హాజరుకానున్న 4,698 మంది విద్యార్థులు
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
కేయూ క్యాంపస్ : ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు శనివారం జరుగనున్న టీఎస్ ఎంసెట్ -2కు జిల్లా కేంద్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు ఎంసెట్ రీజినల్ కోఆర్డినేటర్, కాకతీయ యూని వర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి తెలిపారు. ఈ పరీక్షకు 4,698 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని చెప్పారు. శనివారం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించే ఈ పరీక్షకు 8కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
హన్మకొండలోని సుబేదారి యూనివర్సిటీ ఆర్ట్స్‌అండ్‌సైన్స్ కళాశాల, కేయూ ఇంజనీరింగ్ కళాశాల, యూనివర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాల, యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల, యూనివర్సిటీ కాలేజీ కేయూ క్యాంపస్, సీకేఎం ఆర్ట్స్‌అండ్‌సైన్స్ కళాశాల, ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ కళాశాల, లాల్‌బహుదూర్ కళాశాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ఎంసెట్ నిర్వహణకు 8మంది చీఫ్ సూపరింటెండెంట్‌లను, 12మంది అబ్జర్వర్లను, రెండు ఫ్లయింగ్‌స్క్వాడ్‌లను నియమించినట్టు చెప్పారు. పరీక్షాకేంద్రాలకు ఒక గంట ముందుగా చేరుకోవాలని, నిర్దేశించిన సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షాకేంద్రాల్లోకి అనుతించబోరన్నారు. సెల్‌ఫోన్‌లు తదితర ఎలక్ట్రానిక్‌పరికరాలు తీసుకురావద్దన్నారు.