తెలంగాణలోని యూనివర్సిటీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ కాకతీయ యూనివర్సిటీలో గురువారం ఉద్యోగులు మహాధర్నా నిర్వహించారు.
కేయూ క్యాంపస్ : తెలంగాణలోని యూనివర్సిటీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ కాకతీయ యూనివర్సిటీలో గురువారం ఉద్యోగులు మహాధర్నా నిర్వహించారు. తెలంగాణ యూనివర్సిటీల ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు టీచింగ్, నాన్ టీ చింగ్ ఉద్యోగులు కేయూ పరిపాలనా భవనం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఉద్యోగుల వేతనాలకు సరిపడా బడ్జెట్ కేటాయించాలని, హెల్త్‌కార్డులు వర్తింపజేయాలంటూ నినాదాలు చేశారు.
అనంతరం అధ్యాపక, బోధనేతర ఉద్యోగ సంఘాల బాధ్యులు మా ట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కాకతీయ యూనివర్సిటీ ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు. యూనివర్సిటీల పట్ల రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యధోరణిని అవలంబిస్తోందని ఆరోపిం చారు. ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉద్యో గ సంఘాల నాయకులు, ఉద్యోగులు పి.కొండల్‌రెడ్డి, డాక్టర్ కోలా శంకర్, పి.వెంకట్రాంనర్సయ్య, డాక్టర్ వై.వెంకయ్య, డాక్టర్ జి.వీరన్న, డాక్టర్ సురేఖ, వై.శ్యాంసన్, వి.కృష్ణమాచార్య, టి.రాజయ్య, కె.సంపతి, కె.రవి, బి.సృజన, సీహెచ్.ప్రభాకర్, అబ్దుల్ షుకూర్, కొముర య్య, చిరంజీవి, అంకూస్, మల్లికాంబ, మెట్టు రవి, రాజిరెడ్డి పాల్గొన్నారు. రిటైర్డ్ ఉద్యోగ సంఘాల నాయకులు డి.విజయ్‌కుమార్, ఎస్.వెంకటేశ్వర్లు, డి.విజయకుమార్, ఎం.చేరాలు తదితరులు ఉద్యోగుల ఆందోళనకు మద్దతు ప్రకటించారు.
ఆర్ట్స్ కాలేజీలో...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా యూనివర్సిటీల్లోని ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడం గర్హనీయమని కేయూ ఎన్‌జీవో జనరల్ సెక్రటరీ డాక్టర్ పుల్లా శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో సుబేదారిలోని ఆర్ట్స్ కళాశాలలో ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని చెబుతున్న ప్రభుత్వం యూనివర్సిటీలకు వీసీ లు, రిజిస్ట్రార్లను నియమించలేకపోవడం గర్హనీ యమన్నారు. ఇప్పటికైనా యూనివర్సిటీల్లోని సమస్యలే కాకుండా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. డాక్టర్ ఈసం నారాయణ, ఉద్యోగ సంఘాల నాయకులు హరిగోవింద్ సింగ్, బాలాజీ, అంకూస్, రాజు, మల్లయ్య, నారాయణరావు, సురేష్, సూపరింటెండెంట్ కిష్టయ్య పాల్గొన్నారు.