సాక్షి, వరంగల్ అర్బన్ : డిగ్రీ, పీజీ పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో హన్మకొండలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నయీమ్ నగర్ నుంచి కాకతీయ యూనివర్సిటీ వరకు ర్యాలీ నిర్వహించిన అనతరం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు ధర్నాకు దిగారు. విదార్థుల గుంపును పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రికత్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో బిల్డింగ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. గాజు ముక్కలు కోసుకుపోవడంతో ఓ విద్యార్థి చేతికి గాయాలయ్యాయి. పోలీసులు లాఠీతో కొట్టాడంతో గాజు ముక్కలపై పడ్డాడని విద్యార్థి ఆరోపించాడు. ఫలితాల్లో అవకతవకలపై చర్యలు తీసుకునే వరకు కదిలేది లేదంటూ విద్యార్థులు యూనివర్సిటీలో బైఠాయించారు.
Comments
Please login to add a commentAdd a comment