పేపర్ లీకేజీ.. వారికి చాలా ఈజీ | The VC serious on questionnaire leak | Sakshi
Sakshi News home page

పేపర్ లీకేజీ.. వారికి చాలా ఈజీ

Published Sat, Jul 19 2014 3:45 AM | Last Updated on Sat, Sep 2 2017 10:29 AM

పేపర్ లీకేజీ.. వారికి చాలా ఈజీ

పేపర్ లీకేజీ.. వారికి చాలా ఈజీ

కాకతీయ విశ్వవిద్యాలయం ఎల్‌డీఎల్‌డీసీఈ పరీక్షల నిర్వహణ అవినీతిమయంగా మారింది. దూరవిద్య పరీక్షలు స్టడీ సెంటర్ల నిర్వాహకులకు, యూనివర్సిటీ అధికారులకు బంగారు బాతులా మారాయి.

కేయూక్యాంపస్ : కాకతీయ విశ్వవిద్యాలయం ఎల్‌డీఎల్‌డీసీఈ పరీక్షల నిర్వహణ అవినీతిమయంగా మారింది. దూరవిద్య పరీక్షలు స్టడీ సెంటర్ల నిర్వాహకులకు, యూనివర్సిటీ అధికారులకు బంగారు బాతులా మారాయి. పేపర్ లీక్ వ్యవహారం ఒకటి శుక్రవారం వెలుగులోకి వచ్చినప్పటికీ.. పరీక్షకు ముందు రోజు పేపర్ లీక్ చేయడం చాలా సెంటర్లలో ప్రతిఏటా జరిగే సాధారణ విషయమని తెలుస్తోంది. అంతేగాక మెజార్టీ సెంటర్లలో కేయూ పరీక్ష నియంత్రణ అధికారుల అండ, అబ్జర్వర్ల సహకారంతోనే మాస్ కాపీరుుంగ్ నిర్వహిస్తున్నారనే విమర్శలు ఉన్నారుు.
 
ముడుపులిస్తే.. సెల్ఫ్ సెంటర్లు..
కేయూ దూర విద్య డిగ్రీ పరీక్షల నిర్వహణ లోపభూయిష్టంగా మారింది. ఎస్‌డీఎల్‌సీఈ పరిధిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల్లో కలిపి  మొత్తం 97 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో డిగ్రీ మూడు సంవత్సరాలకు చెందిన సుమారు 50 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. అరుుతే యూనివర్సిటీ పరీక్షల విభాగంలో ముఖ్యస్థానాల్లో ఉన్న అధికారులు స్టడీ సెంటర్ల యూజమాన్యాలు ఇచ్చే ముడుపులు మింగి సెల్ఫ్ సెంటర్లు కేటారుుస్తున్నారనే ఆరోపణలు ఉన్నారుు. దీంతో ఆయా పరీక్షా కేంద్రాల యాజమాన్యాలు తమ ఇష్టానుసారంగా కాపీయింగ్ చేయిస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాస్ గ్యారంటీ స్కీమ్‌తో ఒక్కో అభ్యర్థి నుంచి పరీక్షల సమయంలో రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు.
 
యూనివర్సిటీ నుంచి వచ్చే అబ్జర్వర్లకు సుమారు రూ.50 వేల నుంచి లక్ష వరకు డబ్బులు ముట్టజెప్పి అభ్యర్థులతో చూచిరాతలు రారుుస్తున్నారు. ఇలా కొన్ని సెంటర్ల నిర్వాహకులు మాస్ కాపీరుుంగ్‌ను ప్రోత్సహిస్తుండగా హైదరాబాద్‌లోని కొన్ని ఎంఓయూ స్టడీ సెంటర్ల నిర్వాహకులు మాత్రం మరింత బరితెగిస్తున్నారు. వారి పరీక్ష కేంద్రాలకు రెండు, మూడు రోజుల ముందుగానే ప్రశ్నపత్రాలు చేరుకోవడంతో తమకు డబ్బులు ఇచ్చిన విద్యార్థులకు ముందుగానే  పేపర్ లీక్ చేసి పరీక్షలు రారుుస్తున్నారు.
 
టైం టేబుల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించినట్లు కనిపించినా.. ముందే రారుుంచిన జవాబు పత్రాల బండిల్స్‌ను పరీక్షల విభాగానికి పంపిస్తున్నారని తెలిసింది. హైదరాబాద్‌లోని ఎనిమిది ఎంఓయూ స్టడీసెంటర్లలో ఇదే తంతు సాగుతున్నట్లు సమాచారం. అంతేగాక ఏరోజు పరీక్షకు సంబంధించిన జవాబుపత్రాలను అదేరోజు సాయంత్రం ఓయూలోని గెస్ట్‌హౌస్‌లో ఉన్న ఎస్‌డీఎల్‌సీఈ సిబ్బందికి అందించాల్సి ఉండగా.. కొందరు మరుసటి రోజు తెల్లవారుజామున అక్కడికి చేరుస్తున్నారనే ఆరోపణలు ఉన్నారుు.
 
లీకేజీలకు అవకాశమిస్తున్న పరీక్షల నిర్వహణ తీరు..
టెన్త్, ఇంటర్ పరీక్షల సమయంలో ప్రశ్నపత్రాలను ఆయూ పరీక్ష కేంద్రాల పరిధిలోని పోలీస్‌స్టేషన్లలో భద్రపరచడం తెలిసిందే. కానీ యూనివర్సిటీ అధికారులు మాత్రం ఈ పద్ధతిపై దృష్టిసారించడం లేదు. దీని వెనక చేతులు మారుతున్న పైసలే కారణమని తెలుస్తోంది. ఇకనైనా టెన్త్, ఇంటర్ పరీక్షల తరహాలో పోలీస్‌స్టేషన్లకు ప్రశ్నపత్రాలు చేరవేస్తే లీకేజీని కొంతమేరకైనా అరికట్టవచ్చనే పలువురు యూనివర్సిటీ అధ్యాపకులు అభిప్రాయపడుతున్నారు.
 
పైసలిస్తే పాస్ నుంచి... లీకేజీ వరకు..
పరీక్షల విభాగంపై గతంలోనూ అనేక ఆరోపణలు వచ్చాయి. ఎస్‌డీఎల్‌సీఈలో అడ్మిషన్లు లేకుండానే కొందరు విద్యార్థులను పరీక్షలు రారుుంచిన ఘటనలు కూడా వెలుగుచూశారుు. ఎన్ని ఆరోపణలు, విమర్శలు వచ్చినా తమకేమి పట్టనట్లు వ్యవహరించటం అధికారులకు పరిపాటిగా మారింది. అంతేగాక యూనివర్సిటీ పరీక్షల విభాగంలో రెగ్యులర్ డిగ్రీ విధానంలో కూడా పైసలిస్తే పాస్ చేసిన కుంభకోణం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

ఈ వ్యవహారంలో అప్పటి పరీక్షల నియంత్రణాధికారులతోపాటు పలువురు సిబ్బందిపై కేసులు నమోదయ్యూరుు. పరీక్షల విభాగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసినా వారి తీరు మారడం లేదనే విమర్శలు వినిపిస్తున్నారుు. పరీక్షల విభాగంలో వరుసగా వెలుగు చూస్తున్న ఈ దందాలు యూనివర్సిటీ ప్రతిష్టను రాష్ట్రవ్యాప్తంగా దిగజారుస్తున్నారుు. న్యాక్ ఏ గ్రేడ్ పొందిన వర్సిటీకి  అవి మాయని మచ్చలుగా మిగిలారుు.
 
కేయూక్యాంపస్ : ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నారుు. పరీక్షల నియంత్రణాధికారుల అసమర్ధతను ఎండగడుతూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. శుక్రవారం ఉదయం పరీక్షా కేంద్రాలకు వెళ్లిన విద్యార్థుల సెలఫోన్లకు పరీక్షలు వాయిదా వేసినట్లు మెసేజ్ రావడంతో విద్యార్థులు ఆగ్రహం చెందారు. యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థుల్లో కొందరు దూరవిద్యాకేంద్రానికి వచ్చి అధికారులపై మండిపడ్డారు. అలాగే పరీక్షల విభాగం వద్ద వివిధ విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా చేశారు.
 
వెంటనే పరీక్షల రీషెడ్యూల్ ప్రకటించాలన్నారు. ప్రశ్నపత్రం లీక్‌కు బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో పీడీఎస్‌యూ, టీఆర్‌ఎస్‌వీ, టీ జీవీపీ, టీఎన్‌ఎస్‌ఎఫ్, ఎంఎస్‌ఎఫ్ తదిరత సంఘాల నాయకులు సూత్ర పు అనిల్, సీహెచ్. వీరన్న, వి. సుధాకర్, ముదిగొండరాజు, రడపాక విజయ్, రంజిత్, వీరన్న, మేడారపు సుధాకర్, వినోద్‌నాయక్, మహేష్, శరత్‌చంద్ర, తిరుపతి తదితరులు పాల్గొని నిరసన తెలిపారు. అలాగే పీడీ ఎస్‌యూ విద్యార్థులు కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సాయిలు కారుకు అడ్డంగా బైఠాయించి  నిరసన తెలిపారు. ఈ ఆందోళనలో పీడీఎస్‌యూ నాయకులు ఎం. చిరంజీవి, దుర్గం సారయ్య పాల్గొన్నారు. ఆందోళనలతో రిజిస్ట్రార్‌తోపాటు, పరీక్షల నియంత్రణాధికారి, పరీక్షల అదనపు నియంత్రణాధికారి పత్తా లేకుండా పోయూరు.
 
పరీక్షలు యథావిధిగా నిర్వహించాలి
దూరవిద్య డిగ్రీ పరీక్షలు యథావిధిగా నిర్వహించాలని, పేపర్ లీక్ జరిగిందని వాయిదా వేయటం సరికాదని మిగతా పేపర్ల సబ్జెక్టుల పరీక్షలను నిర్వహించాలని ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, ఎన్‌పీఆర్‌డీ జిల్లాకమిటీలు డిమాండ్ చేశాయి. అలాగే అబ్జర్వర్లపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయూ సంఘాల నాయకుల నూకల సతీష్‌కుమార్, శ్రీకాంత్, అశోక్‌స్టాలిన్, మదార్‌సాహెబ్, యాకయ్య, వై.సతీష్, వీరన్న, శ్రీకాంత్, ప్రశాంత్ కోరారు.
 
ప్రశ్నాపత్రం లీక్‌పై కేయూ ఇన్‌చార్జ్ వీసీ సీరియస్
ప్రశ్నాపత్రం లీకైన ట్లు హైదరాబాద్‌లో ఉన్న కేయూ ఇన్‌చార్జ్ వీసీ  వికాస్‌రాజ్ దృష్టికి వెళ్లగానే ఆయన సీరియస్‌గా స్పందించారు.  వెంటనే పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశించడంతోనే అధికారులు వాయిదా వేశారు. శుక్రవారం సాయంత్రం కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె. సాయిలు, పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ ఎంవీ రంగరావు, దూరవిద్యా కేంద్రం డెరైక్టర్ ప్రొఫెసర్ రాజేంద్రప్రసాద్ హైదరాబాద్ వెళ్లారు.
 
రీ షెడ్యూల్‌ప్రకటించాలి : విద్యార్థిని ఎస్. పల్లవి
 ఉదయం పరీక్షకు 15 నిమిషాల సమయం ఉందనగా పరీక్షలు వాయిదా అని మెస్సేజ్ వచ్చింది. దీంతో షాక్‌కు గురయ్యూం. ఎందుకంటే  మే నెలలోనే నిర్వహించాల్సిన పరీక్షలు ఆలస్యంగా జులైలో నిర్వహిస్తున్నారు. నేను పీజీ ఎంకామ్ ఎంట్రెన్స్ రాశాను. సీటు వచ్చే అవకాశం ఉంది. కానీ ఫైనలియర్ పరీక్షలు ఎప్పుడు జరిపిస్తారో కూడా వెల్లడించడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement