కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ సప్లిమెం టరీ పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. యూనివర్సిటీ పరిధిలోని వరంగల్, ఖమ్మం...
=22.06 శాతం ఉత్తీర్ణత నమోదు
=ఫైనల్ ఇయర్‌లో 14.19 శాతం ఉత్తీర్ణత
కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ సప్లిమెం టరీ పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. యూనివర్సిటీ పరిధిలోని వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు కరీంనగర్ జిల్లాలోని ఎక్స్ విద్యార్థులకు ఈ ఏడాది అక్టోబర్ 1నుంచి నవంబర్ 4వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించారు. కాగా, బీఏ, బీబీఎం, బీకాం, బీఎస్సీ ప్రథమ, ద్వితీయ, చివరి సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన ఈ పరీక్ష ఫ లితాలను వీసీ ప్రొఫెసర్ బి.వెంకటరత్నం, రిజి స్ట్రార్ ప్రొఫెసర్ కె.సాయిలు విడుదల చేశారు.
98,196మందికి 21,665 మంది ఉత్తీర్ణత
కేయూ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 98,196మంది విద్యార్థులు హాజరుకాగా, 21,665మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో వి ద్యార్థులు 11,744 మంది ఉండగా, విద్యార్థినులు 9,921మంది ఉన్నారు. కాగా, ఇందులో ఫైనల్ ఇయర్ విద్యార్థులు మాత్రం 14.19 శాతమే ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను కే యూ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ ఎంవీ.రంగారా వు, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ వెంకట్రాంరెడ్డి, డాక్టర్ ఈసం నారాయణ, డాక్టర్ క్రిస్టోఫర్ పాల్గొన్నారు.
సంవత్సరాల వారీగా...
డిగ్రీ ప్రథమ సంవత్సరం బీఏ, బీబీఎం, బీకాంసప్లిమెంటరీ పరీక్షలకు 46,762మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 10,665 మంది(22.70శాతం) ఉత్తీర్ణులయ్యారు.
ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 30,611 మంది విద్యార్థులు హాజరుకాగా, 8,095 మంది (26.44) ఉత్తీర్ణత సాధించారు.
చివరి సంవత్సరం పరీక్షలకు 20,823 మంది హాజరైతే 2,955మంది విద్యార్థులు(14.19శాతం) ఉత్తీర్ణత సాధించారని కేయూ అధికారులు వివరించారు.