204 పాఠశాలల్లో కంప్యూటర్ విద్య
Published Fri, Feb 28 2014 3:10 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం రూరల్, న్యూస్‌లైన్: దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఎర్నెట్ కార్యక్రమం ద్వారా జిల్లాలో 204 పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను అందించనున్నట్టు కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటీశాఖ సహాయ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి అన్నారు. గురువారం ఎర్నెట్ కార్యక్రమానికి సంబంధించి మండలంలోని రాగోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇ లెర్నింగు ఐసీటీ కేంద్రాలకు శంకుస్థాపన, 204 పాఠశాలల్లో ఇ లెర్నింగు ఐసిటీ ప్రాజెక్టు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజస్థాన్‌లోని ఆజ్మీర్ జిల్లా తరువాత దేశంలో రెండో జిల్లాగా మన జిల్లాలో ఈ ప్రాజెక్టును ప్రారంభిం చామన్నారు. దీని ద్వారా పేద వర్గాలకు చెందిన అనేక మంది విద్యార్థులకు ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు సమానమైన విద్యను అందించవచ్చన్నారు. మరో ఐదేళ్లలో రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్రకు కలిగే లాభం అందరికీ తెలుస్తుందన్నారు. జిల్లాలో ఎర్నెట్ ప్రాజెక్టు ద్వారా 1.50లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని కలెక్టర్ సౌరభ్ గౌర్ తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ డోల జగన్, జేసీ జి.వీరపాండ్యన్, ఎర్నెట్ ఇండియా డెరైక్టర్ జనరల్ నినా పహుజా, డెరైక్టర్ బీబీ.తివారీ, ప్రతినిధి దీపక్‌సిం గ్, డీఈవో ఎస్.అరుణకుమారి, డాక్టర్ కిల్లి రామ్మోహ న్‌రావు, డిప్యూటీ ఈవో ఎ.ప్రభాకరరావు పాల్గొన్నారు.
తిరుపతి-పూరీ ఎక్స్‌ప్రెస్ రైలును
పాత సమయాల్లో నడపాలి
తిరుపతి నుంచి పూరీ వరకు నడిచే ఎక్స్‌ప్రెస్ రైలును పాత సమయాల్లోనే నడపాలని కోరుతూ పలువురు రాగోలులో కేంద్రమంత్రి కృపారాణికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమయాలను మార్పు చేయడం వల్ల పొందూరు, ఆమదాలవలస నుంచి వివిధ పనులపై పలాస వెళ్లే వారికి ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పారు. , అందువల్ల పాత సమయాల్లోనే నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై అధికారులతో మాట్లాడతానని మంత్రి చెప్పారు.
కోర్ బ్యాంకింగ్ సేవలు ప్రారంభం
శ్రీకాకుళం: స్థానిక హెడ్ పోస్టాఫీసులో ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లోనే ప్రపథమంగా కోర్ బ్యాంకింగ్ సేవలను కేం ద్ర సహాయ మంత్రి కిల్లి కృపారాణి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోర్ బ్యాంకింగ్ వ్యవస్థను రూ.4,500 కోట్లతో దేశ వ్యాప్తంగా చేపడుతున్నట్టు చెప్పారు. అలాగే తపాలశాఖ ఆధ్వర్యంలో వెయ్యి ఏటీఎంలు ప్రారంభిస్తామని ఆమె తెలిపారు. శుక్రవారం టెక్కలిలో కోర్ బ్యాంకింగ్ సేవ లు ప్రారంభించనున్నట్టు చెప్పారు. తపాలా సేవలు మెరుగుపరిచేందుకు రూ.8 లక్షలతో హైదరాబాద్‌లో ఆటోమెటెడ్ మెయిల్ డెలివరీ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ప్రధాన పోస్టు మాస్టర్ జనరల్ బీవీ, సుధాకర్ మాట్లాడుతూ తపాల రంగంలో కోర్ బ్యాంకింగ్ విధానంలో ఏ పోస్టాఫీసు వద్ద అయినా డిపాజిట్ చేసిన నగదు పొందవచ్చని చెప్పారు. విశాఖపట్నం పోస్టు మాస్టర్ జనరల్ ఎం.సంపంత్, పోస్టల్ సేవల సంచాల కులు వెన్నం ఉపేందర్, శ్రీకాకుళం డివిజన్ సూపరిం టెండెంట్ జనపాల ప్రసాదబాబు, టెలికం సలహా మం డలి సభ్యులు వీవీఎస్ ప్రకాష్, కేంద్ర సాంఘిక బోర్డు సభ్యురాలు పూడి కమలపాల్గొన్నారు.
వికలాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ
స్థానిక కోడిరామ్మూర్తి స్టేడియంలో గురువారం సాయంత్రం కేంద్ర సహాయ మంత్రి కృపారాణి వికలాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వికలాంగుల సంక్షేమానికి అన్ని చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సామాజిక సాధికారిత మంత్రిత్వ శాఖ ద్వారా రూ.16 లక్షలతో 255 ట్రై సైకిళ్లను పంపిణీ చేస్తున్నామనారు. వికలాంగులు, వయోవృద్ధుల శాఖ సహాయ సంచాలకులు వై.లక్ష్మణరావు మాట్లాడుతూ 265 ట్రైసైకిళ్లు, 75 వీల్ చైర్లకు ప్రతిపాదనలు పెట్టామన్నారు.
Advertisement
Advertisement