సిద్దిపేట జోన్, న్యూస్‌లైన్: ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ పరీక్ష(ఐసెట్) శుక్రవారం సిద్దిపేటలో ప్రశాంతంగా కొనసాగింది. కాకతీయ యూనివర్శిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐసెట్ పరీక్ష నిర్వహణ ఆద్యాంతం పరిశీలకుల పర్యవేక్షణలో కొనసాగింది. ఒక్క నిమిషం నిబంధన దృష్ట్యా విద్యార్థులు పరుగుపరుగున కేంద్రాలకు తరలివచ్చారు. సిద్దిపేటలోని మూడు కేంద్రాల్లో జరిగిన ప్రవేశ పరీక్షకు 1,641 మంది హాజరు కావాల్సి ఉండగా 1,519 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. వివిధ కారణాలతో 122 మంది విద్యార్థులు ఐసెట్‌కు గైర్హాజరయ్యారు. ఉదయం 10 గంటల నుంచి కొనసాగిన ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 12.30 గం. వరకు జరిగింది.
పరీక్షలను రీజినల్ కో ఆర్డినేటర్ జీఎం రాములు పర్యవేక్షించారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రంలో 781 మంది, ఎస్‌ఆర్‌కే డిగ్రీ కళాశాలలో 372 మంది, ప్రతిభా డిగ్రీ కళాశాలలో 366 మంది పరీక్షలు రాశారు. నిబంధనల మేరకు నిర్ణీత సమయం కంటే ముందే విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. సిద్దిపేటలో ఐసెట్ ప్రవేశ పరీక్షను తెలంగాణ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ సత్యనారాయణ చారి పరిశీలించారు. స్థానిక పోలీసులు కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించారు.
ఐసెట్ ప్రశాంతం
Published Sat, May 24 2014 12:26 AM | Last Updated on Sat, Sep 2 2017 7:45 AM
Advertisement