అంతా మాకు తెలియాలి..! | Everything we need to know | Sakshi
Sakshi News home page

అంతా మాకు తెలియాలి..!

Published Sun, Mar 8 2015 2:46 AM | Last Updated on Wed, Apr 3 2019 4:10 PM

Everything we need to know

కేయూ ఉద్యోగుల వివరాలు అడిగిన తెలంగాణ ప్రభుత్వం
కేటగిరీల వారీగా జాబితా అందించాలని ఆదేశాలు
లెక్కలు అందించిన తర్వాతనే బ్లాక్ గ్రాంట్ మంజూరు
వివరాల సేకరణలో ఇన్‌చార్జి రిజిస్ట్రార్

 
 కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో పారదర్శక పాలన చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా యూనివర్సిటీలో ఎంతమంది పనిచేస్తున్నారనే వి షయంపై వివరాలు అందించాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇన్‌చార్జి రిజిస్ట్రార్ రంగారావు  వివరాల సే కరణలో నిమగ్నమయ్యారు. కాగా, ప్రభుత్వం అడిగిన వివరాలతో ఫిబ్రవరికి సంబంధించిన వేతనాల విడుదలకు బ్రే క్ పడింది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కేయూ సమస్యలతో సతమతమవుతుంది. రెగ్యు లర్ వీసీ లేకపోవడంతో యూనివర్సిటీ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దీంతోపాటు దినసరి వేతన ఉద్యోగులను ఇష్టారాజ్యంగా నియమించుకోవడంతో సమస్యలు త లెత్తుతున్నాయి.

కాగా, యూనివర్సిటీకి ఏటా రూ.48 కోట్ల బ్లాక్ గ్రాంట్ మంజూరవుతున్నా అవి పూర్తిగా సరిపోవడంలేదు. ఈ క్రమంలో యూనివర్సిటీలో అసలు ఎంతమంది టీచింగ్, నాన్‌టీచింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు.. పెన్షన ర్లు, కాంట్రాక్ట్, దినసరి, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎంతమంది.. సెల్ఫ్ ఫైనాన్‌‌స ద్వారా నిర్వహిస్తున్న కోర్సులు, వా టి ఆదాయం, ఖర్చులు, ఫిక్స్‌డ్ డి పాజిట్లు, 2014-2015 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఎన్ని నిధులు పొందారనే వివరాలను తెలుపాలని ప్రభుత్వం ప్రత్యేక ప్రొఫార్మాను రూపొందించి ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌కు పంపించింది. అలాగే ప్రస్తుతం కావాల్సిన పో స్టుల మంజూరు, దినసరి వేతన ఉద్యోగులను ఏయే సంవత్సరంలో ఎంతమందిని నియమించుకున్నారో తెలుపాలని కోరింది. కాగా, ప్రభుత్వం అడిగిన వివరాలను స్పష్టంగా తెలియజేస్తేనే బ్లాక్ గ్రాంట్ మంజూరు కానుంది.

రూ. 17 కోట్లు బ్లాక్‌గ్రాంట్ మంజూరు..

కాగా, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.17 కోట్లు బ్లాక్ గ్రాంట్ కింద మంజూరు చేసింది. వాస్తవంగా  టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు విరమణ పొందినా అందుకు సంబంధించిన వివరాలు ప్రభు త్వానికి తెలియజేయకుండా మొత్తం పోస్టుల మంజూరు పేరిట అధికారులు బ్లాక్ గ్రాంట్‌ను విడుదల చేసుకుంటూ వస్తున్నట్లు తెలిసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం గతం లో, ఇటీవల భర్తీ చేసిన పోస్టుల వివరాలను కూడా అడుతుండడం గమనార్హం. ఇదిలా ఉండగా, 2013-2014 కే యూ బడ్జెట్ నివేదిక ప్రకారం అధ్యాపకులకు ఏడాదిపాటు వేతనాలు చెల్లింపులకు రూ 33.86 కోట్లు, నాన్ టీచింగ్ వేతనాలకు రూ.17.80 కోట్లు, పెన్షనర్లకు రూ. 6.50కోట్లు, దినసరి వేతన ఉద్యోగుల్లో కొందరికి యూనివర్సిటీ నుంచి చెల్లించేది రూ. 6.32 కోట్లుగా.. మొత్తంగా రూ. 83.98 కో ట్లు కాగా అప్పటిప్రభుత్వం విడుదల చేసిన బ్లాక్ గ్రాంట్ రూ.48 కోట్లు మాత్రమే వచ్చింది. దీంతో మిగతా లోటు రూ. 36 కోట్ల భారాన్ని దూరవిద్య కేంద్రం, పరీక్షల వి భాగం, అడ్మిషన్ల డెరైక్టరేట్, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు, ఇతర యూనివర్సిటీల కాలేజీల నుంచి వచ్చిన ఆదాయం ద్వారా సమకూర్చుకున్న పరిస్థితి ఉంది.

223 మంది దినసరి ఉద్యోగుల నియామకం..

యూనివర్సిటీ కాలేజీల్లోనూ, వివిధ విభాగాల్లోనూ లం ప్సమ్, దినసరి వేతన ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారు. కాగా, గత మూడేళ్లలో 223 మంది దినసరి వేతన ఉద్యోగులను ఇష్టారాజ్యంగా నియమించినట్లు సమాచారం. అయి తే వారు ఎక్కడ పనిచేస్తున్నారో ఆ విభాగాల నుంచే సంబంధిత అధికారులు వేతనాలు ఇస్తున్నారు. ఇంకా కొందరి ఉద్యోగుల లెక్కలు యూనివర్సిటీ అధికారుల వద్దలేవు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అన్ని కేటగిరీల ఉద్యోగుల వివరాలు ఆదాయం, ఖర్చులన్ని ప్రభుత్వం లేఖ ద్వారా అడగడంతో ఇన్‌చార్జి రిజిస్ట్రార్ వాటిని అందించేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, యూనివర్సిటీ కాలేజీలకు, క్యాంపస్‌లోని అ న్ని బ్రాంచ్‌ల హెడ్‌లకు లేఖను పంపుతూ మీమీ వద్ద పనిచేస్తున్న కేటగిరీల ఉద్యోగుల వివరాలు, దినసరి, లంప్సమ్ ఉద్యోగులతో సహా కాంట్రాక్ట్, పార్ట్‌టైం ఉద్యోగుల పేర్లతో ఈనెల 10లోగా తమకు పంపాలని రిజిస్ట్రార్ ఆదేశించారు.

టీచింగ్‌నాన్, టీచింగ్ ఉద్యోగుల సంఖ్య..

కేయూలో టీ చింగ్ పోస్టులు మంజూరైనవి 382. ఇందులో ప్రస్తుతం పనిచేస్తున్న అధ్యాపకుల సంఖ్య 236. ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులు 146 వరకు ఉన్నాయి. కాగా, నాన్‌టీచింగ్ ఉద్యోగులు వివిధ కేటగిరీల్లో కలిపి 634 పోస్టులు మంజూరుకాగా, ప్రస్తుతం 488 మంది రెగ్యులర్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. దీంతోపాటు దినసరి, లం ప్సమ్ ఉద్యోగులు 450 మంది వరకు పనిచేస్తున్నారు.
 
వేతనాలు ఇచ్చేందుకు ప్రత్నామ్నాయ మార్గాలు..

 బ్లాక్ గ్రాంట్ మంజూరు కాకపోవడంతో ఫిబ్రవరి వేతనాలు ఇంకా విడుదల కాలేదు. దీంతోఅధికారులు ప్రత్నామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. ఫిబ్రవరి వేతనాలు చెల్లించాలం టే రూ. 6.50 కోట్ల వరకు అవసరం ఉంది. ఇదిలా ఉండగా, దూరవిద్యా కేంద్రం ద్వారా తమకు రూ. 2కోట్లు కావాలని ఇన్‌చార్జి రిజిస్ట్రార్ రంగారావు కోరారు. కాగా, దీనిపై దూరవిద్యా కేంద్రం ఇన్‌చార్జి డెరైక్టర్ ప్రొఫెసర్ సీహెచ్ దినేష్‌కుమార్ ఇంకా స్పందించలేదని తెలుస్తోంది.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement