-
నేడు 41వ ఏట అడుగిడనున్న కాకతీయ యూనివర్సిటీ
-
1968లో ఓయూ పరిధిలో పీజీ సెంటర్ ఏర్పాటు
-
నాలుగు విభాగాలతో 1976లో యూనివర్సిటీ ఆవిర్భావం
-
వైభవమంతా గతమే...
-
రాజ్యమేలుతున్న సమస్యలు
కేయూ క్యాంపస్ : లక్షలాది మందికి విద్యాబుద్ధులు నేర్పి.. ఎందరినో ఉన్నతంగా తీర్చిదిద్దడమే కాకుండా ఎన్నో ఉద్యమాలకు ఊపిరిలూదిన కాకతీయ యూనివర్సిటీ ఏర్పడి నేటితో నలభై సంవత్సరాలు పూర్తికానున్నాయి. నిత్యం వందలాది మంది అధ్యాపకులు, ఉద్యోగులు... యూనివర్సిటీ పరిధిలో పలు కళాశాలలు, పీజీ సెంట ర్లు.. చదువుకునే లక్షలాది మంది విద్యార్థులకు కళకళలాడే యూనివర్సిటీ శుక్రవారం 41వ సం వత్సరంలో అడుగు పెడుతోంది. అయితే, ఎం తో వైభవం, ఎన్నో ప్రత్యేకతలు ఉన్న యూనివర్సిటీ ప్రతిష్ట రోజురోజుకు మసకబారుతోంది. నూతన నిర్మాణాలు లేక... ఏటా రిటైర్ అవుతు న్న అధ్యాపకుల స్థానంలో కొత్త నియామకాలు చేపట్టకపోవడం వంటి కారణాలతో కేయూ వైభవమంతా గత చరిత్రగా మిగిలిపోనుందా అని విద్యావేత్తలు ఆవేదన చెందుతున్నారు.
ఓయూలో అంతర్భాగంగా..
ఉస్మానియా యూనివర్సిటీ 1968నుంచి పరిధి లో వరంగల్‌లో కాకతీయ యూనివర్సిటీగా పీజీ సెంటర్ మాత్రమే కొనసాగేది. ఆ తర్వాత 1976 ఆగస్టు 19వ తేదీన కాకతీయ యూనివర్సిటీ ఆవిర్బవించింది. తొలుత తెలుగు, ఇం గ్లిష్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ విభాగాలు ఏర్పాటుకాగా 1974లో ఎకనామిక్స్ విభాగం ఏర్పాటుచేశారు. ఫార్మసీ కోర్సు కూడా తొలుత ఓయూలో ఏర్పాటుకాగా ఆ కోర్సును 1975లో కేయూకు షిఫ్ట్ చేశారు. కాకతీయ యూనివర్సిటీ ప్రస్తుతం మూడు జిల్లాల పరిధిలో వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో కొనసాగుతోంది. గతంలో కరీంనగర్ కూడా జిల్లా కూడా కేయూ పరిధిలోనే ఉన్నా అక్కడ శా>తవాహన యూనివర్సిటీ ఏర్పాటుకావడంతో మూడు జిల్లాలకే పరిమితమైంది. కేయూ పరిధిలో 305 ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, మూడు అటానమస్ డిగ్రీ కళాశాలలు ఉండగా.. సాధారణ, వృత్తి విద్యాకోర్సులు కొనసాగతున్నాయి. పీజీ కళాశాలలు 76 ఉండగా అందులో 30కిపైగా పీజీ కోర్సులు ఉన్నాయి.
ఫార్మసీ కళాశాలలు 25, బీఈడీ 42, ఎంఈడీ నాలుగు కళాశాల లతో పాటు ఎనిమిది ఇంజనీరింగ్ కళాశాలలు, ముప్ఫై ఎంబీఏ, ఐదు ఎంసీఏ, మూడు ఎల్‌ఎల్ బీ, నాలుగు ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలు ఉన్నాయి. 650 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కాకతీ య యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో రెండు లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇంకా ఇక్కడ అంబేద్కర్ స్టడీసెంటర్, ఉమెన్స్ స్టడీ సెంటర్, ప్లేస్‌మెంట్ సెల్, స్టూడెంట్ వెల్ఫేర్ అండ్ గైడెన్స్ సెల్ సెం టర్ ఉంది. కేయూ పరిధిలోని ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్‌లో 350కి పైగా సబ్ యూనిట్లు, 35 వేల మంది వలంటీర్లు ఉన్నారు. ఇక్కడ 24 గం టలు తెరిచి ఉండే గ్రంథాలయం కొనసాగుతోం ది. యూనివర్సిటీలో చదువుకుని ఇక్కడే అధ్యాపకులుగా చేరిన వారు ఎందరో ఉన్నారు.
పడిపోతున్న విద్యాప్రమాణాలు
కాకతీయ యూనివర్సిటీలో గతంలో విద్యాబోధన, పరిశోధన నాణ్యతగా ఉండేది. తరగతులు సక్రమంగా సాగుతుండగా అధ్యాపకులు శ్రద్ధగా బోధించేవారు. సమాజంలో జరిగే అన్యాయాలను ప్రశ్నించేతత్వం కలిగిన పలువురు అధ్యాపకులు, విద్యార్థులు ఉండేవారు. ఇక్కడినుంచే వెళ్లిన వారు విప్లవ ఉద్యమంలో అగ్రనేతలుగా ఎదిగిన వారు కూడా ఉన్నారు. అయితే, కొన్నేళ్లుగా యూనివర్సిటీలో అనేక అవకతవకలు బయటపడగా.. విద్యాప్రమాణాలు బయటపడుతున్నాయి. 2009 సంవత్సరం నుంచి యూనివర్సిటీలో విద్యాబోధనపై తీవప్రభావం చూపింది. 30కిపైగా విభాగాలు ఉండగా పలు విభాగాల్లో క్లాస్‌లు జరగడం లేదు. ఇక పరిశోధన రంగంలో ఎంఫిల్, పీహెచ్‌డీలు బాగానే అవార్డ్ అవుతున్నా పరిశోధనలు నాణ్యత ఉండడం లేదనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటయ్యాక రెండేళ్ల తర్వాత ఇటీవల వీసీని నియమించింది.
సరిపడా లేని హాస్టళ్ల భవనాలు
కాకతీయ యూనివర్సిటీలో వివిధకోర్సుల్లో ప్ర వేశాలు పొందుతున్నా విద్యార్థులకు సరిపడా హాస్టళ్లు లేవు. యూనివర్సిటీ ఆవిర్భంచిన తర్వా త నిర్మించిన హాస్టళ్ల భవనాలు ఇప్పటికీ ఉపయోగిస్తుండగా.. రెండు, మూడు తప్ప కొత్త భవనాలు నిర్మించిన దాఖలాలు లేవు. అలాగే, హాస్టళ్ల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ప్రభుత్వం పెంచకపోవడంతో విద్యార్థుల మెస్ బకాయిలు పేరుకుపోయి ఇబ్బంది పడుతున్నారు. అలాగే, కేయూ పరిధిలో 391 టీచింగ్ పోస్టులకు 179 మందే పనిచేస్తున్నారు. ఇదే పరిస్థితి నాన్ టీచింగ్ విభాగాల్లో కనిపిస్తోంది. 1992 తర్వాత నాన్‌టీచింగ్ ఉద్యోగుల నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వలేదు.
బ్లాక్ గ్రాంట్ ఏటా రూ.68 కో ట్లే వస్తుండడంతో పింఛనర్లకు బెనిఫిట్స్ చె ల్లించలేని దుస్థితి నెలకొంది. మిగతా అవసరాల కు అంతర్గత నిధులు వెచ్చించాల్సి వస్తోంది. కాగా, నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న కేయూ పరిధిలోని దూరవిద్య డిగ్రీ, పీజీ పరీక్షలు కూడా నిర్వహించలేని పరిస్థితి విమర్శలకు తావిస్తోం ది. కాపీయింగ్ తదితర అంశాలతో దూరవిద్య ను కొందరు వ్యాపారంగా మార్చారు. ఈనెల 17నుంచి జరగాల్సిన దూరవిద్య డిగ్రీ, పీజీ పరీక్షలను వాయిదా వేయడం తాజాగా పరిస్థితికి అద్దం పడుతోంది.
భవనాలు లేని పీజీ సెంటర్లు
యూనివర్సిటీ పరిధిలో మూడేళ్ల క్రితం భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్‌లో పీజీ సెంటర్లు ఏర్పాటుచేశారు. అయితే, వీటికి సొం త భవనాలు లేకపోగా, రెగ్యులర్ అధ్యాపకు ల ను నియమించకపోవడం గమనార్హం. దీంతో పీజీ సెంటర్లలో చేరిన విద్యార్థులు ఇబ్బంది ప డుతున్నారు. ఇదే పరిస్థితి క్యాంపస్‌లోని రెండు ఇంజనీరింగ్ కళాశాలల్లోనూ నెలకొంది.