న్యూశాయంపేట: కాకతీయ యూనివర్సిటీ భూముల కబ్జాపై ఫైలును తిరగతోడి కలెక్టర్, జేసీ, ఏడీ ల్యాండ్ సర్వే, ఆర్డీఓలతో ప్రత్యేక కమిటీవేసి కబ్జాకోరుల భరతం పడుతామని గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్ అన్నారు.హన్మకొండ నయింనగర్‌లోని అర్బన్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేటీఆర్ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నాయకుల కళ్లు కుట్టి ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి కేటిఆర్ కార్టూన్ కాదని కడిగిన ముత్యం అని అభివర్ణించారు. పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌పై నాయిని లేని పోని ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. 2019లో అసలు నాయిని రాజేందర్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందా లేదా తెలుసుకొని వినయ్‌భాస్కర్ గురించి మాట్లాడాలన్నారు.
కుడా చైర్మెన్ మర్రి యాదవరెడ్డి మాట్లాడుతూ అనునిత్యం ప్రజల కష్టాలను తెలుసుకొని ముందుకు సాగుతున్న వినయ్‌భాష్కర్‌పై ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ తరపున టికెట్ తెచ్చుకొని ఎమ్మెల్యే గెలిస్తే తాను రాజకీయాల్లోంచి వైదొలుగుతానని సవాల్ విసిరారు. విలేకరుల సమావేశంలో గ్రంథాలయ సంస్థ చైర్మెన్ మహ్మద్ అజీజ్‌ఖాన్, తాడు గౌరవ అధ్యక్షుడు గుడిమళ్ల రవికుమార్, కార్పొరేటర్‌లు వద్దిరాజు గణేష్,వీరగంటి రవిందర్,జోరిక రమేష్, టిఆర్‌ఎస్‌వి నేతలు కంచర్ల మనోజ్,ప్రవీణ్,చాగంటి రమేష్, పరుశరాములు తదితరులు పాల్గొన్నారు.
కమిటీని స్వాగతిస్తాం : నాయిని
కాకతీయ యూనివర్సిటీ భూముల కుంభకోణంపై వేయబోతున్న కమిటీని స్వాగతిస్తున్నామని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. కేయూ భూముల కుంభకోణంపై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు మేయర్ ప్రకటించడంపై ఆయన స్పందిం చారు. ఈ మేరకు ‘సాక్షి’కార్యాలయానికి ఫోన్ చేసి చెప్పా రు. కాకతీయ యూనివర్సిటీ భూముల కుంభకోణంపై వేయబోతున్న కమిటీకి స్వాగతిస్తున్నాం. కమిటీలో ఇద్దరు విద్యార్థి సంఘ నాయకులు, ఇద్దరు అధ్యాపకులను సభ్యులుగా చేర్చాలి. విచారణ జరిగేంత వరకు కేయూ ఆర్చి గేటుదగ్గర చెప్పుల దండ ఉంచాలి..దోషులుగా తేలిన వారి మెడలో ఆ దండ వేసి ఊరేగించాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment