కంప్యూటర్ విద్య..బోధన మిథ్య | computer education | Sakshi
Sakshi News home page

కంప్యూటర్ విద్య..బోధన మిథ్య

Published Tue, Jun 17 2014 2:02 AM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM

కంప్యూటర్ విద్య..బోధన మిథ్య - Sakshi

కంప్యూటర్ విద్య..బోధన మిథ్య

 కొవ్వూరు : ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ఆధారిత విద్యావిధానం అటకెక్కింది. ఐదేళ్లపాటు నిర్వహణ బాధ్యతలు స్వీకరించిన కాంట్రాక్టు సంస్థల గడువు గత ఏడాది సెప్టెంబర్‌తో ముగిసింది. దీంతోకంప్యూటర్ ఫ్యాకల్టీలను (బోధకులు) తొలగించారు. జిల్లాలో 280 పాఠశాలల్లో కంప్యూటర్ విద్యావిధానం అమలులో ఉంది. వీటిలో పనిచేసే 560 మంది ఫ్యాకల్టీలను తొలగించడం తో కంప్యూటర్ ఆధారిత విద్యాబోధన పూర్తిగా నిలిచిపోయింది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఉపాధ్యాయుల చేతే కంప్యూటర్ విద్యావిధానాన్ని కొనసాగించాలని అధికారులు భావించారు. అయితే, సరైన శిక్షణ లేకపోవడం, అవగాహన కొరవడడంతో జిల్లాలోని అన్ని పాఠశాలల్లోను కంప్యూటర్లు
 
 మూలనపడ్డాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు కంప్యూటర్ విద్యను బోధించేవారు. 2008లో రాష్ట్రవ్యాప్తంగా 5 వేల పాఠశాలల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కంప్యూటర్ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలోని 6,300 పాఠశాలల్లో ఐదేళ్లపాటు కాంట్రాక్టు పద్ధతిన ప్రైవేటు సంస్థలకు నిర్వహణ బాధ్యతలను అప్పగిం చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 3,782 పాఠశాలల్లో ఈ విద్యావిధానం అమలులో ఉంది. ఉభయగోదావరి, కృష్ణా, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో కంప్యూటర్ ఆధారిత విద్యాబోధన బాధ్యతలను నిట్ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ సంస్థకు ఇచ్చిన గడువు గత ఏడాది సెప్టెంబర్‌తో ముగిసింది. ఒక్కో పాఠశాలకు ఇరువురు ఫ్యాకల్టీల చొప్పున 7,564 మంది ఫ్యాకల్టీలు ఉపాధి పొందేవారు. వీరందరినీ తొలగించడంతో ఉపాధి కోల్పోగా, విద్యార్థులు పూర్తిస్థాయిలో కంప్యూటర్ విద్యకు దూరమయ్యారు.
 
 తెరుచుకోని తాళాలు
 కంప్యూటర్ ఆధారిత విద్యాబోధన కోసం కోట్లాది రూపాయల్ని వెచ్చించి సర్వశిక్షాభియూన్ ఆధ్వర్యంలో ఒక్కో పాఠశాలకు 10 నుంచి 12 చొప్పున కంప్యూటర్లను అందజేశారు. ప్రింటర్, యూపీఎస్‌లను సైతం సమకూర్చారు. వీటి సాయంతో తెలు గు, లెక్కలు, ఇంగ్లిష్, పరిసరాల విజ్ఞానం పాఠాలు సులభమైన రీతిలో ఆడియో, వీడియో ద్వారా బోధించేవారు. విద్యార్థులకు నెలవారీ పరీక్షలు కూడా నిర్వహించేవారు. తరగతి గదులు మూతపడటంతో లక్షలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన కంప్యూటర్లు, జనరేటర్లు మూలనపడ్డాయి. ఈ నెల 12న పాఠశాలలు పునఃప్రారంభమయ్యూరుు. కం ప్యూటర్ ఫ్యాకల్టీలను నియమిస్తే తప్ప కంప్యూటర్ ఆధారిత విద్య అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. దీనిని పునరుద్ధరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యారంగ నిపుణులు కోరుతున్నారు.
 
 ఫ్యాకల్టీలను విధుల్లోకి తీసుకోవాలి
 గత ఏడాది కంప్యూటర్ ఫ్యాకల్టీలను తొలగించారు, ఒక్క సీ మాంధ్ర జిల్లాల్లోనే 7,564 మంది  ఉపాధి కోల్పోయూరు. ఫ్యాకల్టీలను ప్రభుత్వం వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. కాంట్రాక్టు సంస్థల ద్వారా కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే కంప్యూటర్ విద్యా విధానాన్ని నడిపించాలి. ఫ్యాకల్టీలకు కనీస వేతనాన్ని అమలు చేయాలి. - వై.నరసింహరాజు,   
 అధ్యక్షుడు, కంప్యూటర్ టీచర్స్ అసోసియేషన్
 
 కొనసాగించాలి
 ప్రతి విద్యార్థికి కంప్యూటర్ పరి జ్ఞానం ఎంతో అవసరం. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్‌ను దృ ష్టిలో ఉంచుకుని కంప్యూటర్ వి ద్యను పునఃప్రారంభించాలి. ప్రై వేటు విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు తయారుకావడానికి కంప్యూటర్ విద్య విధా నం ఉపకరిస్తుంది. విద్యార్థులు కూడా ప్రతిభను పెంపొందించుకునే అవకాశం లభిస్తుంది.                
 - వి.గంగాభవాని, ప్రధానోపాధ్యాయిని, కొవ్వూరు
 
 ఉపాధి కోల్పోయాం
 ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ఫ్యాకల్టీలను తొలగించి మా ఉపాధిని దెబ్బతీశారు. నూతన ప్రభుత్వం ఫ్యాకల్టీలను విధుల్లోకి తీసుకుని ఉపాధి కల్పించాలి. విద్యార్థులకు మెరుగైన కంప్యూటర్ విద్యను అందించే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించాలి. ఫ్యాకల్టీలను తొలగించడం వల్ల పాఠశాలల్లోని కంప్యూటర్లు మూలనపడ్డాయి.
 - ఎ.వీరబాబు, కంప్యూటర్ ఫ్యాకల్టీ, ఊనగట్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement