కంప్యూటర్‌ మార్కెట్‌ | computer market | Sakshi
Sakshi News home page

కంప్యూటర్‌ మార్కెట్‌

Published Sun, Aug 21 2016 11:35 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM

computer market

  • హైస్పీడ్‌ వర్క్‌కు కంప్యూటర్స్‌
  • కరీంనగర్‌ మార్కెట్‌హబ్‌ విక్రయాలు
  • కరీంనగర్‌ బిజినెస్‌ : కంప్యూటర్‌ లేనిదే రోజు గడవని పరిస్థితి. సాంకేతికపరంగా దూసుకుపోతున్న ఈ రోజుల్లో ప్రతి పనికి కంప్యూటర్‌ను వినియోగిస్తున్నాం. ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థల్లో వీటి సేవలను వినియోగిస్తున్నాం. గతంలో కంప్యూటర్‌లు కొనుగోలు చేయాలంటే హైదరాబాద్‌కు వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం కరీంనగర్‌లో అన్ని రకాల కంప్యూటర్‌లు అందుబాటులోకి వచ్చాయి. నగరంలో రోజురోజుకు కంప్యూటర్‌ మార్కెట్‌ విస్తరిస్తోంది. సేల్స్‌తోపాటు సర్వీసెస్‌ అందుబాటులోకి రావడంతో చాలా మంది ఇక్కడే కొనుగోలు చేస్తున్నారు. 
    అన్ని రంగాల్లో
    ప్రస్తుతం అన్ని రంగాల్లో కంప్యూటర్లు ప్రవేశించాయి. విద్యారంగం, వ్యాపార, వాణిజ్యరంగాలలోపాటు ఆటోమొబైల్, సూపర్‌మార్కెట్, సివిల్‌ ఇంజినీరింగ్‌లో బిల్డింగ్‌ డిజైన్‌లు, ఇంట్లో వాడుకునే పర్సనల్‌ కంప్యూటర్‌లు ఇలా చెప్పుకుంటూ పోతే అంతా కంప్యూటర్‌మయమైంది.  
    విద్యార్థులకు వరం 
    పాఠశాల స్థాయి నుంచే సాంకేతిక విద్యాబోధన ఉండడంతో ఇంటి వద్ద ప్రాక్టీస్‌ చేసుకునేందుకు తల్లిదండ్రులు కంప్యూటర్లు కొనుగోలు చేస్తున్నారు. అదనంగా సమాచారం, సబ్జెక్టులను లోతుగా తెలుసుకునేందుకు ఇంటర్నెట్‌ కనెక్షన్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు సైతం వారికి తెలియని విషయాలను తెలుసుకునేందుకు ఇంట్లో కంప్యూటర్‌లు వాడుతున్నారు. 
    ల్యాప్‌టాప్‌లు 
    ఒకే ప్రదేశంలో స్థిరంగా పనిచేసే వారు డెస్క్‌టాప్‌లు వాడుతుంటే.. ఎక్కడికి వెళ్లిన తమతోపాటు కంప్యూటర్‌ తీసుకెళ్లాల్సిన వారు ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేస్తున్నారు. ల్యాప్‌టాప్‌లతో ఇంట్లో, బయట కూడా వర్క్‌ చేసుకునే అవకాశం ఉంది. ఇందులో స్లిమ్, టచ్, కన్వర్టబుల్, గేమింగ్‌ ల్యాప్‌టాప్‌లు మార్కెట్లో సందది చేస్తున్నాయి. 
    సేవలు వేగం
    గతంతో పోలిస్తే ప్రస్తుతం కంప్యూటర్‌ల ద్వారా వేగవంతమైన సేవలు పొందుతున్నారు. అంతకుముందు లేటెస్ట్‌ మోడల్‌ కంప్యూటర్‌లు కరీంనగర్‌లో లభిస్తున్నాయి. మార్కెట్లో లేటెస్ట్‌గా 32జీబీ వరకు ర్యామ్‌లు, కోర్‌ ఐ–7 సిక్త్స్‌ జనరేషన్‌ ప్రాసెసర్స్, 4 టెరాబైట్స్‌ వరకు హార్డ్‌డిస్క్‌లు, 4 జీబీ గ్రాఫిక్‌కార్డులు, మౌస్‌లు, పెన్‌డ్రైవ్‌లు, బ్యాటరీలు, మ్యూజిక్, వాయిస్‌చాట్‌ కోసం హెడ్‌సెట్‌లు, హోం థియేటర్లు, యాంటి వైరస్‌లు, అదనపు సమాచారం భద్రపరుచుకునేందుకు ఎక్స్‌టర్నల్‌ హార్ట్‌డిస్క్‌లు, వెబ్‌క్యామ్‌లు, అన్నిల్యాప్‌టాప్‌ల చార్జర్‌లు, బ్యాటరీలు, ఇంటర్నెట్‌ సౌకర్యానికి కావాల్సిన రూటర్‌లు, అసెంబుల్డ్‌ బ్రాండెడ్‌ డెస్క్‌టాప్‌లు, ప్రింటర్లు  ఇలా అన్ని లేటెస్ట్‌ మోడల్స్‌ కరీంనగర్‌లోనే లభిస్తున్నాయి.  
     
    ధరలు(రూ..లలో)
    ల్యాప్‌టాప్‌లు 20వేలు– 1.5 లక్షలకు పైగా
    మినీల్యాప్‌లు 15 వేలు–20 వేలకు పైగా
    డెస్క్‌టాప్‌(అసెంబుల్డ్‌) 10వేలు–25 వేలు
    డెస్క్‌టాప్‌(బ్రాండెడ్‌) 20వేలు–లక్ష వరకు 
    ప్రింటర్స్‌ 2వేలు–50వేలు 
    హోం థియేటర్స్‌ 1000 –10 వేలు
    యాంటివైరస్‌లు 200–2 వేలు
    రూటర్స్‌ 800–2 వేలు
    పెన్‌డ్రైవ్‌లు 200–1000
    మౌస్‌లు 100–500
    కీబోర్ట్‌లు 200–2000
    హెడ్‌ఫోన్స్‌ 150–5000
    ఎక్స్‌టర్నల్‌ హార్ట్‌డిస్క్‌ 4వేల–కెపాసిటీని బట్టి
    అడాప్టర్స్, బ్యాటరీలు 500–4 వేలు
    వెబ్‌క్యామ్‌లు 500–1500
    మానిటర్స్‌ 4వేలు–15 వేలు
    క్యాట్రేజ్‌లు 300–3000 వరకు
    వినియోగదారులు పెరుగుతున్నారు
    –జి.భరద్వాజ్, ల్యాప్‌స్టోర్‌ యజమాని 
    కరీంనగర్‌లో కంప్యూటర్‌ వినియోగదారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. విద్యార్థుల నుంచి మొదలుకొని అన్ని రంగాల వారు కంప్యూటర్‌ల సాయంతో పనిచేస్తున్నారు. అత్యంత వేగవంతమైన సేవలందించేలా మార్కెట్లో నూతనంగా లేటెస్ట్‌ హై స్పీడ్‌ కాన్ఫిగరేషన్‌ కంప్యూటర్‌లు అందుబాటులో ఉన్నాయి. రోజురోజుకు కంప్యూటర్‌లతో అవసరాలు పెరగడంతో గిరాకీ సైతం పెరుగుతుంది. మేము కేవలం అమ్మకాలే కాకుండా సేవలను కూడా అందించడంతో వినియోగదారులు ఆసక్తి కనబరుస్తున్నారు.
     
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement