=కబ్జాకు గురైందని గతంలో పోలీసు శాఖ నివేదిక
=హద్దు రాళ్లు పాతిన రెవెన్యూ శాఖ
=అవేమీ పట్టని పోలీసు అధికారి
=కేయూ భూవివాదంలో మరో మలుపు
సాక్షి, హన్మకొండ :జిల్లాలో కలకలం రేపిన కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ భూవివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆ స్థలం తనదేనంటూ ఓ అధికారి ప్రయత్నం... కబ్జా చేస్తున్నాడంటూ కేయూ సిబ్బం ది, విద్యార్థుల ప్రతిఘటన.. వెరసి ఈ అంశం గడిచిన రెండు రోజులుగా హాట్‌టాపిక్‌గా మారింది. కాగా తాజాగా వివాదానికి కారణమైన సర్వే నంబ రు 413-1లో ఉన్న భూమి ప్రభుత్వానిదేనని, దాన్ని కొందరు వ్యక్తులు నకిలీ ధ్రువపత్రాలతో కబ్జా చేశారంటూ 2013 మార్చిలో పోలీసు శాఖ స్వయంగా నివేదిక ఇవ్వడం గమనార్హం. ఇప్పుడు అదే స్థలం నాదంటూ మరో పోలీసు యత్నించడం అందరిని విస్మయానికి గురిచేస్తోంది.
శేత్వార్ 1955 ప్రకారం..
ప్రస్తుతం వివాస్పదంగా మారిన హన్మకొండ మండలం పలివేల్పుల గ్రామ పరిధిలోని సర్వే నంబరు 413, 414లలో ఉన్న భూమి రెవెన్యూ రికార్డు శేత్వార్ 1955 ప్రకారం ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి. అయితే 1975లో కాకతీయ యూనివర్సిటీ(అప్పట్లో పీజీ సెంటర్)కి ఆ తర్వాత ఎస్సారెస్పీ కెనాల్‌లకు ప్రభుత్వం ఈ భూమిని వివిధ సర్వే నంబర్లుతో కేటాయించింది. అందులో భాగంగా 413-1లో 3.07 ఎకరాల భూమిని కాకతీయ యూనివర్సిటీకి సర్వే నంబరు 413-2లో ఉన్న 0.02 ఎకరాల భూమిని కాకతీయ కెనాల్‌కి కేటాయించింది. దీని పక్కనే ఉన్న సర్వే నంబరు 414లో 28 గుంటల భూమిని ఎస్సారెస్పీకి ఇచ్చారు. మరో ఇరవై గుంటల భూమిని రోడ్డుకు కేటాయించారు. అలాగే సర్వేనంబరు 4142లో ఉన్న ఎకరం భూమిని కాకతీయ కెనాల్, పంపింగ్ హౌజ్‌కి కేటాయించింది.
ఖాళీగా ఉన్న స్థలం
ప్రభుత్వం కేటాయించిన భూముల్లో కాకతీయ కెనాల్, పంపింగ్ హౌస్, రోడ్డుల నిర్మాణం జరిగింది. కానీ కాకతీయ పీజీ సెంటర్‌కి సంబంధించిన భవనం నిర్మించలేదు. ఇప్పటికీ సుబేదారిలో ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలోనే కొనసాగుతోంది. ఆ తర్వాత పలివేల్పుల మాజీ సర్పంచ్ దేవరకొండ అనిల్ 413 సర్వే నంబర్‌లో ఉన్న మూడు ఎకరాల ఏడుగుంటల ఖాళీ భూమిలో 968 చదరపు అడుగుల స్థలాన్ని 414 సర్వే నంబర్‌లో ఉన్నట్లు 2009లో నకిలీ ధ్రువపత్రాలు సృష్టించాడు.
ఇదే భూమిని ఆ నకిలీ పత్రాలపై 2010, 2011లో వేరే వ్యక్తులకు అమ్మేశాడు. అనిల్ నుంచి భూమిని కొన్న వ్యక్తులు అక్కడ నిర్మాణాలకు ఏర్పాట్లు మొదలు పెట్టారు. పీజీ సెంటర్‌కు కేటాయించిన భూమి కబ్జాకు గురవుతుండడాన్ని గమనించిన కేయూ సిబ్బంది, విద్యార్థులు దీనిపై కేయూ పోలీస్‌స్టేషన్ 2012లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరిపి సర్వే నంబరు 413-1లో ఉన్న 3.07 ఎకరాల ప్రభుత్వ భూమిని నకిలీ ధ్రువపత్రాలతో కబ్జా చేసేందుకు యత్నించారని ఎస్పీకి నివేదిక సమర్పించారు. అనంతరం 2013లో ఫిబ్రవరి 2న విద్యార్థి సంఘాలు, కేయూ సిబ్బంది, రెవెన్యూ అధికారుల సమక్షంలో తిరిగి కొలతలు చేపట్టి హద్దురాళ్లను పాతారు. దీంతో వివాదం సద్దుమణిగింది.
మరోసారి వివాదంలోకి
తాజాగా 2014 జనవరి 1న సీఐ జానీ నర్సిం హులు 414 సర్వే నంబరులో ఉన్న 968 గజాల స్థలం తనేదేనని అందుకు సంబంధించిన ధ్రువపత్రాలు తన దగ్గర ఉన్నాయంటూ 413 సర్వే నం బరులో నిర్మాణానికి ఉపక్రమించడంతో మరోసా రి వివాదం చెలరేగింది. ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందంటూ పోలీసు శాఖ నివేదిక ఇచ్చిన భూమిలోకే మరో పోలీసు అధికారి నిర్మాణానికి యత్నిం చడం వివాదాన్ని మరింత పెద్దది చేసింది.
అది ప్రభుత్వ స్థలమే
Published Fri, Jan 3 2014 2:34 AM | Last Updated on Tue, Oct 30 2018 7:39 PM
Advertisement