icet examination
-
టీఎస్ ఐసెట్ షెడ్యూల్ విడుదల..
సాక్షి, హైదరాబాద్ : టీఎస్ ఐసెట్ షెడ్యూల్ (2021-22)ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి బుధవారం విడుదల చేసింది. ఏప్రిల్ 3న ఐసెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పేర్కొంది. 7 నుంచి జూన్ 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. పరీక్ష ఫీజును 650గా నిర్ణయించింది. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా జూన్ 15 వరకు అప్లికేషన్లు తీసుకోనున్నట్లు పేర్కొంది. అలాగే ఆలస్య రుసుముతో అభ్యర్థులు జులై 30 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. కాగా జూన్ 30 వరకు-250 అపరాధ రుసుము, జులై 15 వరకు-500 అపరాధ రుసుము, జూలై 30 వరకు-1000 అపరాధ రుసుముతో తీసుకోనున్నట్లు వెల్లడించింది. ఇక ఆగస్టులో మూడు సెషన్లలో ఐసెట్ నిర్వహించనున్నట్లు తెలిపింది. అలాగే కేవలం అన్లైన్ ద్వారా మాత్రమే పరీక్ష నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది. ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం విద్యాశాఖ ఐసెట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: టీఎస్పీఎస్సీలోనే ఖాళీలు, ఇక నోటిఫికేషన్లు ఎలా? -
టీఎస్ ఐసెట్‌కు ఏర్పాట్లు పూర్తి
సాక్షి, కరీంనగర్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేవశానికి నిర్వహించే టీఎస్ ఐసెట్ ఈనెల 30న, అక్టోబర్ 1వ తేదిల్లో జరగునుందని టీఎస్ ఐసెట్ కన్వీనర్ ఆచార్య రాజీరెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. పరీక్షకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 58, 452 అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. రెండు రాష్ట్రాల్లో కలిపి 14 రీజనల్ సెంటర్లు, 70 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 30 వ తేదీన ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్ ఉంటుందన్నారు. రెండవ రోజు అక్టోబర్ 1న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు కరోనా నిబంధనలకు అనుగుణంగా మాస్క్ ధరించి శానిటైజర్ బాటిల్‌తో పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. బయోమెట్రిక్ ద్వారా కాకుండా ఫొటో క్యాప్చర్ విధానంతో అభ్యర్థుల హాజరును నమోదు చేస్తామని తెలిపారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డు, పెన్ను తెచ్చుకోవాలని ఆయన తెలిపారు. -
ఐసెట్ ప్రశాంతం
సిద్దిపేట జోన్, న్యూస్‌లైన్: ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ పరీక్ష(ఐసెట్) శుక్రవారం సిద్దిపేటలో ప్రశాంతంగా కొనసాగింది. కాకతీయ యూనివర్శిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐసెట్ పరీక్ష నిర్వహణ ఆద్యాంతం పరిశీలకుల పర్యవేక్షణలో కొనసాగింది. ఒక్క నిమిషం నిబంధన దృష్ట్యా విద్యార్థులు పరుగుపరుగున కేంద్రాలకు తరలివచ్చారు. సిద్దిపేటలోని మూడు కేంద్రాల్లో జరిగిన ప్రవేశ పరీక్షకు 1,641 మంది హాజరు కావాల్సి ఉండగా 1,519 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. వివిధ కారణాలతో 122 మంది విద్యార్థులు ఐసెట్‌కు గైర్హాజరయ్యారు. ఉదయం 10 గంటల నుంచి కొనసాగిన ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 12.30 గం. వరకు జరిగింది. పరీక్షలను రీజినల్ కో ఆర్డినేటర్ జీఎం రాములు పర్యవేక్షించారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రంలో 781 మంది, ఎస్ఆర్కే డిగ్రీ కళాశాలలో 372 మంది, ప్రతిభా డిగ్రీ కళాశాలలో 366 మంది పరీక్షలు రాశారు. నిబంధనల మేరకు నిర్ణీత సమయం కంటే ముందే విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. సిద్దిపేటలో ఐసెట్ ప్రవేశ పరీక్షను తెలంగాణ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ సత్యనారాయణ చారి పరిశీలించారు. స్థానిక పోలీసులు కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించారు.