున్నారు. జీడీ నెల్లూరు నియోజకవర్గంలో మీసేవ కేంద్రాల నిర్వహణ సరిగా లేదు. పెనుమూరు, వెదురుకుప్పం, పాలసముద్రం మండలాల్లోని కేంద్రాల్లో విద్యుత్‌చార్జీలు కట్టించుకోవడం లేదు. చంద్రగిరి నియోజకవర్గంలో 12 కేం ద్రాలు ఉన్నాయి. చంద్రగిరి కేంద్రంలో బర్త సర్టిఫికెట్ల జారీ, రెవెన్యూ సేవల్లో జాప్యం జరుగుతోంది. పోలీస్‌శాఖ జారీ చేసే ఎఫ్ఐఆర్, ఇతర సర్టిఫికెట్లు మీసేవ ద్వారా అందడం లేదు.