
కేయూ క్యాంపస్ (వరంగల్): కరోనా కట్టడికిగాను విద్యాసంస్థలను మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కాకతీయ విశ్వవిద్యాలయానికి కూడా సెలవులు ప్రకటించారు. అలాగే, బుధవారం మధ్యాహ్నం భోజనం అనంతరం వసతిగృహాలను కూడా మూసి వేయనున్నట్లు చెప్పడం.. మరోవైపు పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొనడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో అధికారులు, విద్యార్థులకు మధ్య స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పరీక్షలు నిర్వహిస్తూ హాస్టళ్లను మూసివేస్తే తామెక్కడ ఉండాలంటూ విద్యార్థులు ప్రశ్నించారు. యూనివర్సిటీ ఆవరణ నుంచి కేయూ క్రాస్ రోడ్డు వరకు వెళ్లి రాస్తారోకో చేశారు. ఆందోళన కారణంగా రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో అధికారులు యూనివర్సిటీ పరిధిలోని అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment