కలెక్టరేట్, న్యూస్‌లైన్ : వ్యాపారులు పాడిందే పాటగా అయింది కరీంనగర్ మార్కెట్ యార్డులో పరిస్థితి. మార్కెట్‌కు పంట ఉత్పత్తులను తీసుకువచ్చిన రైతులను వ్యాపారులు నిలువుదోపిడీ చేస్తున్నారు. మార్కెట్లో బుధవారం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించగా మద్దతు ధర మచ్చుకైనా చెల్లించలేదు. ధాన్యం ఏ గ్రేడ్‌కు క్వింటాల్‌కు రూ.1,345,సాధారణ రకానికి రూ.1,310, పత్తికి రూ.4 వేలు, మక్కలకు రూ.1,310 మద్దతు ధరగా ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం వెయ్యి 50 క్వింటాళ్ల పత్తి రాగా తేమ, నాణ్యత లేదనే సాకుతో వ్యాపారులు కుమ్మక్కై ధరలు నిర్ణయించారు.
ఒకరైతే నాలుగు సంచుల్లో పత్తి తేగా నాలుగు వేర్వేరు ధరలు నిర్ణయించారు. ఓ రైతుకైతే పూర్తిగా నాణ్యత లేదని క్వింటాల్‌కు రూ.1500 ధర నిర్ణయించడం వ్యాపారుల దోపిడీకి నిదర్శనం. తిరిగి ఇంటికి తీసుకెళ్లలేక... ఆ ధరకు అమ్ముకోలేక రైతులు ఆవేదనకు గురయ్యారు. కేవలం 12 బస్తాలకు రూ.4 వేలు ఆపై ధర చెల్లించగా, మిగతా మొత్తానికి రూ.3,300 నుంచి రూ.4 వేల లోపు చెల్లించారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సీసీఐ రంగంలోకి దిగకపోవడంతో వ్యాపారుల ఇష్టారాజ్యమైపోయింది.
ముట్టి చూస్తూ ధర
వ్యాపారులు చేతులతోనే తేమ పరీక్షలు చేస్తున్నారు. పత్తిని పట్టుకుని తేమ ఉందని మెలిక పెడుతూ ధరల్లో కోత విధించారు. రైతులకు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా సంచులపై ధరలు రాస్తూ వెళ్లిపోయారు. ధాన్యం 1,290క్వింటాళ్లు, మక్కలు వెయ్యి క్విం టాళ్లు వచ్చాయి. సివిల్ సప్లయిస్, మార్క్‌ఫెడ్ అధికారులు అక్కడే ఉన్నా ప్రేక్షకపాత్ర వహిం చారు.
తేమ శాతం సాకుగా చూపి 10 శాతం కూడా ఆ సంస్థలు కొనుగోలు చేయకుండా పరోక్షంగా వ్యాపారుల దోపిడీకి సహకరించారు. వడ్లు, మక్కలకు సైతం చేతితోనే తేమ పరీక్ష చేస్తూ రైతులను నిలువుదోపిడీ చేశారు. జిల్లాలోని మార్కెట్‌యార్డులకు బాస్ అయిన మార్కెటింగ్ శాఖ ఏడీ పద్మావతి కరీంనగర్ మార్కెట్‌కు ఇన్‌చార్జి కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ధాన్యం, మక్కలను మద్దతు ధర కంటే క్వింటాల్‌కు రూ.200 నుంచి రూ.500 వరకు తగ్గించి ధర నిర్ణయించారు.
చెప్పిందే ధర
Published Thu, Nov 7 2013 3:41 AM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM
Advertisement
Advertisement