ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రవేశపెట్టిన కంప్యూటర్ విద్య అటకెక్కనుంది. మంగ ళవారంతో కంప్యూటర్ బోధకుల కాంట్రాక్ట్ పూర్తి కానుంది. ఐదేళ్ల పాటు విద్యనందించినా ఆశించిన ప్రయోజనం మాత్రం నెరవేరలేదు. కరెంటు కోతలు, విద్యకు సరిపడా తరగతులు కేటాయించకపోవడం, బోధనలో లోపాలు, జీతాలు చాలడంలేదంటూ కొన్ని నెలలు బోధకులు బోధన పక్కన పెట్టడం వెరసి కంప్యూటర్ విద్య అంతంతమాత్రమే సాగింది.
మదనపల్లె, న్యూస్‌లైన్: ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యకు బ్రేక్ పడనుంది. బోధకుల కాంట్రాక్ట్ మంగళవారంతో పూర్తికానుం ది. ప్రవేటుకు దీటుగా సర్కారు బడుల్లోని పిల్లలకు విద్య నందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2002లో కంప్యూటర్ వి ద్యను ప్రవేశపెట్టింది. తొలుత కొద్ది పాఠశాల్లో మాత్రమే అ మలు చేశారు. 2008, సెప్టెంబర్ 22న అప్పటి సర్కారు రా ష్ట్ర వ్యాప్తంగా కంప్యూటర్ విద్యను ప్రవేశపెట్టింది. జిల్లాలో గుర్తించిన 400 పాఠశాలల్లో ఎవరాన్ సంస్థకు తరగతుల నిర్వహణను ప్రభుత్వం అప్పగించింది.
ఈ సంస్థ ఒక్కపాఠశాలలో ఇద్దరు బోధకుల లెక్కన 800మందిని నియమిం చింది. బోధకులకు నెలకు రూ.2500 నుంచి 3000 వరకు వేతనాలు చెల్లించేవారు. ప్రతి పాఠశాలలోను ఒక్కో బ్యాచ్‌కి వారంలో నాలుగు తరగతులతో కంప్యూటర్ విద్యను అం దించేవారు. ఎనిమిదో తరగతి విద్యార్థికి కంప్యూటర్ భాగాలు, బేసిక్స్ నేర్పించే వారు. తొమ్మిది, పదో తరగతుల్లో మేక్రో సాఫ్ట్ వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయిం ట్, ఇం టర్నెట్ తదితర అంశాలను నేర్పించేవారు. పదోతరగతి పూర్తయ్యే సమయానికి విద్యార్థులు కాస్తాయినా కంప్యూటర్ పరిజ్ఞానం పొందేలా సిలబస్‌ను రూపొందించారు. బో ధకుల కాంట్రాక్ట్ ఒప్పందం మంగళవారంతో ముగియనుండడంతో జిల్లాలో కంప్యూట్ విద్య మిథ్యగానే మి గలనుంది. ఐదేళ్లపాటు పనిచేసిన కంప్యూటర్ బోధకులు నిరుద్యోగులుగా మారనున్నారు.
సవాళ్లతో సాగిన బోధన
ఐదేళ్ల కాలంలో కంప్యూటర్ విద్యకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ఆశించిన మేరకు విద్య అందలేదు. వారానికి ప్రతి తరగతికి నాలుగు పీరియడ్లు కే టారుుంచినా వృథానే అరుు్యంది. చాలీ చాలని వేతనాలు ఇవ్వడంతో బోధకులు కొన్ని నెలలు పాటు శిక్షణ మానేశారు. పదో తరగతి విద్యార్థులు కూడా కంప్యూటర్ అంటే తెలియని వారున్నారు. బోధనలో లోపాలు, విద్యుత్ కోతల కారణంగా కొన్ని వె తలు ఏర్పడ్డాయి.
ప్రతి పాఠశాలలోను ఎవరాన్ సంస్థ జనరేటర్‌లు ఏర్పాటు చేసింది. వీటి నిర్వహణకై కిరోసిన్ కోసం నెలకు రూ. 250 ఇచ్చారు. కిరోసిన్ నల్లబజారులో లీటరు రూ.40 వరకూ ఉంది. ఈ దశలో నెలకు ఇస్తున్న రూ.250తో ఆరేడు లీటర్లు మాత్రమే కిరోసి వస్తుంది. వచ్చిన కిరోసిన్‌తో కేవలం 8 తరగతులు అంటే నాలుగురోజులు మాత్ర మే సరిపోతుంది. మిగిలిన రోజులు విద్యుత్ ఉంటే ప్ర యోగాలు లేదంటే బోధనలతోనే సరిపెట్టారు. రెండేళ్లుగా కోతలు ఎక్కువగా ఉండడంతో కంప్యూటర్ విద్య అంతంతమాత్రమే సాగింది. తమను మళ్లీ కొనసాగించాలని కాం ట్రాక్ట్ బోధకులు కోరుతున్నారు.
ఉపాధ్యాయులే బోధిస్తారు
బోధకులకు మంగళవారంతో కాంట్రాక్ట్ పూర్తవుతుంది. ఇప్పటికే ఆయూ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు ఇన్‌స్ట్రక్టర్లతో శిక్షణ ఇప్పించాం. ఆయూ ఉపాధ్యాయులు పీరియడ్‌లను సర్దుబాటు చేసుకుని కంప్యూటర్ పాఠా లు బోధించాల్సి ఉంటుంది. ఒక వేళ ప్రభుత్వం మళ్లీ పాత ఇన్ స్ట్రకర్లనే కొనసాగిస్తే, వారినే నియమిస్తాం.
- ప్రతాప్‌రెడ్డి, డీఈవో
కంప్యూటర్ విద్యకు మంగళం?
Published Tue, Oct 1 2013 4:38 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement