computer education
-
ఎదుగుతున్నానుకున్నాడు..సడెన్ బ్రేక్‌లా ఫుట్‌పాత్‌పై పడ్డాడు అదే..
ఓ సాధారణ పట్టణంలో పుట్టి పెరిగాడతడు. కంప్యూటర్ కోర్సు కోసం హైదరాబాద్ వచ్చాడతడు. నేర్చుకున్నాడు... తను నేర్చిన విద్యను ఇతరులకు నేర్పించేపనిలో మునిగిపోయాడు. ఎదుగుతున్నాననుకున్నాడు... అగాధంలోకి జారిపోయాడు. ఫుట్ పాత్ మీదే నిద్ర... అతడిని మార్చిన రోజది. సంజీవకుమార్ పుట్టింది, పెరిగింది మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో. పాలిటెక్నిక్, ఐటీఐ, గ్రాడ్యుయేషన్ పట్టా పుచ్చుకునే నాటికి సమాజంలో సాంకేతికంగా మరో విప్లవం మొదలైంది. అదే కంప్యూటర్ ఎడ్యుకేషన్. రాబోయే కాలంలో కంప్యూటర్ లేనిదే ఏ పనీ చేయలేమని తెలుసుకున్నాడు సంజీవ్‌కుమార్. హైదరాబాద్‌కు వచ్చి డీటీపీతో మొదలు పెట్టి డీసీఏ, పీజీడీసీఏ, పీజీ డీఎస్ఈ వరకు అప్పటికి అందుబాటులో ఉన్న కోర్సులన్నీ చేశాడు. తన మీద నమ్మకం పెరిగింది. సైబర్‌టెక్ పేరుతో నల్లకుంటలో కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ స్థాపించాడు. కంప్యూటర్స్‌లో ప్రపంచాన్ని ఆందోళనలో ముంచెత్తిన వైటూకే సమస్య సద్దుమణిగింది. కానీ అంతకంటే పెద్ద ఉత్పాతం సంజీవకుమార్ జీవితాన్ని ఆవరించింది. ఆ వివరాలను సాక్షితో పంచుకున్నాడతడు. అప్పు మిగిలింది! ‘‘నా మీద నాకున్న నమ్మకం, దానికితోడు అందరినీ నమ్మడం నా జీవిత గమనాన్ని మార్చేశాయి. నా మీద నమ్మకంతో కంప్యూటర్ సెంటర్లు ప్రారంభించాను. స్నేహితుల మీద నమ్మకంతో పదకొండు బ్రాంచ్‌లకు విస్తరించాను. కొన్ని బ్రాంచ్‌ల నిర్వహణ స్నేహితులకప్పగించాను. కొందరు స్నేహితులు పెట్టుబడి కోసం డబ్బు అప్పు ఇచ్చి సహకరించారు. నా పెళ్లి కోసం ఒకటిన్నర నెలలు మా ఊరెళ్లాను. పెళ్లి చేసుకుని హైదరాబాద్‌కి వచ్చేటప్పటికి పరిస్థితి తారుమారుగా ఉంది. ఫ్రాంచైసీలు తీసుకున్న స్నేహితులు మోసం చేశారు. నా కళ్ల ముందు తొంబై ఐదు లక్షల అప్పు. నా భార్య బంగారం, నేను నిర్వహిస్తున్న కంప్యూటర్ సెంటర్లను అమ్మేసి కూడా ఆ అప్పు తీరలేదు. అప్పు ఇచ్చిన స్నేహితుల నుంచి ఒత్తిడి పెరిగింది. నా భార్యను పుట్టింట్లో ఉంచి హైదరాబాద్‌కొచ్చాను. నా దగ్గర డబ్బున్నప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్లెవరూ నాకు ఒక్కరోజు అన్నం కూడా పెట్టలేదు. ఆకలితో ఫుట్‌పాత్ మీద పడుకున్న రోజును నా జీవితంలో మర్చిపోలేను. డబ్బులేని మనిషికి విలువ లేదని తెలిసి వచ్చిన క్షణాలవి. మరి ఫుట్‌పాత్ మీదనే బతికేవాళ్ల పరిస్థితి ఏమిటి... అనే ఆలోచన మొదలైన క్షణం కూడా అదే. వైద్యం... ఆహారం! నేను స్కై ఫౌండేషన్ స్థాపించింది 2012లో. అప్పటి నుంచి వీధుల్లో బతికే వాళ్లకు ప్రతి ఆదివారం అన్నం పెట్టడం, మందులివ్వడం, దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేస్తున్నాను. ఆఫీస్‌లోనే వండి రెండు వందలకు పైగా పార్సిళ్లతో మా వ్యాన్ బయలుదేరుతుంది. వాటిని ఫుట్‌పాత్ మీద, చెట్టుకింద పడుకున్న వాళ్లకు ఇస్తాం. అలాగే ప్రతి బిడ్డా పుట్టిన రోజు పండుగనూ, కేక్ కట్ చేసిన ఆనందాన్ని ఆస్వాదించాలనే ఉద్దేశంతో పిల్లలకు సామూహికంగా పుట్టిన రోజులు చేస్తున్నాను. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజు పిల్లల చేత జెండావందనం చేయిస్తాను. కోఠీలో పాత పుస్తకాలు తెచ్చి పంచుతాను. వీటన్నింటికంటే నేను గర్వంగా చెప్పుకోగలిగిన పని వీళ్లందరికీ కరోనా వ్యాక్సిన్ వేయించడం. ఫుట్‌పాత్‌ల మీద బతుకీడ్చే వాళ్లకు ఆధార్ కార్డు ఉండదు, మొబైల్ ఫోన్ ఉండదు. కరోనా వ్యాక్సిన్ వేయాలంటే ఈ రెండూ ఉండాలి. కేంద్ర ప్రభుత్వానికి తెలియచేసి ప్రత్యేక అనుమతి తీసుకుని వాళ్లందరికీ వ్యాక్సిన్ వేయించాను. కరోనా సమయంలో సేవలందించిన వైద్యులకు, వైద్య సిబ్బందికి సన్మానం చేశాను. ఒక్క అవకాశమివ్వండి! వీధుల్లో బతుకు వెళ్లదీసే వాళ్లకు తాత్కాలికంగా అన్నం పెట్టడం, దుస్తులివ్వడం శాశ్వత పరిష్కారం కాదు. ఈ బతుకులు రోడ్డు పక్కనే ఉండిపోకూడదంటే వాళ్లకు బతుకుదెరువు చూపించాలి. ప్రభుత్వాలు వాళ్లను షెల్టర్ హోమ్‌లో ఉంచి ఆహారం పెట్టడంతో సరిపెట్టకూడదు. చిన్న చిన్న పనుల్లో శిక్షణ ఇచ్చి సమాజంలోకి పంపించాలి. వడ్రంగం, బుక్ బైండింగ్, అగరుబత్తీల తయారీ, విస్తరాకుల కటింగ్ వంటి చిన్న పనులు నేర్పించినా చాలు. వాళ్లకు ఒక దారి చూపించినవాళ్లమవుతామని ప్రభుత్వానికి ఎన్నోసార్లు వినతి పత్రాలిచ్చాను. పైలట్ ప్రాజెక్టుగా ఒక ఏరియాకి బాధ్యత ఇవ్వండి. విజయవంతం చేసి చూపిస్తానని కూడా తెలియచేశాను. అలా చేయగలిగినప్పుడు వీధి జీవితాలు ఇంటివెలుగులవుతాయి’’ అన్నారు సంజీవకుమార్. ఫుట్‌పాత్ మీద కొత్త ఉపాధి! కంప్యూటర్ సెంటర్లను అమ్మేసిన తర్వాత కన్సల్టెంట్‌గా మారాను. తార్నాకలోని సన్మాన్ హోటల్ ముందున్న ఫుట్ పాతే నా వర్క్ ప్లేస్. నా భుజాన ఒక్క బ్యాగ్‌తో పాన్ కార్డ్ సర్వీస్ రూపంలో జీవితం కొత్తగా మొదలైంది. రోజుకు వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు వచ్చేవి. నెలకు రెండు వేల అద్దెతో ఒక గదిలో ‘స్కై క్రియేషన్స్’ పేరుతో సర్వీస్‌ను రిజిస్టర్ చేశాను. పాన్ కార్డు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్‌లు, ప్లేస్మెంట్ల వరకు సర్వీస్‌లను విస్తరించాను. పద్మారావు నగర్లో ఓ చిన్న ఫ్లాట్ కొనుకున్న తర్వాత స్కై ఫౌండేషన్ పేరుతో సామాజిక సేవ మొదలు పెట్టాను. అద్దె ఇంట్లో ఫౌండేషన్ రిజిస్టర్ చేయాలంటే ఇంటి యజమాని అనుమతించరు. కాబట్టి సొంత గూడు ఒకటి ఏర్పరుచుకునే వరకు ఆగి అప్పటి నుంచి వీధి పాలైన జీవితాల కోసం పని చేయడం మొదలుపెట్టాను. – సంజీవకుమార్, ఫౌండర్, స్కై ఫౌండేషన్, హైదరాబాద్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
బెగ్గర్లకు బంపరాఫర్: ప్రభుత్వం నుంచి రోజుకు రూ.215
రాజస్తాన్: ఇంట్లో నుంచి బయటకు వచ్చామంటే ఎక్కడో ఒకదగ్గర యాచకులు తారసపడుతుంటారు. కొందరు వారి పరిస్థితిని అర్థం చేసుకుని చేయగలిగిన సాయం చేస్తే మరికొందరు విస్కుంటూ ఉంటారు. కానీ ఇటువంటి వారి జీవితాలు మర్చేందుకు రాజస్థాన్ ప్రభుత్వం అక్కున చేర్చుకుంటోంది. ఈ క్రమంలోనే జైపూర్‌లో ‘బెగ్గర్‌ఫ్రీ’ అనే వినూత్న కార్యక్రమానికి రాజస్థాన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాజస్తాన్ స్కిల్ అండ్ లైవ్లీహుడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఆర్ఎస్ఎల్డీసీ), సోపన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ భాగస్వామ్యంతో బెగ్గర్ ఫ్రీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం 43 మంది యాచకులను చేరదీశారు. వీరంతా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల నుంచి జైపూర్ లో యాచిస్తూ జీవిస్తున్నారు. ఈ 43 మందికి వసతి సదుపాయం కల్పించి, యోగా నేర్పించడం, ఆటలు ఆడించడం, కంప్యూటర్ తరగతులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. బెగ్గర్స్ ఫ్రీ కార్యక్రమం గురించి రాజస్థాన్ స్కిల్ అండ్ లైవ్లీహుడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నిరజ్ కుమామర్ పవన్ మాట్లాడుతూ... రాష్ట్రంలోని యాచకులందర్ని బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. యాచకులు లేని రాష్ట్రంగా రాజస్థాన్‌ను తీర్చిదిద్దాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించడంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పవన్ తెలిపారు. రాజస్థాన్ పోలీసులు జైపూర్‌లో నిర్వహించిన సర్వే ఆధారంగా బెగ్గర్స్ ఫ్రీ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించామని, దీనికోసం ‘కౌశల్ వర్ధన్’ అనే కేంద్రాన్ని ఏర్పాటు చేసి బ్యాచుల వారీగా శిక్షణ నిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 20 మంది నైపుణ్య శిక్షణ పొందుతున్నారని, శిక్షణ పూరై్తన తరువాత ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. తొలిసారి జైపూర్‌లో ప్రారంభించిన ఈ కార్యక్రమం విజయవంతమైతే భవిష్యత్తులో రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు విస్తరిస్తామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. యోగా ట్రైయినర్ మాట్లాడుతూ.. సాధారణ వ్యక్తులతో పోలిస్తే వీరు కాస్త భిన్నంగా ఉంటారు. మానసికంగానే గాక, వివిధ అనారోగ్య సమస్యలతో శారీరకంగానూ బలహీనంగా ఉంటారు. అందువల్ల వ్యక్తిగతంగా మాట్లాడి మానసిక, శారీరక స్థితిగతులను అంచనావేసిన తరువాత వారికి యోగా నేర్పిస్తున్నట్లు చెప్పారు. ‘‘సమాజంలో యాచకులకు గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వడమే తమ లక్ష్యమని సోపన్ సంస్థ అధికారి చెప్పారు. మూడున్నర నెలలపాటు వారికి శిక్షణతోపాటు రాజస్థాన్ ప్రభుత్వం వారికి రోజుకు రూ.215 చెల్లిస్తుంది. ఈ నగదు భవిష్యత్తులో వ్యాపార అవసరాలకు ఉపయోగపడుతుందని వివరించారు. -
ఆన్లైన్ పాఠాలు అర్థం కావట్లేదు
కరోనా వేళ నాకు ఆన్లైన్ బోధన అందుబాటులో లేదు. పుస్తకాలు కొనుక్కునే పరిస్థితీ లేదు. అందుకే ఇప్పట్లో పరీక్షలు వద్దు. ఆఫ్‌లైన్ తరగతుల తర్వాతే పరీక్షలు పెట్టండి.’ – కరుణ శర్మ, 12వ తరగతి ఆన్లైన్ బోధన అర్థం కావట్లేదు. అభ్యసనపై సంతృప్తిగా లేదు. ప్రత్యక్ష విద్యా బోధన కావాలి. ఆ తర్వాతే పరీక్షలు పెట్టండి. పరీక్షలన్నీ జూన్ వరకు వాయిదా వేయండి. – అబు అనస్, విద్యార్థి సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్లో ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభం, పరీక్షల నిర్వహణ, జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలపై విద్యార్థులు నుంచి వ్యక్తమైన అభిప్రా యాలు. ప్రత్యక్ష విద్యా బోధన, సిలబస్ కుదింపుపైనా దేశవ్యాప్తంగా విద్యార్థులు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్‌కు అనేక విజ్ఞ ప్తులు, సూచనలు చేశారు. జేఈఈ మెయిన్, నీట్ వంటి ప్రవేశ పరీక్షలు, సీబీఎస్ఈ 11, 12 తరగతుల పరీక్షలకు సంబంధించి విద్యార్థులు తల్లిదండ్రులతో ఈనెల 10న 10 గంటలకు ట్విటర్ వేదికగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి ప్రకటించగా వేల మంది స్పందించారు. పరీక్షలు ఇప్పట్లో వద్దని 99 శాతం మంది స్పష్టం చేశారు. ప్రత్యక్ష బోధనపై చర్యలు చేపట్టాకే ముందుకు సాగాలని సూచించారు. మరికొంత మంది విద్యార్థులైతే 12వ తరగతి పరీక్షలు చాలా కీలకమని, అయితే ప్రస్తుతం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యక్ష విద్యా బోధన కంటే ఆన్లైన్ బోధన కొనసాగించాలని, పరీక్షలను కూడా ఆన్లైన్లోనే నిర్వహించాలని కోరారు. ప్రస్తుత ఆందోళనకర పరిస్థితుల్లో సిలబస్‌ను తగ్గించాలని సూరజ్ అనే విద్యార్థి విజ్ఞప్తి చేశారు. ఇంకొంత మంది విద్యార్థులైతే ప్రాక్టికల్ పరీక్షల ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. నీట్ పరీక్షను కూడా జూన్ వరకు వాయిదా వేయాలని కోరారు. ఆన్లైన్ విద్యా బోధనకు అవసరమైన చాలామంది విద్యార్థులకు మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు లేవని, అవి ఉన్నా కొందరు ఇంటర్నెట్ కనెక్షన్ సమస్యలతో విద్యా బోధన ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష విద్యా బోధనతోనే ప్రయోజనం ఉంటుందని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. ఆ తర్వాతే పరీక్షలపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 10న జరిగే ఆన్లైన్ చర్చా కార్యక్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి అభిప్రాయాలు తీసుకుని తుది నిర్ణయం వెల్లడించనున్నారు. పరీక్షలకు ఉపయోగపడని ఆన్లైన్ బోధన ఇంటర్మీడియెట్ విద్యలో ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆన్లైన్ బోధన.. పరీక్షలకు ఏ మాత్రం ఉపయోగపడేలా లేదు. ఆన్లైన్ విద్యతో పరీక్షలు నిర్వహించడం సరికాదు. నేరుగా తరగతులు నిర్వహించకుండా పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు. ప్రత్యక్ష విద్యా బోధన కనీసం 3 నెలలు నిర్వహించాల్సిందే. – ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు పి.మధుసూదన్‌రెడ్డి -
ఈ ‘కోడ్’ తప్పదిక
‘థింక్ బిగ్’ అన్నారు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్. భావితరం ఆలోచనలు గొప్పగా ఉండాలని ఆశించారాయన. ‘రేపటి వర్తమానం’ అందంగా ఉండాలి. ఈ కలల సౌధాన్ని నిర్మించే సృష్టికర్తలు ప్రస్తుత వర్తమానంలో ఉన్న పిల్లలే. వాళ్ల ఆలోచనలు విస్తరించాలి. ఆలోచనలు ఆకాశంలో విహరించి... ఆమెరికాలో ల్యాండ్ అయ్యే కలలను కాదు కలామ్ కోరుకున్నది. తేనెటీగలాగ అమెరికాలో సంగ్రహించిన మకరందాన్ని మన దేశానికి తీసుకు రాగలిగిన ఆలోచనలను ఆశించారాయన. అలాంటి ఆలోచనకు ప్రతిరూపంగా నిలుస్తున్న యువతి హిమశ్రీ దేశాయ్. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన హిమశ్రీ కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ చేశారు. విప్రో, మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగాలు చేసి ఆ అనుభవం తో అమెరికాలో అడుగుపెట్టారు. అక్కడ సియెటెల్ వంటి పెద్ద కంపెనీలో పని చేసిన తర్వాత కొంతకాలం ఫ్రీలాన్సర్‌గా పెద్ద కంపెనీలకు సర్వీస్ అందించారు. ఒక బిడ్డకు తల్లిగా అమెరికాలో పిల్లలు స్కూల్లో ఏం నేర్చుకుంటున్నారనే విషయాలను నిశితంగా గమనించారామె. ఇండియాలో పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు దాదాపుగా ప్రైవేట్ స్కూళ్లన్నీ కంప్యూటర్ క్లాసులు బోధిస్తున్నాయి. ఇక్కడ కంప్యూటర్ క్లాసు సిలబస్ చూసిన తర్వాత ‘మనదేశానికి చేయాల్సింది చాలా ఉంది’ అని అర్థమైంది హిమశ్రీకి. స్కూల్లో ఉన్నంత కాలం ఎమ్ఎస్ ఆఫీస్, పెయింట్లతోనే కాలం వెళ్లబుచ్చిన పిల్లలు ఇంజనీరింగ్‌లో చేరిన తర్వాత పడే కష్టం చిన్నది కాదు. మన దగ్గర చాలా కొద్ది స్కూళ్లలో తప్ప మెజారిటీ స్కూళ్లలో పాఠశాల స్థాయి కంప్యూటర్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో పెద్దగా పురోగతి కనిపించలేదామెకు. అమెరికా, యూకే వంటి చోట్ల ప్రైమరీదశలోనే కంప్యూటర్ కోడింగ్ నేర్చుకుంటారు. వాళ్లు స్కూల్ ఫైనల్‌కు వచ్చేటప్పటికి సబ్జెక్టు మీద పట్టు వస్తుంది. ఇండియాలో పిల్లలు స్కూల్లో నేర్చుకున్న కొద్దిపాటి పరిజ్ఞానంతో బీటెక్‌లో చేరుతున్నారు. ఫస్టియర్‌లో ఏకంగా ప్రోగ్రామింగ్ చేయాల్సి రావడంతో చాలా ఒత్తిడికి లోనవుతున్నారు. కొంతమంది స్టూడెంట్స్ ఏడాది పూర్తయ్యేలోపు గాడిలో పడతారు. ఎక్కువ మంది వెనుకపడతారు. ఆ వెనుకబాటుతనం కాలేజ్ ఇచ్చిన మార్కుల షీట్‌తో ఆగిపోదు. వాళ్లు అంతర్జాతీయ వేదిక మీద ఇతర దేశాల విద్యార్థులతో పోటీ పడి ఉద్యోగాల్లో పురోగతి సాధనలో కూడా ఆ వెనుకబాటు వాళ్లను వెంటాడుతూనే ఉంటోంది. ఇలాంటి దుస్థితి రాకూడదంటే స్కూలు దశలోనే మంచి పునాది పడాలనుకున్నారు హిమశ్రీ. ఏదో ఒకటి చేయాలని మూడేళ్ల కిందట కుటుంబంతో సహా ఇండియాకు వచ్చేశారు. హిమశ్రీ అమెరికా నుంచి తిరిగి ఇండియాకి రాగానే ‘కిట్ ఓ లిట్ డాట్ కామ్’ అనే సంస్థను స్థాపించి హైదరాబాద్‌లో ఉన్న కార్పొరేట్ విద్యాసంస్థలను సంప్రదించారు. హిమశ్రీ తయారు చేసిన సిలబస్‌ను అనుసరించడానికి, విద్యార్థులకు కోడింగ్‌లో ట్రైనింగ్ ఇప్పించడానికి ఓ ఎనిమిది స్కూళ్లు ఆసక్తి చూపించాయి. రెండవ తరగతి నుంచి కంప్యూటర్ కోడింగ్, ఐఓటీ క్లాసులు పరిచయం చేశారామె. కోడింగ్‌తోనే భవిష్యత్తు కోడింగ్‌కి భవిష్యత్తు ఉండడం కాదు... కోడింగ్‌తోనే భవిష్యత్తు ఉంటుందని చెప్పారు హిమశ్రీ. ‘‘ఇంజనీరింగ్‌లో చేరుతున్న చాలామందిలో ఇంజనీరింగ్ చేయాలనే కల తప్ప, ఇంజనీరింగ్ సబ్జెక్టు మీద ఇష్టం ఉండడం లేదు. చేరిన తర్వాత అయిష్టంగా పూర్తి చేయడం, అన్యమనస్కంగా ఉద్యోగం చేయడం, జాబ్ సాటిస్ఫాక్షన్ లేదని ఆవేదన చెందడాన్ని చూశాను. పిల్లలు చిన్నప్పుడే కోడింగ్, ఐవోటీ నేర్చుకుంటే మెళకువలు పట్టుపడతాయి. ఒకవేళ ఇంకా అయిష్టం ఉంటే ‘నా అభిరుచి ఇందులో లేదు’ అనే స్పష్టత అయినా తెలుస్తుంది. మరేదయినా రంగంలో అడుగుపెట్టవచ్చు. అయితే ఇప్పుడు మెడికల్, ఆర్కిటెక్చర్, మెకానికల్... అన్ని రంగాల్లోనూ కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. కాబట్టి ఇతర రంగాల్లో కెరీర్ నిర్మించుకునే వాళ్లకు కూడా స్కూల్లో నేర్చుకున్న కోడింగ్, ఐవోటీలు ఉపయోగపడతాయి’’ అన్నారు హిమశ్రీ. ఈత నేర్పి కొలనులో దింపుదాం భవిష్యత్తంతా ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఇండియా నుంచి విదేశాలకు వెళ్లిన విద్యార్థులకు ఎదురవుతున్న ప్రధాన సమస్య కంప్యూటర్స్‌లోనే. అక్కడి వెర్షన్స్ అన్నీ మన దగ్గర కంటే చాలా ముందుంటాయి. మనవాళ్లు తడబడుతున్నది అక్కడే. పిల్లలకు ఈత బాగా నేర్పిన తర్వాత కొలనులో కాదు సముద్రంలో దించినా ఈది ఒడ్డుకు చేరతారు. అందుకే ప్రక్షాళన ఇక్కడి స్కూళ్ల నుంచే మొదలవ్వాలనుకున్నాను. నేను మొదలు పెట్టిన తర్వాత ఏడాదికే మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం కూడా ఇదే పద్ధతిని ప్రవేశ పెట్టింది. అది తలుచుకుంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తోంది. మొదట్లో స్కూళ్లకు వెళ్లి క్లాసులు ఇచ్చేవాళ్లం. కరోనా కారణంగా ఇప్పుడు కొంత విరామం వచ్చింది. ఆసక్తి ఉన్న వాళ్ల కోసం ఆన్లైన్లో క్లాసులు చెబుతున్నాం. ఆశ్చర్యం ఏమిటంటే... మేము ఆన్లైన్ కోడింగ్ క్లాసులు మొదలు పెట్టిన తర్వాత ఇండియన్స్ కంటే ఎక్కువగా అమెరికా, యూకే, సింగపూర్, దుబాయ్‌లో ఉంటున్న వాళ్లు రిజిస్టర్ చేసుకుంటున్నారు. ఎక్కువ మంది రిజిస్టర్ చేసుకుంటూ ఉండడంతో ఈ అక్టోబర్ ఐదవ తేదీ నుంచి మరో స్లాట్ మొదలు పెడుతున్నాను. – హిమశ్రీ ‘కిట్ ఓ లిట్’ సంస్థ నిర్వహకురాలు – వాకా మంజులారెడ్డి ఫొటోలు: ఎన్.రాజేశ్‌రెడ్డి -
కేజీబీవీల్లో కంప్యూటర్ మిథ్య
కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో విద్యార్థినులకు కంప్యూటర్ విద్య సంగతి దేవుడెరుగు.. దీనికోసం పీసీ, మోనిటర్, మౌస్, కీబోర్డు వినియోగిస్తారన్న స్పృహ లేకపోవడం విచిత్రం. వీరికి బోధించేందుకు కంప్యూటర్ ఇన్‌స్ట్రక్చర్లు లేకపోగా, కంప్యూటర్లు మాత్రం మూలకు చేరాయి. అయితే ప్రైవేటు ఏజెన్సీకి, అధికార పార్టీ నేతలకు మధ్య మామూళ్ల పంపకాల్లో వివాదం తలెత్తడంతో వారి నియామకాలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. రాజాం: జిల్లాలోని 32 మండలాల్లో రెండు విడతలుగా కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ప్రారంభించారు. ఈ పాఠశాలలు తొలుత 6 నుంచి 8 తరగతి వరకూ ప్రారంభించి ప్రతీ ఏడాది ఒక్కో తరగతిని పెంచుతూ 10వ తరగతి వరకూ అప్‌గ్రేడేషన్ చేశారు. ఈ ఏడాది జి.సిగడాం, కోటబొమ్మాళి మండలాల్లో పది నుంచి ఇంటర్ వరకూ అదనంగా పెంచారు. బోధకుల రిక్రూట్మెంట్ మాత్రం చేపట్టలేదు. కానరాని కంప్యూటర్ విద్య.. 2012 నుంచి అన్ని పాఠశాలలకు విడతల వారీగా కంప్యూటర్లు అందించారు. ఒక్కో పాఠశాలలో 10 నుంచి 12 కంప్యూటర్లు కేటాయించి ల్యాబ్‌రూమ్‌లు ఏర్పాటు చేశారు. ఇంతవరకూ బోధకులను నియమించ లేదు. ఫలితంగా కంప్యూటర్లు మూలకు చేరుతున్నాయి. చాలా పాఠశాలల్లో ఇవి తుప్పుపట్టాయి. నిరుపయోగంగా ఉన్న కంప్యూటర్లు రూమ్‌ల్లో విద్యార్థినులకు ఇతర సబ్జెక్టులకు సంబంధించి తరగతులు నిర్వహిస్తున్నారు. ఆయా గదుల్లో డిజిటల్ తరగతులు నిమిత్తం ఇటీవల కొనుగోలు చేసిన ప్రాజెక్టర్లు పెట్టుకుంటున్నారు. అవి కూడా నిరుపయోగంగా మారుతున్నాయి. ఇలా కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగమవుతున్నాయి. నోటిఫికేషన్ వేసి కూడా.. కేజీబీవీలో కంప్యూటర్ బోధకుల నియామకానికి 2018 సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ వేశారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించేందుకు ఓ ప్రైవేట్ ఏజెన్సీకి ఈ బాధ్యత అప్పగించారు. అప్పట్లో చాలా మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు తెరవెనుక బేరసారాలు కూడా జరిగాయి. ఈ విషయమై విమర్శలు వెల్లువెత్తడంతో నోటిఫికేషన్ అర్ధాంతరంగా నిలుపుదల చేసేశారు. దీంతో పోస్టులు భర్తీ నిలిచిపోయింది. అయితే ఏజెన్సీకి, అధికార పార్టీ నేతలకు మధ్య మామూళ్ల పంపకాల్లో వివాదం రావడంతో వీటిని నిలుపుదల చేసినట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాలో 32 కేజీబీవీలకు సంబంధించి మొత్తం 32 మంది కంప్యూటర్ ఇన్‌స్ట్రక్చర్లను నియమించాల్సి ఉంది. ఇంతవరకూ ఈ ప్రక్రియ కొనసాగలేదు. దీంతో కంప్యూటర్ విద్య కేజీబీవీల్లో కలగానే మిగిలిపోయింది. అంతా అస్తవ్యస్తమే.. బడికి దూరంగా ఉన్న విద్యార్థినుల నిమిత్తం, తల్లి, తండ్రిలేని ఆడపిల్లలకు ఉత్తమ విద్య అందించి ఆసరాగా ఉంచేందుకు కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల, గిరిజన ప్రాంతాల విద్యార్థినులకు ప్రాధాన్యమివ్వాల్సి ఉంది. అటువంటి వారు ఇంగ్లిషు మీడియంలో చదవాలంటే కష్టమే. కానీ నాలుగేళ్ళుగా ఆరు నుంచి పది తరగతుల వరకూ ఆంగ్ల మాధ్యమ బోధన చేపడుతున్నారు. బోధకులు కూడా తెలుగుభాషలో బీఈడీలు చేసి వచ్చినవారే. వీరితో ఓ వైపు బోధన సాగిస్తూ మరోవైపు కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ తరగతులు లేకుండా నెట్టుకొస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ విద్యార్థినులకు, డ్రాపౌట్స్‌కు ఈ విద్య ఎంతమేరకు అందుతుందో అధికారులకే ఎరుక. ప్రక్రియ కొనసాగుతోంది.. కేజీబీవీ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌లు ఉన్నాయి. బోధకులు లేని విషయం వాస్తవమే. వీటి భర్తీకి నోటిఫికేషన్ కూడా గతంలో ఇచ్చాం. ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ విద్యా సంవత్సరం చివరి కల్లా కంప్యూటర్ బోధకులు నియామకం చేపట్టే అవకాశం ఉంది.– ఎం త్రినాథరావు, పీవో, సర్వశిక్షా అభియాన్ -
కంప్యూటర్ విద్య మిథ్య..!
కరీంనగర్‌ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్లు మూలకుపడ్డాయి. బోధకుల కాంట్రాక్టు ముగియడంతో విద్యార్థులకు కంప్యూటర్ పాఠాలు బోధించేవారు కరువయ్యారు. ఐదేళ్లపాటు కుదుర్చుకున్న బోధకుల కాంట్రాక్టు ఒప్పందం ముగిసి ఐదేళుŠల్ అయ్యింది. కాంట్రాక్టు ముగిసేలోపు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాల్సి ఉండగా.. అది నెరవేరలేదు. ప్రభుత్వం తిరిగి కాంట్రాక్టు ఇవ్వకపోవడంతో పాఠశాలల్లో కంప్యూటర్ పాఠాలు బోధించేవారు కరువయ్యారు. అధికారులు చొరవ తీసుకుని పాఠశాలల్లో కంప్యూటర్ బోధకులను కొనసాగించాలని తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ విద్యార్థులకు కంప్యూటర్ విద్యను బోధించేందుకు ఏర్పాటు చేసినప్పటికీ.. బోధకులు లేక కంప్యూటర్లు మూలనపడ్డాయి. బోధకుల కాంట్రాక్టు 2013 ఆగస్టు నెలాఖరుతో ముగిసిపోయింది. అప్పటినుంచి పాఠాలు బోధించేవారు లేక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా తయారైంది. కంప్యూటర్ బోధన బాధ్యతను ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులకు అప్పగించినప్పటికీ వారు పట్టించుకోవడంలేదని విద్యార్థులు వాపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు కంప్యూటర్‌పై అవగాహన కల్పించి ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్, ఎక్సెల్, పవర్‌పాయింట్ ప్రెజంటేషన్, మైక్రోసాఫ్ట్, పెయింటింగ్ అంశాలపై వివరించేలా ఏర్పాట్లు చేశారు. 2007 నుంచి కేంద్ర ప్రభుత్వం దశలవారీగా ఆయా పాఠశాలల్లో కంప్యూటర్ విద్యాబోధన ప్రవేశపెట్టింది. ఉమ్మడి జిల్లాలో 277 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను ప్రారంభించింది. ఒక్కో పాఠశాలకు ప్రభుత్వం 10 కంప్యూటర్లను మంజూరు చేసింది. కంప్యూటర్ పాఠాలు బోధించేందుకు ఇద్దరిని నియమించింది. కంప్యూటర్ విద్యాబోధన కాంట్రాక్టును ప్రభుత్వం జిల్లాలో ఐసీటీ అనే సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ పాఠశాలల్లో కంప్యూటర్ను ఏర్పాటు చేయడంతోపాటు బోధకులను నియమించి విద్యార్థులకు విద్యాబోధన చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఒక్కో పాఠశాలకు ఇద్దరు బోధకులను నియమించి.. వారికి నెలకు రూ.4,500 వేతనంగా చెల్లించారు. ఐదేళ్లపాటు కుదుర్చుకున్న ఒప్పందం 2013 ఆగస్టు నెలాఖరు వరకు ముగిసింది. ఈ ఐదేళ్ల కాలంలో ఐసీటీ సంస్థ ఒప్పందం ముగిసే లోపు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ఇవ్వాల్సి ఉన్నా.. ఇవ్వలేదు. రెండేళ్ల క్రితం సర్వశిక్ష అభియాన్, రాజీవ్ విద్యామిషన్ ద్వారా ఆయా పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులకు 20 రోజులపాటు కంప్యూటర్లో శిక్షణ ఇచ్చారు. అదే సమయంలో కంప్యూటర్ శిక్షణ సంస్థ ఒప్పందం ముగియడంతో కేంద్రప్రభుత్వం బోధకులను తొలగించింది. ప్రభుత్వం తిరిగి ఏ ఒక్క సంస్థకూ కాంట్రాక్టు ఇవ్వకపోవడంతో పాఠశాలల్లో కంప్యూటర్ పాఠాలు బోధించేవారు కరువయ్యారు. కంప్యూటర్లు గదిలోనే మూలకు పడ్డాయి. వాటిని వినియోగించకపోవడంతో చెడిపోతున్నాయి. ఒక్కో పాఠశాలలో కంప్యూటర్ల ఏర్పాటుకు ఏకంగా రూ.మూడులక్షల చొప్పున వెచ్చించారు. ప్రస్తుతం అక్కడక్కడ కొందరు విద్యార్థులు మాత్రం ఇప్పటివరకు నేర్చుకున్న పరిజ్ఞానాన్ని మరిచిపోకుండా ఉండేందుకు ప్రాక్టీస్ చేస్తున్నారు. తెలిసీతెలియక ఏదో ఒకటి ఆపరేట్ చేస్తే కంప్యూటర్లు చెడిపోతాయనే భావనతో కొన్ని పాఠశాలల్లో కంప్యూటర్ గది తాళాలు తీయడం లేదు. కంప్యూటర్ విద్యాబోధన బాధ్యతలను ప్రధానోపాధ్యాయులే తీసుకుని పాఠాలు బోధించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వులు జారీ చేసినా.. ఎక్కడా అమలు చేయడం లేదు. గతంలో సర్వశిక్ష అభియాన్, రాజీవ్ విద్యామిషన్ ద్వారా ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చినప్పటికీ చాలామంది వాటిని మరిచిపోయారు. కొందరైతే శిక్షణకే హాజరు కాలేదు. రెగ్యులర్‌గా ఆయా అంశాలపై ప్రాక్టీస్ లేని కారణంగా వారికి మరోసారి శిక్షణ ఇస్తేగానీ బోధించే పరిస్థితి ఉండదని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి అయినప్పటికీ అటు విద్యాశాఖ అధికారులు, ఇటు జిల్లా యంత్రాంగం చడీచప్పుడు లేకుండా వ్యవహరిస్తుండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్య అందనిద్రాక్షగా మిగిలింది. కంప్యూటర్ విద్యను ప్రారంభించాలని జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశాల్లో ప్రజాప్రతినిధులు లేవనెత్తినా ఫలితంలేకుండాపోతోంది. ఐదేళ్ల నుంచి కంప్యూటర్లను వినియోగించడంలేదని, ఆ కారణంగా అవి చెడిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కంప్యూటర్ల విషయమై సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని పాఠశాలల్లో కంప్యూటర్ విద్యాబోధనను కొనసాగించాలని తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు. -
మిథ్య..కంప్యూటర్ విద్య
పది పబ్లిక్ పరీక్షల్లో సాధించిన ఉత్తమ ఫలితాలను చూపి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని టీచర్లు ప్రచారం చేస్తున్నారు. ఇదంతా వాస్తవమే అయినా .... మరో విషయం పై జిల్లా యంత్రాంగం, విద్యాశాఖ, సర్వశిక్షాఅభియాన్ దృష్టి సారించాలి. అదే కంప్యూటర్ విద్య. ఈ ఏడాది అడ్మిషన్లు అంతంత మాత్రంగా జరుగుతుండడానికి కంప్యూటర్ విద్య లేకపోవడమే ప్రధాన కారణం. ఎస్ఎస్ఏలో పాఠశాలల అభివృద్ధికి రూ.లక్షల నిధులు మూలుగుతున్నాయి. ఆ శాఖ చైర్మన్, కలెక్టర్ ప్రద్యుమ్న ఈ విషయంపై దృష్టి సారిస్తే సర్కారు స్కూళ్లలో విద్యార్థుల నమోదు పెంచవచ్చు చిత్తూరు ఎడ్యుకేషన్: సర్కారు స్కూళ్ల విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందని ద్రాక్షగా మారింది. టీడీపీ ప్రభుత్వం టెక్నాలజీలో ముందున్నామంటూ డప్పులు కొట్టుకుంటోందే కాని.. పాఠశాలల్లోని కంప్యూటర్ విద్యకు టీచర్లను నియమించాలని తెలియడం లేదు. ప్రస్తుతం నిర్వహణ లోపం శాపమై కంప్యూటర్ విద్యను టీడీపీ ప్రభుత్వం అటకెక్కించింది. గత మూడేళ్లుగా జిల్లాలో కనీసం కంప్యూటర్ తరగతి గదుల తలుపులు తీసే నాథుడే కరువయ్యారు. దీంతో జిల్లాలోని 694 హైస్కూల్స్ లో చదువుతున్న 2,75, 776 మంది పేద విద్యార్థులకు సాంకేతిక విద్య అందని ద్రాక్షగా మారింది. అప్పట్లో ఒక్కొక్క ఉన్నత పాఠశాలకు 11 కంప్యూటర్ల చొప్పున మొత్తం 7,634 కంప్యూటర్లను ప్రభుత్వం సరఫరా చేసింది. వాటిలో ఇప్పటికి 1,672 మానిటర్లు, 834 సీపీయూలు మరమ్మతులకు గురయ్యాయి. వాటిని జిల్లా విద్యాశాఖ అధికారులు సేకరించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నేడు రూ. కోట్ల విలువ చేసే కంప్యూటర్లు, సామాగ్రి, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు బూజు పట్టాయి. మరికొన్ని పాఠశాలల్లో దొంగతనాలు, ఇంకొన్ని చోట్ల హెచ్ఎంలే మాయం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత విద్యాసంవత్సరం జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు కంప్యూటర్ విద్య పై దృష్టి సారిస్తే పేదవిద్యార్థులకు న్యాయం చేసినట్లవుతుంది. మూడేళ్లుగా .... ♦ 2010 లో ఒప్పందం కుదుర్చుకున్న ఐఈజీ కొత్తగా పాఠశాలల్లోని ప్రత్యేక గదులకు అన్ని హంగులు దిద్దడం, కంప్యూటర్లు ఏర్పాటు చేయడం వంటి పనులతో రెండేళ్లు తరగతులు నిలిచిపోయాయి. ♦ 2012 లో ఐఈజీ ద్వారా ప్రతి పాఠశాలలో కంప్యూటర్ శిక్షణకు వీలుగా ప్రత్యేక గదిని, 11 కంప్యూటర్లు, జనరేటర్, కుర్చీలు, పుస్తకాలు, విద్యుత్ సౌకర్యం వంటివి సిద్ధం చేశారు. శిక్షణ ఇచ్చేందుకు ఇద్దరు వలంటీర్లను నియమించారు. అలా రెండు విద్యాసంవత్సరాలు ఎలాగోలా గడిచిపోయాయి. ♦ 2015 లో ఐఈజీ సంస్థతో అయిదేళ్ల ఒప్పందం పూర్తయింది. ఆ తర్వాత కంప్యూటరు గదులకు వేసిన తలుపులు నేటికీ తెరుచుకోలేదు. ప్రభుత్వం పాఠశాలల్లో పనిచేసే ఇద్దరు టీచర్లకు శిక్షణ ఇచ్చి తరగతుల్ని కొనసాగించే ప్రయత్నం చేసినా... అది సత్ఫలితానివ్వలేదు. కనీసం ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలోౖ¯ð నా తరగతులు కొనసాగేలా చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు, విద్యార్థిసంఘాలు డిమాండ్ చేస్తున్నారు. యంత్రాంగానికి శ్రద్ధ ఉంటే కదా.. మూడేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్య ఆగిపోయినా అధికారులు పట్టించుకోకపోవడం దారుణం. రూ. కోట్ల విలువ చేసే పరికరాలు నాలుగు గదులకే పరిమితం అయ్యాయి. పలుచోట్ల అసలు పరికరాలు ఉన్నాయో..లేవో కూడా తెలియని పరిస్థితి. కంప్యూటర్ విద్య చెప్పడానికి వలంటీర్లను నియమించాలి.– భానుప్రకాష్, విద్యార్థిసంఘం నేత -
కంప్యూటర్ విద్య అంతేనా?
సిరిసిల్లఎడ్యుకేషన్: కాలానికనుగుణంగా సాధారణ విద్యతోపాటు కంప్యూటర్ విద్యనందుకోవాల్సిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కంప్యూటర్ విద్యాబోధనకు దూరమయ్యారు. గతంలో పలు సంస్థలు కంప్యూటర్ విద్యను ప్రభుత్వ పాఠశాలలో బోధన చేశాయి. వాటి ఒప్పంద గడువు తీరడమో..ప్రభుత్వం వారికి అవకాశం ఇవ్వకపోవడమే తెలియదు కానీ ఎలాగోలా పాఠశాలలో గతంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌లన్నీ నేడు బూజుపట్టాయి. విద్యను బోధించడానికి అవసరమైన బోధనకులను విద్యాశాఖ గౌరవవేతనం ఇచ్చి నియమించినా పరిస్థితి ఈ విద్యాసంవత్సరం లేదు. 902 కంప్యూటర్స్ వృథా.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు కంప్యూటర్ విద్యనందించడానికి గతంలో పలు సంస్థలు ముందుకువచ్చాయి. జిల్లాలో 82 పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్‌లు ఉండగా, ఒక్కో ల్యాబ్‌లో 11 కంప్యూటర్స్ కలిపి 902 కంప్యూటర్స్ అందుబాటులో ఉన్నట్లు గణాంకాలున్నాయి. సిబ్బంది లేకపోవడంతో మూలనపడ్డాయి. టీచర్లే బోధన చేసేందుకు సిద్ధం అయినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని అవసరమైన 223 కొత్త కీబోర్డులు, 102 మౌస్‌లను 48 పాఠశాలలకు విద్యాశాఖాధికారులు అందించారు. కంప్యూటర్ ఇన్స్‌స్ట్రక్టర్స్ ఎక్కడా..? ప్రస్తుత సీసీఈ విధానంతో ఉన్న రికార్డులు, పరీక్షల నిర్వహణ, ప్రయోగాలు చేయడానికే సమయం లేదంటే మళ్లీ కంప్యూటర్ విద్యను బోధించడం సాధ్యం కాదనే అభిప్రాయాలున్నాయి. గతంలో ఎన్ఐఐటీ వాళ్లకు కంప్యూటర్ విద్య అందించడానికి ఇచ్చిన విధానం మాదిరి మళ్లీ ఏదేని సంస్థతో కంప్యూటర్ విద్యను అందించేందుకు విద్యాసంవత్సరం ఆరంభంలో చేయాలని సూచిస్తున్నారు. కాకిలెక్కలు.. ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో కలిపి 82 సెంటర్లు ఉన్నాయని గణాం కాలున్నాయి. ప్రస్తుతం కాగితాలపై 902 కంప్యూటర్స్ ఉన్నాయన్న గణాంకాలుంటే క్షేత్రస్థాయి పరిశీలనలో మాత్రం 50 పాఠశాలలో కంప్యూటర్స్ కేంద్రాలుండగా ఒక్కో దానిలో 11 చొప్పున 550 కంప్యూటర్స్ ఉన్నట్లు ఆయా పాఠశాలల నిర్వాహకులు చెబుతున్నారు. పరికరాలు వచ్చిన మాట వాస్తవమే కంప్యూటర్లకు అవసరమైన కొన్ని పరికరాలు వచ్చిన మాట వాస్తవమే. అవసరమైన వాటికి వాడాలని పంపిణీ జరిగింది. బోధన చేయడానికి ప్రస్తుతం ప్రత్యేక శిక్షకులు లేరు. మన జిల్లాలోనే కాదు అన్ని జిల్లాలో ఇదే పరిస్థితి. డిజిటల్ పాఠాలను చెప్పే క్రమంలో ఉపాధ్యాయులకు కొంత శిక్షణ అందింది. వారే ప్రస్తుతం బోధన చేస్తున్నారు. సిబ్బంది విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తాం. – డాక్టర్ రాధకిషన్, డీఈవో, రాజన్న సిరిసిల్ల -
కంప్యూటర్ యంత్రం.. భవితకు మంత్రం
–కంప్యూటర్ శిక్షణపై ఆసక్తి చూపుతున్న విద్యార్థులు –ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు పాకాల : ప్రస్తుత పోటీ ప్రపంచంలో కంప్యూటర్ పరిజ్ఞానం అందరికీ తప్పనిసరైంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల తల్లిదండ్రులు వేసవి కాలంలో తమ పిల్లలకు కంప్యూటర్ పరిజ్ఞానం కోసం శిక్షణ ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. అదే విధంగా విద్యార్థులు చిన్నతనం నుంచే కంప్యూటర్‌పై అవగాహన తప్పనిసరిగా మారింది. వేసవి సెలవుల్లో ఆట, పాటలపై ఆసక్తి చూపే విద్యార్థులు ఇప్పుడు ఏ కొంచెం సమయం దొరికినా కంప్యూటర్ ముందు వాలిపోతున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో పలు చోట్ల శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానంపై శిక్షణను ఇస్తున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలో పలు చోట్ల కంప్యూటర్ శిక్షణా తరగతులు ప్రారంభమైయ్యాయి. మరికొన్ని త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో ఆరు నుంచి పదో తరగతి వరకు రాజీవ్ విద్యామిషన్ సహకారంతో నిట్ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ ఇచ్చేవారు. క్రమేణా నిట్‌ను తొలగించడంతో ఉపాధ్యాయులే విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. కంప్యూటర్ ఆవశ్యకత పెరుగుతున్న ప్రారంభ రోజుల్లో చాలా చోట్ల స్వచ్చంధ సంస్థలు ముందుకొచ్చి ఉచితంగా విద్యార్థులకు కంపూటర్ శిక్షణను అందించేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో అటువంటి పరిస్థితులు కానరావడం లేదు. దీంతో డబ్బులు వెంచించి కంప్యూటర్ కోర్స్‌ల్లో చేరలేని నిరు పేద విద్యార్థులు దిగులు చెందుతున్నారు. దయాహృదయం గల ధనికులు, సేవభావం కలిగిన వ్యక్తులు ఉచితంగా కంప్యూటర్ శిక్షణను అందించగలిగితే పేద విద్యార్థులు కూడా కంప్యూటర్ కోర్స్‌లు నేర్చుకునే అవకాశం ఉంటుందని ప్రజలు బావిస్తున్నారు. కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం ప్రస్తుత కాలంలో కంప్యూటర్ పరిజ్ఞానం చాలా అవసరం. దీని ఆవశ్యతక తెలుసుకున్నాక నేను కంప్యూటర్ నేర్చుకుంటున్నాను. వేసవి సెలవుల్లో సమయాన్ని వృ«థా చేయకుండా కంప్యూటర్ కోర్స్‌ల్లో చేరాను. ఎస్.తనూష బాను, పాకాల పోటీ ప్రపంచంలో కంప్యూటర్ ప్రథమం.... భవిష్యత్‌లో పిల్లలు పోటీ పరీక్షలు రాయాలన్నా, ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నా కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. విద్యార్థులు ఇప్పుడు సమయాన్ని వృథా చేస్తే రేపటి కాలం చాలా బాధపడాల్సి ఉంటుంది. అందుకే మా పిల్లల్ని కంప్యూటర్ కోర్స్‌ల్లో చేర్పించాం. ఎన్.మోహన్, పాకాల పిల్లల్లో కంప్యూటర్‌పై ఆసక్తి ఎక్కువ... విద్యార్థులు కంప్యూటర్ పరిజ్ఞానం పెంచుకోవడంపై ఆసక్తి ఎక్కువ చూపుతారు. దీనితో పాటు కంప్యూటర్ కోర్స్‌ల్లో చేరడం వలన ఇంగ్లీషు బాషపై కూడా పట్టు వస్తుంది. అందు చేత విద్యార్థులు కంప్యూటర్ నేర్చుకోవలసిన అవసరం ఉంది శేఖర్ నాయుడు, కంప్యూటర్ ట్యూటర్, పాకాల -
కలగా కంప్యూటర్ విద్య
నాలుగేళ్లుగా నిలిచిన బోధన ఇన్స్ట్రక్టర్లు లేక ఇబ్బందులు మూలనపడ్డ కంప్యూటర్లు చెన్నూర్ రూరల్ : ప్రయివేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యనందిస్తామన్న ఆశయం నెరవేరడం లేదు. పలు పాఠశాలలకు కంప్యూటర్లు కేటాయించి చేతులు దులుపుకోవడంతో కంప్యూటర్ విద్య మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులకు అందనిద్రాక్షగా మారింది. పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కంప్యూటర్లు నిరుపయోగంగా మారి మూలనపడ్డాయి. జిల్లాలో 108 ఉన్నత పాఠశాలలు, 93 ప్రాథమికోన్నత, 477 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 55 ఉన్నత పాఠశాలలకు కంప్యూటర్లను అందజేశారు. 2008లో ఒక్కో పాఠశాలకు 11 కంప్యూటర్లు, ఒక్కో జనరేటర్, ప్రింటర్లను అందించారు. కంప్యూటర్లు అమర్చేందుకు ఫర్నిచర్ కూడా ఏర్పాటు చేశారు. చెన్నూర్ నియోజకవర్గంలో 30 ఉన్నత పాఠశాలలకు గాను 15 పాఠశాలలకు కంçప్యూటర్లు అందజేశారు. మంచిర్యాల నియోజకవర్గంలో 33 హైస్కూళ్లకు గాను 13 పాఠశాలకు కంప్యూటర్లు ఇచ్చారు. బెల్లంపల్లి నియోజవర్గంలో 31 ఉన్నత పాఠశాలలు ఉండగా 18 పాఠశాలలకు కంçప్యూటర్లను అందజేశారు. వీటి నిర్వహణను ఎడ్యుకామ్ అనే ప్రయివేట్ సంస్ధకు అప్పగించారు. వీరికి ఐదేళ్లు అంటే 2013 వరకు నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. ఈ సంస్థ నిర్వాహకులు కంప్యూటర్ బోధించేందుకు ఒక్కో పాఠశాలలో ఇద్దరు ఇన్స్ట్రక్టర్లను నియమించారు. వీరికి ఒక్కరికి నెలకు రూ.2476 చొప్పున వేతనం చెల్లించేవారు. మూడేళ్లపాటు కంప్యూటర్ విద్య సాఫీగానే కొనసాగింది. 2012లో వేతనాలు పెంచాలంటూ జిల్లా వ్యాప్తంగా ఇన్స్ర్‌క్టర్లు ఆందోళన చేపట్టారు. ఎడ్యుకామ్ సంస్థ పట్టించుకోకపోవడంతో ఇన్స్ట్రక్టర్లు తిరగి విధుల్లో చేరలేదు. దీంతో 2013 సెప్టెంబర్ నుంచి కంప్యూటర్ బోధన పూర్తిగా నిలిచిపోయింది. దీంతో పాఠశాలల్లో కంప్యూటర్లు నిరుపయోగంగా మారాయి. కంప్యూటర్ విద్య కోసం విద్యార్థులు ప్రయివేట్ పాఠశాలలను ఆశ్రయించక తప్పడంలేదు. లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన కంప్యూటర్లు నాలుగేళ్లుగా మూలన పడటంతో పనికి రాకుండా పోతున్నాయి. దీంతో విద్యార్థులకు కంప్యూటర్ విద్య కలగానే మిగిలింది. అధికారులు స్పందించి కంప్యూటర్ బోధకులను నియమించి విద్యార్ధులకు కంప్యూటర్ విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
అటకెక్కిన కంప్యూటర్ విద్య!
• ఐసీటీ ప్రాజెక్టు కింద ఇచ్చిన కంప్యూటర్లు మాయం • పాఠశాలల్లో చోరీ • ఎన్ని ఉన్నాయో లెక్క తెలియని విద్యాశాఖ • చేతివాటం ప్రదర్శించిన ఇంటి దొంగలు మారుతున్న కాలానుగుణంగా..సర్కారు పాఠశాలల్లో అమలుచేసిన కంప్యూటర్ విద్య అటకెక్కింది. ఐసీటీ(ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) ప్రాజెక్టు కింద పలు పాఠశాలలకు ఇచ్చిన కంప్యూటర్లు మాయమయ్యాయి. కొందరు ‘ఇంటిదొంగలు’ చేతివాటం ప్రదర్శించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహబూబ్‌నగర్ విద్యావిభాగం : పేద విద్యార్థులు చదివే ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతిక విద్య అటకెక్కింది. కోట్లు ఖర్చుచేసి ఏర్పాటు చేసన కంప్యూటర్ ల్యాబ్‌లు ప్రస్తుతం నిద్రావస్థలో ఉన్నాయి. ప్రభుత్వం ఐసీటీ(ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) ప్రాజెక్టు కింద కోట్లు వెచ్చించి కంప్యూటర్ పరికరాలు అన్ని హంగులతో ల్యాబ్‌లను ఏర్పాటు చేసింది. రోజులు గడిచిచాయి, కంప్యూటర్లు పాతబడ్డాయి. అధికారులు, ప్రభుత్వం పర్యవేక్షించడం మరిచిపోయారు. దీంతో కంప్యూటర్ విద్య పూర్తిగా అటకెక్కింది. నేటి పోటీ ప్రపంచంలో కంప్యూటర్ విద్య పేద విద్యార్థులకు అనివార్యం అని తెలిసినా ప్రభుత్వం 2008, 2010లో రెండు విడతలుగా ఎంపిక చేసిన పాఠశాలకు 11కంప్యూటర్లతో పాటు రూ.50వేలు విలుచేసే జనరేటర్లు, కుర్చీలు, ఫ్యాన్లు ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇంత విలువైన పరికరాల మూలకుపడ్డాయి.. కొన్ని చోట్ల చోరీకి గురయ్యాయి. వీటిలో ఎన్ని పనిచేస్తున్నాయో.. చోరీకి గురయ్యాయో.. వినియోగంలో ఉన్నాయో అన్న విషయానికి విద్యాశాఖ అధికారుల వద్ద ఎటువంటి సమాచారం లేదంటే వాటి నిర్వహణపై ఎంత నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుందో అర్థమవుతోంది. ప్రాజెక్టు నడిచిన కొన్ని రోజుల మాత్రం నానా హంగామా చేసి రోజులు గడుస్తున్న కొద్ది వాటిని నిర్లక్ష్యం చేశారు. దీంతో కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయింది. మూలకుచేరిన కంప్యూటర్లు పాఠశాలల్లో కంప్యూటర్లతో పాటు మిగితా పరికరాలు మమ్మతులు చేయడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. దీంతో చాలాచోట్ల పాఠశాలల్లో కంప్యూటర్లు మరమ్మతులు, జనరేటర్ల సర్వీస్‌లకు నోచుకోలేదు. వాటిని వినియోగించడం మానేశారు. చాలాచోట్ల కంప్యూటర్లు మాయమయ్యాయి. జనరేటర్లు కూడా ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితిలో అధికార యంత్రాంగం ఉంది. నిధుల కొరత ప్రభుత్వం కంప్యూటర్ విద్య అందించేందుకు ఐసీటీ ప్రాజెక్టులో భాగంగా కంప్యూటర్లను ఉమ్మడి పాలమూరు జిల్లాలో సరఫరా చేశారు. కాని వాటి నిర్వహణ నిమిత్తం నిధులు ఇవ్వాలని ఎటువంటి నిబంధనలు లేవు. దీంతో వాటికి మైనర్ రీపేర్లు చేయించేందుకు, సర్వీసింగ్‌లు చేయించేందుకు నిధుల కొరత ఏర్పడింది. ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకొని పాఠశాలకు విడుదల చేసిన నిధుల నుంచి వాటి వినియోగానికి వాడుకోవాల్సి వస్తుంది. సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి, వారిని ప్రారంభంలో ఐదేళ్ల కాలపరిమితితో నియమించారు. కాలం ముగియడంతో వారిని తొలగించారు. సిబ్బంది, నిధుల కొరతతో కోట్ల విలువ చేసే కంప్యూటర్లు నిరుపయోగంగా ఉన్నాయి. సమాచారం తెలియని విద్యాశాఖ పాఠశాలల్లో కంప్యూటర్లకు ఏర్పాటు చేసిన ల్యాబ్‌లో ఉన్న కంప్యూటర్లు చాలావరకు మాయమయ్యాయి. అయితే ఎన్ని ఉన్నాయో, ఎన్ని లేవో సమాచారం తెలియని పరిస్థితిలో విద్యాశాఖ ఉంది. కంప్యూటర్లు చోరీకి గురయ్యాయా.. ఇంటి దొంగల చేతివాటం ప్రదర్శించారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. పాఠశాలకు రక్షణ లేనందున కంప్యూటర్లు చోరీకి గురయ్యాయి అనుకున్న దానికి సమాచారం విద్యాశాఖ వారికి అందజేయాల్సి ఉంది. లోపించిన పర్యవేక్షణ ల్యాబ్‌ల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం నుంచి కాని ఇ టు అధికారుల నుంచి కాని పాఠశాలలకు నిబంధనలు, ని యమావళి అందలేదు. దీంతో ప్రాజెక్టు ఐసీటీ పూర్తికాగానే వాటిని గాలికి వదిలేశారు. అ«ధికారులు కూడా వాటిని ప ట్టించుకోవడం మానేయడంతో పాఠశాలల్లో ఉండాల్సిన కం ప్యూటర్లు పలువురు ఉపాధ్యాయులు ఇళ్లలో ఉంటున్నాయి. ల్యాబ్‌లు పనిచేయడం లేదు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు పం పిణీ చేసిన కంప్యూటర్లు ప్రస్తుతం ఎక్కడా పనిచేయడం లేదు. పనిచేసినా అవి ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకొని నడిపిస్తున్నారు. ల్యాబ్‌ల నిర్వహణకు సంబంధించి ఎటువంటి నిధులు, నిబంధనలు ప్రభుత్వం నుంచి రావడం లేదు. కంప్యూటర్ల పూర్తి వివరాలను సేకరించి వినియోగించే విధంగా చర్యలు తీసుకుంటాం. – సోమిరెడ్డి, డీఈఓ -
రీస్టార్ట్ !
ప్రభుత్వ పాఠశాలల్లో మూలనపడిన కంప్యూటర్ విద్యను పునఃప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. తాత్కాలికంగా ఏడునెలల కాలవ్యవధికి ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి ప్రకటన విడుదల చేశారు. విద్యాసంవత్సరం మొదలైన మూడునెలల తర్వాత తాపీగా ప్రారంభించిన ఈ ప్రక్రియనూ సజావుగా చేయడం లేదు. కంప్యూటర్ విద్యకు పునరుజ్జీవం పోసే దిశగా శాశ్వత చర్యలు చేపట్టడం లేదు. కొవ్వూరు : దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులందరికీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలన్న సంకల్పంతో కంప్యూటర్ విద్యను ప్రవేశపెట్టారు. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో 6,300 పాఠశాలల్లో రెండు విడతలుగా ఈ విద్యను ప్రవేశపెట్టారు. అప్పట్లో నియమించిన కాంట్రాక్టు సంస్థ గడువు 2013 సెప్టెంబర్‌తో ముగియడంతో అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం కంప్యూటర్ విద్యను అటకెక్కించింది. ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు రెండున్నరేళ్లు గడిచినా దీనిపై దష్టి సారించలేదు. ఎట్టకేలకు జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ చొరవతో స్పందించిన అధికార యంత్రాంగం కంప్యూటర్ విద్య పునఃప్రారంభానికి చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి శ్రీకారం చుట్టింది. జిల్లా వ్యాప్తంగా 283 పాఠశాలల్లో ఇన్‌స్ట్రక్టర్ల నియమాకానికి రంగం సిద్ధం చేసింది. సర్వశిక్షాభియాన్ నిధులతో వీరికి గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించింది. ఏడునెలలకు రూ.1,18,86,000 నిధులు వెచ్చించనుంది. అయితే విద్యాసంవత్సరం ప్రారంభమై మూడునెలలు గడిచిన తర్వాత తాపీగా నియామక ప్రక్రియ చేపట్టిన అధికారులు ఏడునెలల కాల వ్యవధికి మాత్రమే తాత్కాలిక పద్ధతిలో ప్రకటన విడుదల చేయడం, గతంలో ఐదేళ్లు ఇన్స్ట్రక్టర్లుగా పనిచేసిన అనుభవం ఉన్నవారిని పక్కనబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరమ్మతులూ భారమే! మూడేళ్ల నుంచి కంప్యూటర్లు మూలనపడి ఉండడంతో చాలాచోట్ల అవి పాడైపోయాయి. యూపీఎస్‌లు, బ్యాటరీలు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల ఫోన్ బిల్లులు చెల్లించకపోవడంతో నెట్ కనెక్షన్లను తొలగించారు. జనరేటర్లూ మూలనపడ్డాయి. కంప్యూటర్ విద్యను పునఃప్రారంభించాలనే యోచనతో జిల్లా అధికారులు కంప్యూటర్ల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించే బాధ్యతను ఎన్యూవల్ మేనేజ్మెంట్ కాంట్రాక్టు(ఏఎంసీ) ఆధ్వర్యంలో వీఎల్ మార్కెటింగ్ అనే సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ వీటి మరమ్మతులకు సుమారు రూ.10 లక్షల ఖర్చవుతుందని ప్రాథమికంగా నిర్ధారించి జిల్లా అధికారులకు నివేదిక పంపింది. పాఠశాల నిర్వహణ కోసం ఇచ్చే రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ నిధులతో వీటి మరమ్మతులు చేయిస్తామని అధికారులు చెబుతున్నారు. దీనిని ప్రధానోపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు. నిర్వహణ నిధులు కంప్యూటర్ల మరమ్మతులకు వెచ్చిస్తే పాఠశాలల్లో కరెంటు, తాగునీటి సరఫరా, నెలవారీగా వచ్చే నెట్ బిల్లులు వంటి చెల్లింపులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని గగ్గోలు పెడుతున్నారు. నేడు దరఖాస్తుకు ఆఖరు తేదీ జిల్లాలో కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు సోమవారమే ఆఖరు తేదీ. మ«ధ్యాహ్నాం 12 గంటల వరకూ మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈనెల 20న ఏలూరులో దరఖాస్తుదారులందరికీ ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. హాల్ టì కెట్, పరీక్ష కేంద్రం వివరాలు, ఇతర అన్ని వివరాలను ఎప్పటికప్పుడు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.వెస్ట్ గోదావరి.ఓఆర్జీ వెబ్సైట్లో ఆప్డేట్ చేస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. దరఖాస్తునూ ఇదే వెబ్సైట్లో చేసుకోవాలి. మండలాలవారీగా పోస్టుల వివరాలివీ.. జిల్లాలో తాడేపల్లిగూడెం మండలంలో 13, పాలకొల్లు, నరసాపురం మండలాల్లో 11 చొప్పున, చింతలపూడి, భీమవరం మండలాల్లో తొమ్మిది చొప్పున, యలమంచిలి మండలంలో పది, కాళ్లలో 8, మొగల్తూరు, ఉండి, ఏలూరు, జంగారెడ్డిగూడెం, గణపవరం, ఉంగుటూరు, పెరవలి మండలాల్లో ఏడేసి చొప్పున, పాలకోడేరు, భీమడోలు, పెంటపాడు, దేవరపల్లి, కొయ్యలగూడెం, కొవ్వూరు, నిడదవోలు,అత్తిలి, పెనుమంట్ర, తణుకు మండలాల్లో ఆరేసి చొప్పున పోస్టులు భర్తీచేయనున్నారు. వీరవాసరం, చాగల్లు,దెందులూరు, గోపాలపురం, నిడమర్రు, పెంటపాడు, ఆచంట, ఇరగవరం, ఉండ్రాజవరం మండలాల్లో ఐదేసి చొప్పున, ఆకివీడు, ఏలూరు రూరల్, లింగపాలెం,పెదవేగి, నల్లజర్ల, తాళ్లపూడి, పెనుగొండ, పోడూరు మండలాల్లో నాలుగేసి చొప్పున, కామవరపు కోట, బుట్టాయిగూడెం, కుక్కునూరు మండలాల్లో మూడేసి చొప్పున, జీలుగుమిల్లి, పోలవరంలో రెండేసి చొప్పున, ద్వారకా తిరుమల, వేలేరుపాడు మండలాల్లో ఒక్కోక్క ఇన్స్ట్రక్టర్ పోస్టును భర్తీచేయనున్నారు. గతంలో పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలి గతంలో పనిచేసిన కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్లకు నియామకంలో ప్రాధాన్యం ఇవ్వాలి.అప్పట్లో ఏదైనా డిగ్రీ చేసి, కంప్యూటర్ విద్యలో ఏడాదిపాటు శిక్షణ ఉండాలన్న నిబంధన ఉంది. పీజీడీసీఏ, డీసీ కోర్సులు చేసిన వారికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు డిగ్రీలో కంప్యూటర్ ఒక సబ్జెక్టు ఉండాలని నిబంధన పెట్టడం వల్ల మాలాంటి వాళ్లకు అన్యాయం జరుగుతోంది. ఐదేళ్లు పనిచేసిన అనుభవం ఉన్నా మమ్మలను పరిగణనలోకి తీసుకోకపోవడం దారుణం. మళ్లీ పరీక్షలు నిర్వహించడం సమంజసం కాదు. –వై.నరసింహరాజు, ఏపీ కంప్యూటర్ టీచర్స్ అసోయోషియేషన్ అధ్యక్షుడు దరఖాస్తు చేసుకునే అవకాశం కోల్పోయాం నేను ఎంఏ చదివా. కంప్యూటర్లో పీజీడీసీఏ చేశా. గతంలో మూడేళ్లు ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేశా. ప్రస్తుతం నెట్ సెంటర్ నడుపుకుంటున్నా. కంప్యూటర్ విద్యా బోధనపై అవగాహన ఉన్న వాళ్లను పక్కనపెట్టి ఏదైనా డిగ్రీలో కంప్యూటర్ సబ్జెక్టు ఉండాలని నిబంధన పెట్టారు.గతంలో కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ పనిచేస్తూనే ఏదైనా టీచర్ సెలవు పెట్టిన సమయంలో ఇతర సబ్జెక్టులూ చెప్పేవాళ్లం. కొత్త నిబంధనతో దరఖాస్తు చేసుకునే అవకాశం కోల్పోయాం.–అంబటి సుహాసిని, కొవ్వూరు 740 దరఖాస్తులు వచ్చాయి కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ నియామకానికి శనివారం మధ్యాహ్నానికి 740 దరఖాస్తులొచ్చాయి. ఈనెల 20న అభ్యర్థులకు ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తాం. ఎంపికైన అభ్యర్థుల నుంచి మెరిట్ ఆధారంగా రోస్టర్ విధానంలో ఎంపిక చేస్తాం. ప్రస్తుతం పాఠశాలల్లో ఉన్న అన్ని కంప్యూటర్లను బాగుచేసేందుకు యత్నిస్తున్నాం. వీఎల్ మార్కెటింగ్ సంస్థ ఏడాది పొడవునా మరమ్మతులు బాధ్యత తీసుకుంటుంది. ఆర్‌ఎంఎస్‌ఏ గ్రాంటు ద్వారా మరమ్మతులు చేయిస్తాం.–డి.మధుసుధనరావు, జిల్లా విద్యాశాఖ అధికారి -
283 ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ విద్య
– టీచర్ల నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానం ఏలూరు సిటీ : జిల్లాలోని 283 ఉన్నత పాఠశాలల్లో ఈ ఏడాది నుంచి కంప్యూటర్ విద్యను ప్రారంభిస్తున్నామని, కంప్యూటర్ విద్యను బోధించేందుకు టీచర్ల నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు డీఈవో డి.మధుసూదనరావు శుక్రవారం తెలిపారు. ఏడు నెలల కాలానికి తాత్కాలిక పద్ధతిలో కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్స్‌గా పనిచేసేందుకు అసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఖాళీల వివరాలను పాఠశాలల వారీగా డీఈవో వెస్ట్ గోదావరి వెబ్సైట్లో ఉంచామన్నారు. మరిన్ని వివరాలకు ఉప విద్యాధికారులను సంప్రదించాలని తెలిపారు. అభ్యర్థులు డిగ్రీ, పీజీ స్థాయిలో కంప్యూటర్ ఒక సబ్జెక్టుగా చదివిఉండాలన్నారు. 21 సంవత్సరాలు నించి 40 సంవత్సరాలు మించకూడదని తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 19 తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు ఆన్లైన్లో చేయాలని, 20వ తేదీ ఉదయం 10 గంటల నుంచి అభ్యర్థులకు ఆన్లైన్ టెస్ట్ నిర్వహిస్తామని తెలిపారు. పరీక్షను ఏలూరులో నిర్వహిస్తామని, మండలం యూనిట్‌గా మెరిట్ కమ్ రోస్టర్ ప్రాతిపదికన ఎంపికలు చేపడతామని తెలిపారు. మండల స్థానికులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు వేతనంగా రూ.6 వేలు గౌరవవేతనంగా చెల్లిస్తారన్నారు. హాల్‌టిక్కెట్స్, పరీక్షా కేంద్రాలను వెస్ట్‌గోదావరి డాట్ ఓఆర్జీ వెబ్సైట్లో పొందుపరుస్తామని తెలిపారు. -
283 ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ విద్య
– టీచర్ల నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానం ఏలూరు సిటీ : జిల్లాలోని 283 ఉన్నత పాఠశాలల్లో ఈ ఏడాది నుంచి కంప్యూటర్ విద్యను ప్రారంభిస్తున్నామని, కంప్యూటర్ విద్యను బోధించేందుకు టీచర్ల నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు డీఈవో డి.మధుసూదనరావు శుక్రవారం తెలిపారు. ఏడు నెలల కాలానికి తాత్కాలిక పద్ధతిలో కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్స్‌గా పనిచేసేందుకు అసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఖాళీల వివరాలను పాఠశాలల వారీగా డీఈవో వెస్ట్ గోదావరి వెబ్సైట్లో ఉంచామన్నారు. మరిన్ని వివరాలకు ఉప విద్యాధికారులను సంప్రదించాలని తెలిపారు. అభ్యర్థులు డిగ్రీ, పీజీ స్థాయిలో కంప్యూటర్ ఒక సబ్జెక్టుగా చదివిఉండాలన్నారు. 21 సంవత్సరాలు నించి 40 సంవత్సరాలు మించకూడదని తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 19 తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు ఆన్లైన్లో చేయాలని, 20వ తేదీ ఉదయం 10 గంటల నుంచి అభ్యర్థులకు ఆన్లైన్ టెస్ట్ నిర్వహిస్తామని తెలిపారు. పరీక్షను ఏలూరులో నిర్వహిస్తామని, మండలం యూనిట్‌గా మెరిట్ కమ్ రోస్టర్ ప్రాతిపదికన ఎంపికలు చేపడతామని తెలిపారు. మండల స్థానికులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు వేతనంగా రూ.6 వేలు గౌరవవేతనంగా చెల్లిస్తారన్నారు. హాల్‌టిక్కెట్స్, పరీక్షా కేంద్రాలను వెస్ట్‌గోదావరి డాట్ ఓఆర్జీ వెబ్సైట్లో పొందుపరుస్తామని తెలిపారు. -
6 వేలకు పైగా పాఠశాలల్లో టీఎస్-క్లాస్
కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులు - రెండు నెలల్లో అమలు.. రూ. 60 కోట్లతో పరికరాలు - కేజీబీవీ, మోడల్‌స్కూళ్లు, గురుకులాల్లోనూ అమలు - డిప్యూటీ సీఎం సమీక్షలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని 6,236 ఉన్నత పాఠశాలలు, గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతుల బోధనను అమల్లోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే రెండు నెలల్లోగా డిజిటల్ బోధనను ప్రారంభించాలని కసరత్తు చేస్తోంది. సోమవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహ రి అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ స్టేట్ కంప్యూటర్ లిటరసీ అండ్ స్కిల్స్ ఇన్ స్కూల్స్ (టీఎస్-క్లాస్) పేరుతో దీనిని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 6, 7, 8, 9 తరగతుల్లో మొదట దీనిని అమలు చేస్తారు. ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు సిద్ధం అయ్యే సమయం వచ్చినందున టెన్త్‌లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 1,516 ప్రాథమికోన్నత పాఠశాలలు, 2,680 ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్లు ఉన్నాయి. ప్రస్తుతం వాటన్నింటిని రూ. 6 కోట్లు వెచ్చించి రిపేర్ చేయించి వినియోగంలోకి తేవడంతోపాటు అన్ని యాజమాన్యాల పరిధిలోని ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తరగతులను ప్రారంభించనున్నారు. నోడల్ ఏజెన్సీగా ఐటీ శాఖ ప్రస్తుతం రాష్ట్రంలో 391 కేజీబీవీలు, 187 మోడల్ స్కూళ్లు, 5,144 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటికితోడు 247 గిరిజన సంక్షేమ గురుకులాలు, 129 సాంఘిక సంక్షేమ గురుకులాలు, 47 తెలంగాణ ప్రభుత్వ గురుకులాలు, 20 బీసీ సంక్షేమ గురుకులాలు, 71 మైనారిటీ గురుకులాలు ఉన్నాయి. ఇలా మొత్తంగా 6,236 పాఠశాలల్లో కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులను అమల్లోకి తీసుకురానున్నారు. ఒక్కో యూనిట్‌కు రూ. 70 వేలు వెచ్చించి మొత్తంగా రూ. 60 కోట్లతో డిజిటల్ తరగతులను ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ప్రతి స్కూల్‌కు ప్రొజెక్టర్, స్క్రీన్, స్పీకర్లు, డెస్క్‌టాప్/ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేస్తారు. ఒక్కో స్కూలులో 10 కంప్యూటర్లు ఉండేలా చర్యలు చేపడతారు. తెలంగాణ ఐటీ శాఖ ఈ పథకం అమలుకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. ఇప్పటికే రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ), రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ (సైట్), యునిసెఫ్ తరగతుల వారీగా రూపొందిం చిన డిజిటల్ కంటెంటు ద్వారా బోధన నిర్వహిస్తారు. అలాగే గణితం పాఠాలు 100 శాతం, బయాలజీ 97 శాతం, ఫిజిక్స్ 95 శాతం, సోషల్ సబ్జెక్టు పాఠాలు 35 శాతం డిజిటలైజేషన్ పూర్తయింది. ఇక రెండో దశలో ప్రతి పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తారు. వీటితోపాటు అన్ని రకాల విద్యా సంస్థల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ఉపాధ్యాయులు, విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరును అమల్లోకి తేవాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన పరికరాల కొనుగోలుకు వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి విజయ్‌కుమార్, విద్యాశాఖ కమిషనర్ కిషన్ తదితరులు పాల్గొన్నారు. -
కంప్యూటర్ మార్కెట్
హైస్పీడ్ వర్క్‌కు కంప్యూటర్స్ కరీంనగర్ మార్కెట్హబ్ విక్రయాలు కరీంనగర్ బిజినెస్ : కంప్యూటర్ లేనిదే రోజు గడవని పరిస్థితి. సాంకేతికపరంగా దూసుకుపోతున్న ఈ రోజుల్లో ప్రతి పనికి కంప్యూటర్ను వినియోగిస్తున్నాం. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థల్లో వీటి సేవలను వినియోగిస్తున్నాం. గతంలో కంప్యూటర్లు కొనుగోలు చేయాలంటే హైదరాబాద్‌కు వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం కరీంనగర్లో అన్ని రకాల కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చాయి. నగరంలో రోజురోజుకు కంప్యూటర్ మార్కెట్ విస్తరిస్తోంది. సేల్స్‌తోపాటు సర్వీసెస్ అందుబాటులోకి రావడంతో చాలా మంది ఇక్కడే కొనుగోలు చేస్తున్నారు. అన్ని రంగాల్లో ప్రస్తుతం అన్ని రంగాల్లో కంప్యూటర్లు ప్రవేశించాయి. విద్యారంగం, వ్యాపార, వాణిజ్యరంగాలలోపాటు ఆటోమొబైల్, సూపర్‌మార్కెట్, సివిల్ ఇంజినీరింగ్‌లో బిల్డింగ్ డిజైన్లు, ఇంట్లో వాడుకునే పర్సనల్ కంప్యూటర్లు ఇలా చెప్పుకుంటూ పోతే అంతా కంప్యూటర్మయమైంది. విద్యార్థులకు వరం పాఠశాల స్థాయి నుంచే సాంకేతిక విద్యాబోధన ఉండడంతో ఇంటి వద్ద ప్రాక్టీస్ చేసుకునేందుకు తల్లిదండ్రులు కంప్యూటర్లు కొనుగోలు చేస్తున్నారు. అదనంగా సమాచారం, సబ్జెక్టులను లోతుగా తెలుసుకునేందుకు ఇంటర్నెట్ కనెక్షన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు సైతం వారికి తెలియని విషయాలను తెలుసుకునేందుకు ఇంట్లో కంప్యూటర్లు వాడుతున్నారు. ల్యాప్‌టాప్‌లు ఒకే ప్రదేశంలో స్థిరంగా పనిచేసే వారు డెస్క్‌టాప్‌లు వాడుతుంటే.. ఎక్కడికి వెళ్లిన తమతోపాటు కంప్యూటర్ తీసుకెళ్లాల్సిన వారు ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేస్తున్నారు. ల్యాప్‌టాప్‌లతో ఇంట్లో, బయట కూడా వర్క్ చేసుకునే అవకాశం ఉంది. ఇందులో స్లిమ్, టచ్, కన్వర్టబుల్, గేమింగ్ ల్యాప్‌టాప్‌లు మార్కెట్లో సందది చేస్తున్నాయి. సేవలు వేగం గతంతో పోలిస్తే ప్రస్తుతం కంప్యూటర్ల ద్వారా వేగవంతమైన సేవలు పొందుతున్నారు. అంతకుముందు లేటెస్ట్ మోడల్ కంప్యూటర్లు కరీంనగర్లో లభిస్తున్నాయి. మార్కెట్లో లేటెస్ట్గా 32జీబీ వరకు ర్యామ్‌లు, కోర్ ఐ–7 సిక్త్స్ జనరేషన్ ప్రాసెసర్స్, 4 టెరాబైట్స్ వరకు హార్డ్‌డిస్క్‌లు, 4 జీబీ గ్రాఫిక్కార్డులు, మౌస్‌లు, పెన్‌డ్రైవ్‌లు, బ్యాటరీలు, మ్యూజిక్, వాయిస్‌చాట్ కోసం హెడ్సెట్లు, హోం థియేటర్లు, యాంటి వైరస్లు, అదనపు సమాచారం భద్రపరుచుకునేందుకు ఎక్స్టర్నల్ హార్ట్డిస్క్లు, వెబ్‌క్యామ్‌లు, అన్నిల్యాప్టాప్ల చార్జర్లు, బ్యాటరీలు, ఇంటర్నెట్ సౌకర్యానికి కావాల్సిన రూటర్లు, అసెంబుల్డ్ బ్రాండెడ్ డెస్క్‌టాప్‌లు, ప్రింటర్లు ఇలా అన్ని లేటెస్ట్ మోడల్స్ కరీంనగర్‌లోనే లభిస్తున్నాయి. ధరలు(రూ..లలో) ల్యాప్‌టాప్‌లు 20వేలు– 1.5 లక్షలకు పైగా మినీల్యాప్లు 15 వేలు–20 వేలకు పైగా డెస్క్‌టాప్(అసెంబుల్డ్) 10వేలు–25 వేలు డెస్క్‌టాప్(బ్రాండెడ్) 20వేలు–లక్ష వరకు ప్రింటర్స్ 2వేలు–50వేలు హోం థియేటర్స్ 1000 –10 వేలు యాంటివైరస్లు 200–2 వేలు రూటర్స్ 800–2 వేలు పెన్‌డ్రైవ్‌లు 200–1000 మౌస్‌లు 100–500 కీబోర్ట్లు 200–2000 హెడ్‌ఫోన్స్ 150–5000 ఎక్స్టర్నల్ హార్ట్‌డిస్క్ 4వేల–కెపాసిటీని బట్టి అడాప్టర్స్, బ్యాటరీలు 500–4 వేలు వెబ్‌క్యామ్‌లు 500–1500 మానిటర్స్ 4వేలు–15 వేలు క్యాట్రేజ్‌లు 300–3000 వరకు వినియోగదారులు పెరుగుతున్నారు –జి.భరద్వాజ్, ల్యాప్స్టోర్ యజమాని కరీంనగర్లో కంప్యూటర్ వినియోగదారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. విద్యార్థుల నుంచి మొదలుకొని అన్ని రంగాల వారు కంప్యూటర్ల సాయంతో పనిచేస్తున్నారు. అత్యంత వేగవంతమైన సేవలందించేలా మార్కెట్లో నూతనంగా లేటెస్ట్ హై స్పీడ్ కాన్ఫిగరేషన్ కంప్యూటర్లు అందుబాటులో ఉన్నాయి. రోజురోజుకు కంప్యూటర్లతో అవసరాలు పెరగడంతో గిరాకీ సైతం పెరుగుతుంది. మేము కేవలం అమ్మకాలే కాకుండా సేవలను కూడా అందించడంతో వినియోగదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. -
పాఠశాల స్థాయిలోనే కంప్యూటర్ విద్య
ఎస్టీ సంక్షేమ మంత్రి అజ్మీరా చందూలాల్ సాక్షి, హైదరాబాద్: గిరిజనులకు పాఠశాల స్థాయిలోనే కంప్యూటర్ విద్యను అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్టీ సంక్షేమ మంత్రి అజ్మీరా చందూలాల్ ఆదేశించారు. ఎస్టీ విద్యాసంస్థల బలోపేతంతో పాటు, అదనపు సౌకర్యాల కల్పనకు రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. విద్యాసంవత్సరం మొదలయ్యే నాటికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, దుస్తులు, ఇతర సదుపాయాలను కల్పించనున్నట్లు తెలియజేశారు. మంగళవారం సచివాలయంలో గిరిజన ఉప ప్రణాళిక అమలు తీరును మంత్రి సమీక్షించారు. సబ్‌ప్లాన్ లక్ష్యాలను సాధించేందుకు ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి అన్ని విభాగాలను సమీక్షిస్తామన్నారు. ఇందుకు తగినట్లుగా ఫలితాలను సాధించలేకపోతే తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. గిరిజన సబ్‌ప్లాన్‌లో వ్యక్తిగత ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారుల పేర్లను తమ శాఖ వెబ్సైట్లో ఉంచాలని, ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. గిరిజన తండాలకు రోడ్ల కల్పనకు పంచాయతీరాజ్‌శాఖ ద్వారా రూ.230 కోట్లు, గిరిజన ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలను మెరుగుపరిచేందుకు రూ.145 కోట్లు ఖర్చుచేయనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రామలక్ష్మణ్, ఎస్టీ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్, కమిషనర్ లక్ష్మణ్ పాల్గొన్నారు. -
గురుకులాల్లో కంప్యూటర్ విద్య
♦ విద్యార్థులకు పౌష్టికాహారం అందజేసేందుకు రూ.80 కోట్లు కేటాయింపు ♦ మంత్రి రావెల కిషోర్‌బాబు నూజివీడు : సాంఘిక సంక్షేమశాఖ పరిధిలోని గురుకుల పాఠశాలలు, వసతిగృహాల్లోని విద్యార్థులకు సంతృప్తికరమైన ఆహారం అందించేందుకు, పౌరసరఫరాల శాఖ నుంచి నాణ్యమైన బియ్యం అందించేందుకు రూ.80 కోట్లు కేటాయించినట్లు రాష్ట్ర సాంఘిక , గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. పట్టణంలోని విస్సన్నపేట రోడ్డులో నిర్మించిన గురుకుల పాఠశాల భవనాలను శనివారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రన్న చేయూత పథకం కింద గురుకుల పాఠశాలల్లో ఆంగ్లబోధన, కంప్యూటర్ విద్య, ఉన్నతమైన సౌకర్యాలు అందించనున్నామన్నారు. ఇప్పటికే ప్రతి గురుకుల పాఠశాలలో కంప్యూటర్‌విద్యను నిర్వహించేందుకు ఒక్కొక్క దానికి రూ.10లక్షలు కేటాయించామన్నారు. ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌అప్పారావు మాట్లాడుతూ ప్రస్తుతం గురుకుల పాఠశాలలో మురుగునీటి సమస్య ఉందని, ఈ సమస్యను తొలగించాలన్నారు. అలాగే నూజివీడులో స్టేడియం నిర్మాణం చేయాల్సి ఉందని, దీనికి సంబంధించిన భూమి కోర్టు వివాదాలలో ఉందని, స్టే ఎత్తివేయడానికి ప్రభుత్వం కృషిచేయాలన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్మన్ గద్దె అనూరాధ, నూజివీడు మున్సిపల్ చైర్పర్సన్ బసవా రేవతి, ప్రిన్సిపాల్ తాళ్ళూరు ఉమాదేవి, ఎంపీపీ తొమ్మండ్రు శ్రీనివాసరావు, జెడ్పీటీసీ బాణావతు రాజు , టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
కంప్యూటర్ విద్యకు మంగళం!
వేంపల్లె(వైఎస్సార్ జిల్లా): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రవేశపెట్టిన కంప్యూటర్ విద్యకు గడ్డు కాలం రానుంది. ఫ్యాకల్టీని ఏర్పాటు చేసి, బోధించే కాంట్రాక్ట్ నేటి(జూలై 31)తో పూర్తి కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 4,031 ప్రాజెక్టులకు మళ్లీ టెండర్లు పిలి చేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో కంప్యూటర్ విద్యను బోధిస్తున్న 8వేల మంది ఇన్స్ట్రక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకపై 4 వేల స్కూళ్లలో విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందని ద్రాక్షగా మారే ప్రమాదం కనిపిస్తోంది. రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ విద్య పథకాన్ని 2002లో అరకొర ఏర్పాట్ల మధ్య ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2008లో పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించారు. కంప్యూటర్ల కోసం ఒక్కో కేంద్రానికి రూ.2.50 లక్షలు వెచ్చించారు. తాజాగా టెండర్లు పిలిచి కొత్త కాంట్రాక్ట్ ఖరారు చేయడమో లేదా పొడిగించడమో చేయని పక్షంలో ఆగస్టు 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో కంప్యూటర్ కేంద్రాలు మూత పడడం ఖాయం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ పథకం అమలుకు రాష్ట్రం 30 శాతం నిధులను కేటాయించాల్సి ఉంటుంది. మిగతా 70 శాతం నిధులను కేంద్రం భరిస్తుంది. పథకం పర్యవేక్షణ బాధ్యత రాష్ట్రానిదే. టెండర్లు పిలిచి ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రానికి నివేదిస్తే 70 శాతం నిధులు లభిస్తాయి. మిగతా 30 శాతం నిధులు సర్దుబాటు చేయడానికి ఇష్టంలేని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రతిపాదనలు రూపొందించడంలో నిర్లక్ష్యం వహిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ తీరుపై ఇన్స్ట్రక్టర్లు మండిపడుతున్నారు. కంప్యూటర్ విద్య పథకాన్ని రాజీవ్ విద్యా మిషన్ ద్వారా నిర్వహించడం మేలని కొందరు అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. -
321 పాఠశాలల్లో కంప్యూటర్ విద్య ఎత్తివేత
హైటెక్ ఏలికల పాలనలో కంప్యూటర్ విద్య.. మిథ్యగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో నిరుపేద విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించే లక్ష్యంతో చేపట్టిన పథకాన్ని పాలకులు కొంతకాలంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితంగా జిల్లాలోని 321 పాఠశాలల్లో కంప్యూటర్ విద్య విద్యార్థులకు దూరమైంది. ఇందుకోసం ఏర్పాటు చేసిన కోట్లాది రూపాయల కంప్యూటర్ పరికరాలు నిరుపయోగంగా మారి, మూలనపడ్డాయి. కొత్తపేట :పాఠశాలల్లో కంప్యూటర్ విద్యపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తూం డడం విద్యార్థులకు శాపంగా మారింది. గడచిన రెండేళ్లలో జిల్లాలోని 321 పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను దశలవారీగా ఎత్తివేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ (ఐసీటీ) స్కీమ్ కింద రాష్ట్రంలోని వెయ్యి పాఠశాలల్లో 2002లో తొలివిడతగా కంప్యూటర్ విద్యను ప్రవేశపెట్టారు. అప్పట్లో జిల్లాలోని 53 పాఠశాలల్లో ఇది ఆరంభమైంది. ‘కార్పొరేట్’కు దీటుగా సామాన్య విద్యార్థులు కూడా ఎదగాలని భావించిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కంప్యూటర్ విద్యను మరిన్న పాఠశాలలకు విస్తరించారు. మారుమూల గ్రామాల్లోని పాఠశాలల్లో సైతం దీనిని అందుబాటులోకి తెచ్చారు. ఇందులో భాగంగా ఐసీటీ రెండో దశ కింద 2008 సెప్టెంబర్‌లో జిల్లాలోని మరో 321 పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను అందుబాటులోకి తెచ్చారు. మూడో దశ కింద 2010 జనవరిలో మరో 66 పాఠశాలల్లో దీనిని ప్రారంభించారు. కంప్యూటర్ విద్యకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తూ నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించింది. కంప్యూటర్ విద్య కోసం ప్రతి పాఠశాలకు 11 మోనిటర్లు, 5 ఐదు యూపీఎస్‌లు, మూడు సీపీయూలు, ఒక జనరేటర్, ఒక ప్రింటర్ సమకూర్చారు. ఇంటర్నెట్ సౌకర్యం కల్పించారు. ఇద్దరు ఫ్యాకల్టీలను నియమించారు. అవసరమైన ఫర్నిచర్ కూడా అందించారు. రెండో దశపై చిన్నచూపు కంప్యూటర్ విద్య 1, 3 దశలు బాగానే అమలవుతున్నా, రెండు దశలోని 321 పాఠశాలలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. రెండో దశకు సంబంధించి ప్రైవేటు ఏజెన్సీలతో ఐదేళ్లకు కుదుర్చుకున్న ఒప్పందం 2013 సెప్టెంబర్‌తో పూర్తయింది. దీనిని పునరుద్ధరించకపోవడంతో ఆయా ఏజెన్సీలు కంప్యూటర్లను పాఠశాలలకు అప్పగించాయి. ఫ్యాకల్టీలను తొలగించాయి. ఫలితంగా జిల్లాలోని 321 పాఠశాలల్లో కంప్యూటర్ విద్యకు తెర పడినట్లయింది. కంప్యూటర్లు మూలన పడ్డాయి. మూడో దశ అమలవుతున్న 66 పాఠశాలల్లో కూడా వచ్చే జూన్‌తో కాంట్రాక్ట్ పూర్తి కానుంది. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం కంప్యూటర్ విద్య గురించి పట్టించుకోవడంలేదు. ఫలితంగా పేద విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందడంలేదు. మరోపక్క కోట్ల రూపాయల విలువైన కంప్యూటర్లు నిరుపయోగంగా మారి, మూలకు చేరుతున్నాయి. కొనసాగించాలి కంప్యూటర్ విద్యను కొనసాగించాలని పలువురు విద్యార్థులు కోరుతున్నారు. విద్యా వలంటీర్ల మాదిరిగా ఫ్యాకల్టీలను నియమించి, కంప్యూటర్ విద్యను అందించాలని పలువురు సూచిస్తున్నారు. వాస్తవానికి ఫ్యాకల్టీ వద్ద ఆయా పాఠశాలల్లోని ఇద్దరు ఉపాధ్యాయులు ఐదేళ్లపాటు శిక్షణ పొందాలి. అనంతరం వారు ఆ పాఠశాలలో కంప్యూటర్ విద్యను బోధించాలి. ఇలా శిక్షణ పొందినట్టు పాఠశాలల రికార్డుల్లో పేర్కొన్నారు కానీ, వాస్తవానికి చాలాచోట్ల అలా శిక్షణ పొందిన దాఖలాల్లేవు. తమ రెగ్యులర్ తరగతులకు ప్రాధాన్యం ఇస్తూ కంప్యూటర్ విద్యను వారు పక్కన పెట్టేశారు. నియోజకవర్గ కథనాలు జోన్ పేజీల్లో.. -
కంప్యూటర్ విద్య మిథ్యే
జిల్లాలో 90 శాతం పాఠశాలల్లో ట్యూటర్లు కరువు 20 శాతానికిపైగా కంప్యూటర్లు చోరీ ఉన్న కంప్యూటర్లు పనిచేయని వైనం కొన్నింటిని సొంతానికి వాడుకుంటున్న టీచర్లు నెరవేరని ప్రభుత్వ లక్ష్యం చిత్తూరు: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. జిల్లాలో 309 పాఠశాలల్లో రూ.20కోట్లకు పైగా వెచ్చించి 3,399 కంప్యూటర్లను ప్రభుత్వం అందజేసింది. ఎవరాన్ కంపెనీ ద్వారా కంప్యూటర్ ట్యూటర్లను నియమించినా సక్రమంగా జీతాలు ఇవ్వకపోవడంతో వారు పత్తాలేకుండా పోయారు. 20 శాతానికి పైగా కంప్యూటర్లు చోరీకి గురయ్యాయి. 70 శాతం కంప్యూటర్లు మూల నపడ్డాయి. 10 శాతం కూడా పనిచేస్తున్న పరిస్థితి లేదు. కొన్ని చోట్ల ఉపాధ్యాయులు సొంత పనులకు వాడుకుంటున్న పరిస్థితి. కంప్యూటర్ విద్య కోసం ఇచ్చిన జనరేటర్లు కొన్ని చోరీకి గురి కాగా, మరికొన్ని పనికిరాకుండా పోయాయి. మొత్తంగా ప్రభుత్వం చిత్తశుద్ధి లోపించడ మే అందుకు కారణమవుతోంది. ► నియోజకవర్గంలో 41 ఉన్నత పాఠశాలలుండగా, 24 పాఠశాలలకు 264 కంప్యూటర్లు ఇచ్చారు. 90శాతం పాఠశాలల్లో కంప్యూటర్లు మూలనపడ్డాయి. శ్రీకాళహస్తి మండలం అక్కుర్తి పాఠశాలలో రెండు కంప్యూటర్లు చోరీ అయ్యాయి. ►చంద్రగిరి నియోజకవర్గంలో 29 పాఠశాలలకు కంప్యూటర్లు ఇచ్చారు. రామచంద్రాపురంలో 12 కంప్యూటర్లు చోరీ అయ్యాయి. చెడిపోయిన కంప్యూటర్లను బాగుచేసే వారు లేరు. కొన్నిచోట్ల కంప్యూటర్లను టీచర్లే వాడుకుంటున్నారు. ►గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో 32 పాఠశాలలకు కంప్యూటర్లు ఇచ్చా రు. మొత్తం కంప్యూటర్లు మూలనపడ్డాయి. పాలసముద్రం మండలం బలిజకండ్రిగ హైస్కూల్లో 11 కంప్యూటర్లు చోరీ అయ్యాయి. ►కుప్పం నియోజకవర్గంలో 42 పాఠశాలలకు కంప్యూటర్లు ఇచ్చారు. ఆరు పాఠశాలల్లో మాత్రమే కంప్యూటర్లు పనిచేస్తున్నాయి. . ►మదనపల్లె నియోజకవర్గంలో 50 పాఠశాలలకు కంప్యూటర్లు ఇచ్చారు. కంప్యూటర్లు ఎక్కడా పనిచేయడం లేదు. కొన్ని చోట్ల టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చినా వారు కూడా కంప్యూటర్ విద్యను బోధించే పరిస్థితి లేదు. ►పలమనేరు నియోజకవర్గంలో ఐదు మండలాల పరిధిలో 30 పాఠశాలల కు కంప్యూటర్లు ఇచ్చారు. ఎక్కడా పనిచేయడం లేదు. పలమనేరు మండలం దొడ్డిపల్లె హైస్కూల్లో కంప్యూటర్లు చోరీ అయ్యాయి. ►పీలేరు నియోజకవర్గంలో 55 పాఠశాలలకు కంప్యూటర్లు ఇచ్చారు. ఐదు పాఠశాలల్లో మాత్రమే కంప్యూటర్లు పనిచేస్తున్నాయి. కలికిరి, కలకడ పాఠశాలల్లో నాలుగు కంప్యూటర్లు చోరీ అయ్యాయి. ►పుంగనూరు నియోజకవర్గంలో 30 పాఠశాలలకు కంప్యూటర్లు ఇచ్చారు. 11 పాఠశాలల్లో మాత్రమే కంప్యూటర్లు పనిచేస్తున్నాయి. పుంగనూరు బసవరాజు హైస్కూల్లో నాలుగు కంప్యూటర్లు చోరీ అయ్యాయి. చౌడేపల్లె మండలం చారాల జెడ్పీ హైస్కూల్లో మూడు కంప్యూటర్లు చోరీ అయ్యాయి. ►పూతలపట్టు నియోజకవర్గంలో 29 పాఠశాలలకు కంప్యూటర్లు ఇచ్చారు. అన్ని పాఠశాలల్లో కంప్యూటర్లు మూ లనపడ్డాయి. ఎం.పైపల్లె పాఠశాలలో కంప్యూటర్లు చోరీ అయ్యాయి. ► తంబళ్లపల్లె నియోజకవర్గంలో 39 పాఠశాలలకు 320 కంప్యూటర్లు ఇ చ్చారు. బి.కొత్తకోట ఉర్దూ హైస్కూ ల్, బడికాయలపల్లె హైస్కూల్లో 15 కంప్యూటర్లు చోరీ అయ్యాయి. ►సత్యవేడు నియోజకవర్గంలో 45 పాఠశాలలకు 450 కంప్యూటర్లు ఇచ్చారు. 70 శాతం కంప్యూటర్లు నిరుపయోగంగా మారాయి. సత్యవేడు మండలం మదనంబేడు హైస్కూల్లో 10 కంప్యూటర్లు చోరీ అయ్యాయి. ►నగరి నియోజకవర్గంలో 29 పాఠశాలలకు కంప్యూటర్లు ఇచ్చారు. చాలా చోట్ల కంప్యూటర్లు పనిచేయడం లేదు. జనరేటర్లు కూడా పనిచేయడం లేదు. ►చిత్తూరు నియోజకవర్గంలో 31 పాఠశాలలకు కంప్యూటర్లు ఇచ్చారు. కొన్ని పాఠశాలల్లో మూడు నుంచి ఐదు వరకు కంప్యూటర్లను ఇచ్చారు. కొన్ని పాఠశాలల్లో ప్రైవేటు వ్యక్తులతో కంప్యూటర్ విద్య నేర్పిస్తున్నారు. జనరేటర్లు లే వు. విద్యుత్ లేకపోతే కంప్యూటర్లు పనిచేయడం లేదు. -
కంప్యూటర్ విద్య... అంతా మిథ్య
నారాయణఖేడ్: కంప్యూటర్ విద్య మిథ్యగా మారింది. సర్కార్ స్కూళ్లలోని విద్యార్థులకు కూడా కార్పొరేట్ స్థాయిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విద్యనందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన కంప్యూటర్ విద్య మూన్నాళ్ల ముచ్చటగా మారింది. లక్షల రూపాయలు వెచ్చించి కంప్యూటర్లు కొన్నప్పటికీ వాటిని ఎలా ఉపయోగించాలో చెప్పేవారు లేక అవన్నీ మూలనపడ్డాయి. సక్సెస్ చేద్దామని... 2008 సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను ప్రవేశ పెట్టింది. దీంతో అధికారులు లక్షల రూపాయలు వెచ్చించారు. కరెంటు సరఫరా లేని పాఠశాలలకు జనరేటర్ సౌకర్యం కూడా కల్పించారు. అయితే కంప్యూటర్ విద్యను నేర్పే బాధ్యతను మాత్రం ప్రైవేటు సంస్థకు అప్పగించారు. జిల్లాలో కంప్యూటర్ విద్య బోధన బాధ్యతలను ఎన్ఐఐటీ సంస్థకు ఐదేళ్ల పాటు కాంట్రాక్టు ఇచ్చారు. 2008లో ప్రాంభమైన కాంట్రాక్టు 2013 సెప్టెంబర్‌లో ముగిసింది. ఆ తర్వాత ప్రభుత్వం కాంట్రాక్టు పొడిగించేందుకు చర్యలు తీసుకోకపోవడంతో సంస్థ సిబ్బంది కంప్యూటర్ విద్యను షట్ డౌన్ చేశారు. కంప్యూటర్ విద్యను నేర్పేందుకు నియమించిన టీచర్లను తొలగించారు. అప్పటి నుంచి జిల్లాలోని 198 పాఠశాలల్లో కంప్యూటర్ విద్య ఆగిపోయింది. కంప్యూటర్లు మూలన పడ్డాయి. దీంతో ఆయా పాఠశాలల్లో పనిచేసే 396 మంది కంప్యూటర్ టీచర్లు నిరుద్యోగులుగా మారారు. ప్రతి పాఠశాలకూ 11 కంప్యూటర్లు కంప్యూటర్ విద్య కోసం సక్సెస్ పాఠశాలలుగా ఉన్న ఉన్నత పాఠశాలలకు 11 కంప్యూటర్లను అందించారు. దీంతో పాటు కంప్యూటర్లు విద్యుత్ సరఫరా లేకున్నా నడిచేందుకు పాఠశాలకు ఒక్కో జనరేటర్‌ను అందించారు. విద్యార్థులు కంప్యూటర్ విద్యను అందించేందుకు పాఠశాలకు ఇద్దరు టీచర్లను ఎన్ఐఐటీ సంస్థ నియమించింది. వారికి నెలకు రూ.2300 వేతనంగా అందించేది. 2013 సెప్టెంబర్‌లో ఎన్ఐఐటీ సంస్థ కాంట్రాక్ట్ ముగియడంతో అప్పటి ప్రభుత్వం కాంట్రాక్ట్‌ను పొడిగించలేదు. దీంతో విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందడంలేదు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కేజీ నుండి పీజీ వరకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్య అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. కానీ 2014 -15 విద్యా సంవత్సరం ప్రారంభమై ముడు నెలలు గడుస్తున్నా కంప్యూటర్ విద్యపై స్పందించడం లేదు. ఇప్పటికైన ఉన్నత లక్ష్యాలతో ప్రారంభించిన కంప్యూటర్ విద్యను ప్రభుత్వం కొనసాగించేలా సత్వర చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయమై జోగిపేట ఉప విద్యాధికారి పోమ్యానాయక్‌ను వివరణ కోరగా సక్సెస్ పాఠశాలల్లో ప్రస్తుత ఏడాది కంప్యూటర్ విద్య పూర్తి స్థాయిలో కొనసాగడం లేదని తెలిపారు. -
కంప్యూటర్ మిథ్య
చిన్నమండెం: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంప్యూటర్ విద్య అటకెక్కింది. దీంతో పాఠశాలల్లోని కంప్యూటర్లు మూలనపడ్డాయి. 2008వ సంవత్సరంలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల సక్సెస్ పాఠశాలను ఎంపిక చేసి ప్రభుత్వ ఉన్నతపాఠశాలల్లో కంప్యూటర్ విద్యను ప్రవేశపెట్టింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం 75 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం వ్యయాన్ని భరిస్తూ వచ్చాయి. విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించే బాధ్యతను ప్రభుత్వం ప్రైవేటు యాజమాన్యాలకు అప్పగించింది. అందులో భాగంగా జిల్లాలో ‘ఎవరన్’ ఎడ్యుకేషన్ అనే సంస్థకు ఐదేళ్ల కాంట్రాక్టు అప్పగించారు. వీరి కాంట్రాక్టు 2013 డిసెంబర్లో ముగియడంతో వారు నియమించిన సిబ్బందిని తొలగించి, కంప్యూటర్ విద్యకు ఫుల్స్టాప్ పెట్టారు. అప్పటినుంచి జిల్లాలోని 220 పాఠశాలల్లో కంప్యూటర్ విద్య ఆగిపోయింది. కంప్యూటర్లు మూలన పడ్డాయి. దాదాపు 440 మంది కంప్యూటర్ ఉపాధ్యాయులు నిరుద్యోగులయ్యారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కంప్యూటర్లు ప్రధానోపాధ్యాయుల ఆధీనంలో ఉన్నాయి. పట్టించుకోని ప్రభుత్వం పేద విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించడమే తమ లక్ష్యమని చెబుతున్న ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఆగిపోయిన కంప్యూటర్ విద్య గురించి పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యను అందిస్తున్నామని చెబుతున్న మాటలకు ఆచరణకు ఏమాత్రం పొంతన లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం పాఠశాలల్లో ఉన్న కంప్యూటర్లను వినియోగించి అదే పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు బోధిస్తే ఆ ఉపాధ్యాయుడికి వేతనంలో రూ.500 అదనంగా ఇవ్వాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఈ ప్రతిపాదననుఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. పర్యవేక్షణాధికారుల నిర్లక్ష్యం పేద విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించడంలో పర్యవేక్షణాధికారుల నిర్లక్ష్యం కూడా ఉందని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. ఆది నుంచి కూడా సాంకేతిక విద్యను అందించడంలో వారు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెబుతున్నారు. పిల్లలు కంప్యూటర్ విద్య నేర్చుకుంటారని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించిన తల్లిదండ్రులు ప్రస్తుతం తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కంప్యూటర్ టీచర్లను నియమించాలి: గత సంవత్సరం కంప్యూటర్ టీచర్లను తొలగించారు. అప్పటి నుంచి కంప్యూటర్ క్లాస్‌లు ఎవ్వరూ చెప్పడం లేదు. 6,7తరగతుల్లో కంప్యూటర్ తరగతులు బాగా చెప్పేవారు. ఇప్పుడు టీచర్లను తొలగించడంతో ఇబ్బంది పడుతున్నాం. డి.రమాదేవి, 8వ తరగతి, టి.చాకిబండ ఉన్నత పాఠశాల కంప్యూటర్ విద్యకోసమే ప్రభుత్వ పాఠశాలలో చేరాను: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ విద్య బాగా నేర్పుతున్నారని తెలుసుకుని మా తల్లిదండ్రులు ఈ పాఠశాలలో చే ర్పించారు. గత తరగతుల్లో కంప్యూటర్ విద్య నేర్చుకున్నాము, పదో తరగతికి వచ్చే సరికి కంప్యూటర్ ఉపాధ్యాయులను తొలగించారు. హనుమంతురెడ్డి, 10వ తరగతి కంప్యూటర్ విద్య తప్పనిసరి సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో విద్యార్థులందరికీ కంప్యూటర్ విద్య తప్పనిసరి. ప్రభుత్వం కనీస వేతనమైనా ఇచ్చి కంప్యూటర్ ఉపాధ్యాయులను నియమించాల్సి ఉంది. ప్రత్యేకంగా కంప్యూటర్ ఉపాధ్యాయులు లేక ప్రభుత్వం ఇచ్చిన కంప్యూటర్లు మూలనపడ్డాయి. - లక్ష్మీరమణయ్య, ఇన్‌ఛార్జి హెచ్ఎం, చాకిబండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల -
కస్తూరిబాలో ఆకలి కేకలు
* వాడరేవు కస్తూరిబా పాఠశాలలో అర్ధాకలితో విద్యార్థినులు * నెల రోజులుగా నిలిచిన సరుకుల పంపిణీ * రూ.4 లక్షల అద్దె బకాయి.. * అసౌకర్యాల నడుమ బాలికల అవస్థలు చీరాల: ఆ పాఠశాలలో చదువుతున్న బాలికలు పస్తులతో పోరాటం చేస్తున్నారు. కొద్ది నెలలుగా అల్పాహారం మొహం కూడా చూడలేదు. సాయంత్రం వేళ పెట్టే స్నాక్స్ అంటే వారికి తెలియదు. అరకొరగా పెట్టే భోజనంతో అర్ధాకలితో అలమటిస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిర్వహణ కోసం వస్తున్న లక్షలాది రూపాయలు అక్రమార్కుల పరమవుతున్నాయి. * మండలంలోని వాడరేవులోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో చీరాల, ఒంగోలు, కారంచేడు, పర్చూరు, నాగులుప్పలపాడు మండలాలకు చెందిన 139 మంది బాలికలు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యనభ్యసిస్తున్నారు. పది మంది టీచింగ్, 11 మంది నాన్ టీచింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. ఇక్కడ గతంలో పనిచేసిన ఎస్వో అక్రమాలకు పాల్పడటంతో విద్యాలయంలో చదువుతున్న బాలికలకు కష్టాలు మొదలయ్యాయి. * సరుకులు సప్లై చేసే ఒంగోలు కో ఆపరేటివ్ సొసైటీకి కస్తూరిబా బాలికల విద్యాలయం గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు రూ.2.5 లక్షల బకాయిలు ఉండటంతో నెల నుంచి సరుకుల పంపిణీ నిలిపేశారు. సరుకుల కోసం వచ్చిన నిధుల్ని గతంలో పనిచేసిన ఎస్వో స్వాహా చేయడంతో జూన్, జూలై నెలలకు సంబంధించిన నగదు ప్రభుత్వం నుంచి విడుదల కాలేదు. సరుకులు నిండుకోవడంతో అందులో పనిచేస్తున్న స్పెషలాఫీసర్ హమీదా బేగం గ్రామస్తులు, సిబ్బంది సాయంతో విద్యార్థులకు పట్టెడన్నం పెడుతున్నారు. దీనికి తోడు వారం రోజుల క్రితం భవనం అద్దె బకాయిలు రూ.4 లక్షలు పైగా ఉండడంతో భవన యజమాని విద్యార్థినులను, సిబ్బందిని ఉన్నపళంగా బయటకు పంపి తాళం వేశారు. ఉన్నతాధికారుల హామీతో మళ్లీ తెరిపించారు. భవనం అద్దె బిల్లులు పైనుంచి వస్తున్నప్పటికీగతంలో ఉన్న ఎస్వో తన సొంతానికి వాడుకున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. * విద్యార్థినులకు సరిపడా మరుగుదొడ్లు లేవు. 164 విద్యార్థినులు స్నానం చేసేందుకు కేవలం రెండు స్నానపు గదులు మాత్రమే ఉన్నాయి. వాటికి కూడా తలుపులు లేకపోవడంతో వేరే షెడ్డులో పరదాపట్ట కట్టుకుని స్నానం చేస్తున్నారు. * కంప్యూటర్ విద్యనందించేందుకు ప్రభుత్వం 2012లో 5 కంప్యూటర్లను అందజేసింది. సంబందిన టీచర్ లేరనే కారణంతో ఆ కంప్యూటర్లను ఇంత వరకు ఉపయోగించనేలేదు. * ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలకు రావల్సిన నిధులు విడుదల చేయాలని, విద్యార్థినులకు అసౌకర్యం కలగకుండా చూడాలని ప్రస్తుతం ఎస్‌వోగా పనిచేస్తున్న హమీదా బేగం కోరారు. -
కంప్యూటర్ విద్యకు ‘వైరస్’
ఘట్కేసర్ టౌన్: గ్రామీణ ప్రాంతాల్లోని సర్కారు స్కూళ్లల్లో చదువుకునే విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన కంప్యూటర్ విద్యకు వైరస్ సోకింది. చదువుతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు ప్రవేశపెట్టిన కంప్యూటర్ విద్య నీరుగారుతోంది. దీంతో కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన కంప్యూటర్లు, ఫర్నిచర్ ఎందుకూ పనికి రాకుం డా పోతున్నాయి. 2014లోనైనా కంప్యూటర్ విద్యకు మోక్షం కలుగుతుందనుకున్న విద్యార్థుల ఆశలు అడియాశలవుతున్నాయి. సర్కారు అనాలోచిత నిర్ణయాలవల్ల జిల్లాలో సుమారు 190 ఉన్నత పాఠశాలల్లో వేలాది విద్యార్థులు సాంకేతిక విద్యకు దూరమవుతున్నారు.ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా సర్కారు బడుల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించాలనే సంకల్పంతో 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సక్సెస్ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను ప్రవేశపెట్టారు. ఐదేళ్లపాటు కంప్యూటర్ విద్యను బోధించడానికి ప్రైవేటు ఏజన్సీలతో రాజీవ్ విద్యామిషన్ ఒప్పందం కుదుర్చుకుంది. పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్లను నియమించిన రెండు, మూడు సంవత్సరాల అనంతరం నిర్వహణను గాలికొదిలేయడంతో కంప్యూటర్ విద్య అందని ద్రాక్షలా తయారయింది. ఏజన్సీల గడువు గతేడాది సెప్టెంబర్‌తో ముగియడంతో కంప్యూటర్ విద్య అటకెక్కింది. ఫాకల్టీని నియమించకపోవడం, పనిచేసిన వారికి సక్రమంగా వేతనాలను చెల్లించకపోవడంతో విద్యార్థులు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందుకోలేకపోయారు. మూలనపడ్డ కంప్యూటర్లు.. వేతనాలను సక్రమంగా చెల్లించపోవడంతో ఇన్స్ట్రక్టర్లు విధులకు రావడం మానేశారు. దీంతో కోట్లాది రూపాయలను వెచ్చించి కొనుగోలుచేసిన కంప్యూటర్లు పాడయిపోయి మూలనపడ్డాయి. దీంతో నిర్వాహణ లేక కంప్యూటర్ గదులన్నీ దుమ్ము, ధూళితో నిండిపోయాయి. ఆశయం మంచిదైనా.. నిర్వహణ, పర్యవేక్షణ కొరవడి కోట్లాది రూపాయలు బూడిదలో పోసి న పన్నీరవుతోంది. మొదట ఇచ్చిన ఏజ న్సీల కాలపరిమితి ముగిసిందని, పాఠశాలల్లో సాంకేతిక విద్యపై అవగాహన ఉన్న ఇతర ఉపాధ్యాయులతో బోధిం చాలని జిల్లాలోని ప్రధానోపాధ్యయులందరికీ తెలిపినట్లు జిల్లా డిప్యూటీ విద్యాధికారిని ఉషారాణి తెలిపారు.