బాధ్యతలు వద్దంటూ ప్రొఫెసర్
అసిస్టెంట్ ప్రొఫెసర్ యాదగిరిరావు రిజిస్ట్రార్‌కు లేఖ
సుజాతకుమారికి అవకాశం?
కేయూక్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మానవనరుల విభాగానికి విభాగ అధిపతిగా ఆవిభాగం ప్రొఫెసర్ యాదగిరిరావును ఈనెల 7వ తేదీన నియమాకం చే స్తూ కేయూ ఇన్‌చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈనెల 19వ తేదీ వరకు కూడా ఆయన బాధ్యతలను స్వీకరంచ లేదు. అంతేగాకుండా తాను విభాగం అధిపతిగా బాధ్యతలను స్వీకరించబోనని కూడా రెండు రోజుల క్రితం కేయూ ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌కు లేఖను అందజేశారు. విభాగం అధిపతిగా ఉన్న ప్రొఫెసర్ ఎం. విద్యాసాగర్‌రెడ్డి ఈనెల 4వతేదీతో పదవీకాలం ముగిసింది. రొటేషన్ ప్రకారం విభాగం అధిపతిగా ప్రొఫెసర్ సత్యనారాయణ నియమాకం కావాల్సి ఉండగా తాను విభాగం అధిపతిగా బాధ్యతలను చేపట్టబోనని సత్యనారాయణ బీవోఎస్‌గానే కొనసాగుతానని ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌కు లేఖ అందజే యటంతో కేయూ యూజీసీ కోఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రొఫెసర్ యాదగిరిరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ ఆయన కూడా బాధ్యతలను స్వీకరించనని నాట్ విల్లింగ్ ఇస్తూ లేఖ అందజేశారు. దీంతో15 రోజులుగా విభాగంనకు అధిపతి లేకపోవటంతో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మానవవనరుల విభాగం‘హెడ్’లేని విభాగంగా కొనసాగుతుంది.
ప్రొఫెసర్ యాదగిరిరావు వెనుకంజకు కారణమేమిటీ
కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మానవనరుల విభాగం విభాగం అధిపతిగా నియామకం అయ్యాక ఈనెల 12వతేదీన ప్రొఫెసర్ యాదగిరిరావు విభాగం అధిపతిగా బాధ్యతలను స్వీకరించేందుకు విభాగానికి వెళ్లగగా పీహెచ్‌డీలో సీట్లు రాని అభ్యర్థులు వచ్చి ప్రవేశాల ఎంపికలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ యాదగిరిరావుతో వాగ్వాదాలకు దిగారు. అనంతరం వెళ్లిపోయిన ప్రొఫెసర్ యాదగిరిరావు బాధ్యతలను స్వీకరించటం లేదు. చివరికి యాదగిరిరావు రెండు రోజుల క్రితం తాను ఆవిభాగం అధిపతిగా ఉండబోనని ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌కు లేఖ అందజేశారు. గత 15రోజులుగా విభాగం అధిపతి ఎవరు లేకపోవటం వలన విద్యార్థులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. అయితే విభాగం అధిపతిగా ఎవరిని నియమించినా వారికి చార్జీ ఇచ్చేందుకు విద్యాసాగర్‌రెడ్డి నిరీక్షిస్తున్నారు. ప్రస్తుతం యాదగిరిరావు యూజీసీ కో ఆర్డినేటర్‌గా కొనసాగుతున్నారు.
ఇక సుజాతకుమారి వంతు ?
కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మానవ వనరుల విభాగం అధిపతిగా ఇద్దరు ప్రొఫెసర్‌లు నాట్ విల్లింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ సుజాతకుమారిని విభాగ అధిపతిగా నియమించే అవకాశాలున్నాయి. ఈమేరకు ఒకటి రెండురోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశాలుంటాయని సర్వత్రా భావిస్తున్నారు. సమస్య కేయూ ఇన్‌చార్జి రిజిస్ట్రార్ దృష్టికి వెళ్లినా త్వరతగతిన సమస్యను పరిష్కరించి విభాగం అధిపతిని నియమించటంలో జాప్యం చేయటం పట్ల పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
కేయూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి ‘అధిపతి’ కావలెను
Published Thu, Aug 20 2015 2:17 AM | Last Updated on Sun, Sep 3 2017 7:44 AM
Advertisement
Advertisement