వరంగల్‌స్పోర్ట్స్, న్యూస్‌లైన్: కాకతీయ యూనివర్సిటీలో ఈనెల 27 నుంచి సెంట్రల్‌జోన్ పురుషుల క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కేయూ రిజిస్ట్రార్ సాయిలు వెల్లడించారు. మంగళవారం కేయూలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ దిగంబరరావుతో కలిసి ఆయన మాట్లాడారు. కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇప్పటికే సెంట్రల్‌జోన్ పురుషుల కబడ్డీ, పురుషుల, మహిళల హ్యాండ్‌బాల్ పోటీలను విజయవంతంగా నిర్వహించామని అన్నా రు.
ఈనెల 27 నుంచి జనవరి 3వ తేదీ వరకు సెంట్రల్‌జోన్ పురుషుల కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలకు మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, యూపీ, మధ్యప్రదేశ్, తెలంగాణ ప్రాంతంలోని జట్లు వస్తున్నాయన్నారు. 43 జట్లు వస్తుండగా 688 మంది క్రీడాకారులు పాల్గొంటారని, 86 మంది అఫీషియల్స్ హాజరవుతారని చెప్పారు. క్రీడలు నిర్వహించేందుకు తొమ్మిది క్రీడా మైదానాలను సిద్ధం చేశామన్నారు. ఈ క్రీడల నిర్వహణకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి 50 మంది టెక్నికల్ అఫీషియల్స్ వస్తున్నట్లు తెలిపారు. సెంట్రల్ జోన్‌లో విజయం సాధించిన జట్లతో పాటు క్వాలీఫై అయిన జట్లు జనవరి 30 నుంచి ఉత్తరాఖండ్‌లో జరిగే ఆలిండియా యూనివర్సిటీ పోటీల్లో పాల్గొంటాయన్నారు.
జనవరి 8 నుంచి మహిళా క్రికెట్ పోటీలు
కేయూలో జనవరి 8 నుంచి 13వ తేదీ వరకు సెంట్రల్‌జోన్ మహిళా క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ ప్రొఫెసర్ దిగంబరరావు తెలిపారు. ఈ పోటీలకు సెంట్రల్‌జోన్ పరిధిలోని యూనివర్సిటీల నుం చి 23 జట్లు వస్తున్నాయన్నారు. మహిళల పోటీ ల్లో విజయం సాధించిన జట్లు జనవరి 24 నుం చి ఫిబ్రవరి 1 వరకు యూపీలోని పూర్వంచల్ జరిగే ఆలిండియా యూనివర్సిటీ పోటీల్లో పా ల్గొంటాయన్నారు. క్రీడల నిర్వహణలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకునేందు కు పలు కమిటీలు వేసి బాధ్యతలు అప్పగించామన్నారు. క్రీడాకారులకు, అఫీషియల్స్‌కు యూనివర్సిటీలో వసతి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లు దిగంబరరావు తెలిపారు.
27 నుంచి సెంట్రల్ జోన్ క్రికెట్ పోటీలు
Published Wed, Dec 25 2013 3:39 AM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM
Advertisement