karimnagar market
-
ఎకరానికి రూ. 20 వేల పరిహారం ఇవ్వాలి
సాక్షిప్రతినిధి, కరీంనగర్: అకాల వర్షంతో పంట నష్టపోయి పుట్టెడు కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే ఎకరానికి రూ. 20 వేల పరిహారం చెల్లించి, పంటలన్నింటికీ గిట్టుబాటు ధర కల్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం వచ్చే ఏడాది నుంచి రైతులకు ఇస్తామన్న ఎకరానికి రూ. 4 వేలు ఈ సీజన్ నుంచే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నగేశ్, ఇతర నాయకులతో కలసి శ్రీకాంత్‌రెడ్డి జిల్లాలోని తిమ్మాపూర్, నుస్తులాపూర్లలో అకాల వర్షంతో దెబ్బతిన్న పత్తి పంటలను పరిశీలించారు. పంట నష్టం, రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రైతులు మాట్లాడుతూ పంటలు వేసి అప్పుల పాలయ్యామని, ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోయి రైతులకు ఎకరానికి రూ. 20 వేల పరిహారం, పత్తికి గిట్టుబాటు ధర క్వింటాల్‌కు రూ.5,500 చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ర్యాలీగా మార్కెట్ యార్డుకు వెళ్లి పత్తి కొనుగోళ్లను పరిశీలించారు. పత్తికి మద్దతు ధర లభించడం లేదని, రూ.2,000 నుంచి రూ.3,000 కంటే ఎక్కువ ధర పలకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రైతులతో కలసి వైఎస్ఆర్సీపీ నేతలు మార్కెట్ అధికారులను నిలదీశారు. అనంతరం మార్కెట్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గోగూరి నర్సింçహారెడ్డి ఆందోళన చేస్తున్న రైతులు, నాయకుల వద్దకు రాగా.. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోకుంటే ప్రత్యక్ష ఆందోళన చేపడతామని శ్రీకాంత్‌రెడ్డి హెచ్చరించారు. రైతులను ఆత్మహత్యల దిశగా మళ్లించవద్దని కోరారు. కరీంనగర్ జిల్లాలో 5 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేశారని తెలిపారు. రైతులు మార్కెట్‌కు తీసుకువచ్చిన పత్తి కొనుగోలులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. 200 సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు సగం కేంద్రాలు కూడా ఏర్పాటు చేయలేదన్నారు. మొక్కజొన్న, వరి, సోయా, మిర్చితోపాటు పత్తికి పంటలు దేనికి ప్రభుత్వం కనీస మద్దతు ధర చెల్లించలేదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర డాక్టర్స్ విభాగం అధ్యక్షుడు డాక్టర్ ప్రఫుల్లరెడ్డి, సేవాదళ్ అధ్యక్షుడు బండారు వెంకటరమణ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎన్.రవి, రాష్ట్ర కార్యదర్శులు బి.బ్రహ్మానందరెడ్డి, వి.గోపాలకృష్ణ, వనమాల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
రైతుల సంక్షేమమే లక్ష్యం
సాగునీరు అందించి తీరుతాం కోల్డ్‌స్టోరేజీలు, గోడౌన్ల నిర్మాణానికి పెద్దపీట రాష్ట్ర మార్కెటింగ్ మంత్రి హరీష్‌రావు కరీంనగర్: రైతు సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, పథకాలను సద్వినియోగం చేసుకుని అన్నదాతలు అభివృద్ధి చెందాలని రాష్ట్ర మార్కెటింగ్, నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. కరీంనగర్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం స్థానిక మార్కెట్ యార్డులో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎక్కడాలేని విధంగా మార్కెట్‌కమిటీ పాలకవర్గం నియామకాల్లో రిజర్వేషన్ విధానాన్ని పాటించామని చెప్పారు. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందజేస్తున్నామని, రైతులకు ఉపయోగపడేలా గోడౌన్ల నిర్మాణానికి పెద్దపీట వేస్తున్నామని స్పష్టంచేశారు. జిల్లాలో 8 మార్కెట్‌యార్డుల్లో ఆన్లైన్ కోనుగోలు విధానం అమలుచేయనున్నట్లు వివరించారు. రైతుబంధు పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో కోల్డ్‌స్టోరేజీ కేంద్రాలు ఏర్పాటుచేసేందుకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. ఉత్తరాదిలో అమలు చేస్తున్న డ్రైయర్స్ విధానాన్ని జమ్మికుంట మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. జమ్మికుంట, హుజూరాబాద్ యార్డుల్లో ఆధునిక రైతు బజారులను ఏర్పాటుచేయనున్నట్లు చెప్పారు. గోదావరి జలాలు తీసుకొస్తాం.. సాగు,తాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, రూ.25వేల కోట్లతో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి ప్రతీ ఎకరాకు గోదావరి జలాలను తీసుకొస్తామని హరీశ్‌రావు అన్నారు. త్వరలోనే వేములవాడ, సిరిసిల్ల, చొప్పదండి వంటి మెట్టప్రాంతాలకు కాలువల ద్వారా 1.60 లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని తెలిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం 12 నుంచి 16 నెలల్లో పూర్తిచేసి కరీంనగర్‌లోని ప్రతీపొలానికి రెండు పంటలు పండేలా నీరందిస్తామని అన్నారు. ముంపు నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ ఇస్తామని స్పష్టంచేశారు. – ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ అధికారాన్ని బాధ్యతగా స్వీకరించి రైతుల బాగోగులే లక్ష్యంగా పాలకవర్గం పనిచేయాలని సూచించారు. ఉత్తరతెలంగాణ జిల్లాల్లోనే గొప్పగా కరీంనగర్ మార్కెట్‌యార్డును తీర్చిదిద్దేలా పనిచేయాలని సూచించారు. జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, గంగుల కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్, సింగిల్‌విండో చైర్మన్ మంద రాజమల్లు మాట్లాడారు. అనంతరం మార్కెట్‌కమిటీ పాలకవర్గం చైర్మన్ గోగూరి నర్సింహారెడ్డి, వైస్‌చైర్మన్ ఎస్.రాజేశ్వర్‌రావు, 12 మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్ఎండీలో రోడ్డు పనులకు శంకుస్థాపన ఎల్ఎండీ కట్టపైన రూ.1.60 కోట్ల విలువైన ఎల్ఎండీ కుడివైపు రోడ్డు పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. లైటింగ్, వాకర్ట్రాక్ ఏర్పాటుకు మరో రూ.1.40కోట్లు మంజూరు చేస్తామని అన్నారు. టీఆర్‌ఎస్‌జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, డెప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, జñ డ్పీటీసీలు శరత్‌రావు, సిద్దం వేణు, ఎడ్ల శ్రీనివాస్, ఎంపీపీ వాసాల రమేశ్, జాయింట్ కలెక్టర్ శ్రీదేవసేన, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. కన్నేపల్లిని దత్తత తీసుకుంటా... కాళేశ్వరం: మహదేవపూర్ మండలంలో నిర్మించే మేడిగడ్డ బ్యారేజీ ప్రధాన పంప్‌హౌస్ కన్నేపల్లిలో భూములు కోల్పోతున్న నిర్వాసితులు కరీంనగర్లో భారీనీటి పారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావును సోమవారం కలిశారు. భూములు కోల్పోవడంతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ఎకరాకు రూ.15లక్షల పరిహారంతోపాటు కుటంబంలో ఒక్కరికి ఉద్యోగం కల్పించాలని వేడుకున్నారు. స్పందించిన మంత్రి హరీష్‌రావు అన్ని భూములకు ఒకే విధంగా పరిహారం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. అర్హతకలిగిన యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. కన్నేపల్లి గ్రామాన్ని దత్తత తీసుకోనున్నట్లు మంత్రి హరీష్‌రావు హామీ ఇచ్చినట్లు నిర్వాసితులు తెలిపారు. కన్నేపల్లి ఉపసర్పంచ్ శనిగరం మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ చిన్న మల్లారెడ్డి తదితరులు ఉన్నారు. -
కంప్యూటర్ మార్కెట్
హైస్పీడ్ వర్క్‌కు కంప్యూటర్స్ కరీంనగర్ మార్కెట్హబ్ విక్రయాలు కరీంనగర్ బిజినెస్ : కంప్యూటర్ లేనిదే రోజు గడవని పరిస్థితి. సాంకేతికపరంగా దూసుకుపోతున్న ఈ రోజుల్లో ప్రతి పనికి కంప్యూటర్ను వినియోగిస్తున్నాం. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థల్లో వీటి సేవలను వినియోగిస్తున్నాం. గతంలో కంప్యూటర్లు కొనుగోలు చేయాలంటే హైదరాబాద్‌కు వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం కరీంనగర్లో అన్ని రకాల కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చాయి. నగరంలో రోజురోజుకు కంప్యూటర్ మార్కెట్ విస్తరిస్తోంది. సేల్స్‌తోపాటు సర్వీసెస్ అందుబాటులోకి రావడంతో చాలా మంది ఇక్కడే కొనుగోలు చేస్తున్నారు. అన్ని రంగాల్లో ప్రస్తుతం అన్ని రంగాల్లో కంప్యూటర్లు ప్రవేశించాయి. విద్యారంగం, వ్యాపార, వాణిజ్యరంగాలలోపాటు ఆటోమొబైల్, సూపర్‌మార్కెట్, సివిల్ ఇంజినీరింగ్‌లో బిల్డింగ్ డిజైన్లు, ఇంట్లో వాడుకునే పర్సనల్ కంప్యూటర్లు ఇలా చెప్పుకుంటూ పోతే అంతా కంప్యూటర్మయమైంది. విద్యార్థులకు వరం పాఠశాల స్థాయి నుంచే సాంకేతిక విద్యాబోధన ఉండడంతో ఇంటి వద్ద ప్రాక్టీస్ చేసుకునేందుకు తల్లిదండ్రులు కంప్యూటర్లు కొనుగోలు చేస్తున్నారు. అదనంగా సమాచారం, సబ్జెక్టులను లోతుగా తెలుసుకునేందుకు ఇంటర్నెట్ కనెక్షన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు సైతం వారికి తెలియని విషయాలను తెలుసుకునేందుకు ఇంట్లో కంప్యూటర్లు వాడుతున్నారు. ల్యాప్‌టాప్‌లు ఒకే ప్రదేశంలో స్థిరంగా పనిచేసే వారు డెస్క్‌టాప్‌లు వాడుతుంటే.. ఎక్కడికి వెళ్లిన తమతోపాటు కంప్యూటర్ తీసుకెళ్లాల్సిన వారు ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేస్తున్నారు. ల్యాప్‌టాప్‌లతో ఇంట్లో, బయట కూడా వర్క్ చేసుకునే అవకాశం ఉంది. ఇందులో స్లిమ్, టచ్, కన్వర్టబుల్, గేమింగ్ ల్యాప్‌టాప్‌లు మార్కెట్లో సందది చేస్తున్నాయి. సేవలు వేగం గతంతో పోలిస్తే ప్రస్తుతం కంప్యూటర్ల ద్వారా వేగవంతమైన సేవలు పొందుతున్నారు. అంతకుముందు లేటెస్ట్ మోడల్ కంప్యూటర్లు కరీంనగర్లో లభిస్తున్నాయి. మార్కెట్లో లేటెస్ట్గా 32జీబీ వరకు ర్యామ్‌లు, కోర్ ఐ–7 సిక్త్స్ జనరేషన్ ప్రాసెసర్స్, 4 టెరాబైట్స్ వరకు హార్డ్‌డిస్క్‌లు, 4 జీబీ గ్రాఫిక్కార్డులు, మౌస్‌లు, పెన్‌డ్రైవ్‌లు, బ్యాటరీలు, మ్యూజిక్, వాయిస్‌చాట్ కోసం హెడ్సెట్లు, హోం థియేటర్లు, యాంటి వైరస్లు, అదనపు సమాచారం భద్రపరుచుకునేందుకు ఎక్స్టర్నల్ హార్ట్డిస్క్లు, వెబ్‌క్యామ్‌లు, అన్నిల్యాప్టాప్ల చార్జర్లు, బ్యాటరీలు, ఇంటర్నెట్ సౌకర్యానికి కావాల్సిన రూటర్లు, అసెంబుల్డ్ బ్రాండెడ్ డెస్క్‌టాప్‌లు, ప్రింటర్లు ఇలా అన్ని లేటెస్ట్ మోడల్స్ కరీంనగర్‌లోనే లభిస్తున్నాయి. ధరలు(రూ..లలో) ల్యాప్‌టాప్‌లు 20వేలు– 1.5 లక్షలకు పైగా మినీల్యాప్లు 15 వేలు–20 వేలకు పైగా డెస్క్‌టాప్(అసెంబుల్డ్) 10వేలు–25 వేలు డెస్క్‌టాప్(బ్రాండెడ్) 20వేలు–లక్ష వరకు ప్రింటర్స్ 2వేలు–50వేలు హోం థియేటర్స్ 1000 –10 వేలు యాంటివైరస్లు 200–2 వేలు రూటర్స్ 800–2 వేలు పెన్‌డ్రైవ్‌లు 200–1000 మౌస్‌లు 100–500 కీబోర్ట్లు 200–2000 హెడ్‌ఫోన్స్ 150–5000 ఎక్స్టర్నల్ హార్ట్‌డిస్క్ 4వేల–కెపాసిటీని బట్టి అడాప్టర్స్, బ్యాటరీలు 500–4 వేలు వెబ్‌క్యామ్‌లు 500–1500 మానిటర్స్ 4వేలు–15 వేలు క్యాట్రేజ్‌లు 300–3000 వరకు వినియోగదారులు పెరుగుతున్నారు –జి.భరద్వాజ్, ల్యాప్స్టోర్ యజమాని కరీంనగర్లో కంప్యూటర్ వినియోగదారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. విద్యార్థుల నుంచి మొదలుకొని అన్ని రంగాల వారు కంప్యూటర్ల సాయంతో పనిచేస్తున్నారు. అత్యంత వేగవంతమైన సేవలందించేలా మార్కెట్లో నూతనంగా లేటెస్ట్ హై స్పీడ్ కాన్ఫిగరేషన్ కంప్యూటర్లు అందుబాటులో ఉన్నాయి. రోజురోజుకు కంప్యూటర్లతో అవసరాలు పెరగడంతో గిరాకీ సైతం పెరుగుతుంది. మేము కేవలం అమ్మకాలే కాకుండా సేవలను కూడా అందించడంతో వినియోగదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. -
చెప్పిందే ధర
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : వ్యాపారులు పాడిందే పాటగా అయింది కరీంనగర్ మార్కెట్ యార్డులో పరిస్థితి. మార్కెట్‌కు పంట ఉత్పత్తులను తీసుకువచ్చిన రైతులను వ్యాపారులు నిలువుదోపిడీ చేస్తున్నారు. మార్కెట్లో బుధవారం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించగా మద్దతు ధర మచ్చుకైనా చెల్లించలేదు. ధాన్యం ఏ గ్రేడ్‌కు క్వింటాల్‌కు రూ.1,345,సాధారణ రకానికి రూ.1,310, పత్తికి రూ.4 వేలు, మక్కలకు రూ.1,310 మద్దతు ధరగా ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం వెయ్యి 50 క్వింటాళ్ల పత్తి రాగా తేమ, నాణ్యత లేదనే సాకుతో వ్యాపారులు కుమ్మక్కై ధరలు నిర్ణయించారు. ఒకరైతే నాలుగు సంచుల్లో పత్తి తేగా నాలుగు వేర్వేరు ధరలు నిర్ణయించారు. ఓ రైతుకైతే పూర్తిగా నాణ్యత లేదని క్వింటాల్‌కు రూ.1500 ధర నిర్ణయించడం వ్యాపారుల దోపిడీకి నిదర్శనం. తిరిగి ఇంటికి తీసుకెళ్లలేక... ఆ ధరకు అమ్ముకోలేక రైతులు ఆవేదనకు గురయ్యారు. కేవలం 12 బస్తాలకు రూ.4 వేలు ఆపై ధర చెల్లించగా, మిగతా మొత్తానికి రూ.3,300 నుంచి రూ.4 వేల లోపు చెల్లించారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సీసీఐ రంగంలోకి దిగకపోవడంతో వ్యాపారుల ఇష్టారాజ్యమైపోయింది. ముట్టి చూస్తూ ధర వ్యాపారులు చేతులతోనే తేమ పరీక్షలు చేస్తున్నారు. పత్తిని పట్టుకుని తేమ ఉందని మెలిక పెడుతూ ధరల్లో కోత విధించారు. రైతులకు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా సంచులపై ధరలు రాస్తూ వెళ్లిపోయారు. ధాన్యం 1,290క్వింటాళ్లు, మక్కలు వెయ్యి క్విం టాళ్లు వచ్చాయి. సివిల్ సప్లయిస్, మార్క్‌ఫెడ్ అధికారులు అక్కడే ఉన్నా ప్రేక్షకపాత్ర వహిం చారు. తేమ శాతం సాకుగా చూపి 10 శాతం కూడా ఆ సంస్థలు కొనుగోలు చేయకుండా పరోక్షంగా వ్యాపారుల దోపిడీకి సహకరించారు. వడ్లు, మక్కలకు సైతం చేతితోనే తేమ పరీక్ష చేస్తూ రైతులను నిలువుదోపిడీ చేశారు. జిల్లాలోని మార్కెట్‌యార్డులకు బాస్ అయిన మార్కెటింగ్ శాఖ ఏడీ పద్మావతి కరీంనగర్ మార్కెట్‌కు ఇన్చార్జి కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ధాన్యం, మక్కలను మద్దతు ధర కంటే క్వింటాల్‌కు రూ.200 నుంచి రూ.500 వరకు తగ్గించి ధర నిర్ణయించారు.