కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు కేయూ పీజీ సెట్ ఈనెల 24 నుంచి జూన్ 1 వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇన్‌చార్జ్ అడ్మిషన్ల డెరైక్టర్ డాక్టర్ ఎస్.నర్సింహాచారి గురువారం తెలిపారు. ప్రవేశ పరీక్షలు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వారం రోజుల తర్వాత విద్యార్థులు తమ హాల్‌టికెట్లను కేయూ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వివరించారు.
ప్రవేశపరీక్షల షెడ్యూల్ ఇదే...
24న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఎమ్మెస్సీ బోటనీ, ఎంఏ తెలుగు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎంఎల్‌ఐఎస్సీ, ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ, ఎంఎస్‌డబ్ల్యూ పరీక్షలు జరుగుతాయి. 25న ఉదయం ఎంఈడీ, మధ్యాహ్నం ఎమ్మెస్సీ ఫిజిక్స్, ఇంజినీరింగ్ ఫిజిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎంఏ సోషియాలజీ, 26న ఉదయం ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఎంటీఎం, మధ్యాహ్నం ఎంఏ ఇంగ్లిష్, 27న ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంపీఈడీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, మధ్యాహ్నం ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, 28న ఉదయం ఎంఏ ఎకనామిక్స్, ఎమ్మెస్సీ జువాలజీ, మధ్యాహ్నం ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, అప్లయిడ్ మ్యాథ్స్, ఎమ్మెస్సీ మైక్రోబయాలజీ, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పరీక్షలు నిర్వహిస్తారు. 29న ఉదయం ఎంసీజే, మధ్యాహ్నం ఎమ్మెస్సీ సైకాలజీ, 31న ఉదయం ఎంహెచ్‌ఆర్‌ఎం, మధ్యాహ్నం ఎంఏ హిస్టరీ, ఎమ్మెస్సీ జియాలజీ, జూన్ 1న ఉదయం ఎం.కామ్, ఎం.కామ్ ( ఫైనాన్సియల్ అకౌంటింగ్), ఎం.కామ్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ అండ్ ఎం.కామ్ (కంప్యూటర్ అప్లికేషన్స్), మధ్యాహ్నం ఎంఏ (జెండర్ స్టడీస్), ఎమ్మెస్సీ (నానో సైన్స్ అండ్ నానో టెక్నాలజీ ) కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్షలు ఉంటాయి. ఇదిలా ఉండగా ఎంఏ సంస్కృతం, ఎంఏ హిందీ, పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ బయో కెమిస్ట్రీ, ఎంఏ ఉర్దూ, ఎమ్మెస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రవేశపరీక్ష ఉండదని నర్సింహాచారి తెలిపారు. డిగ్రీ స్థాయిలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తామని నర్సింహాచారి పేర్కొన్నారు.
కేయూ పీజీసెట్ షెడ్యూల్ విడుదల
Published Fri, May 2 2014 3:02 AM | Last Updated on Fri, Aug 17 2018 3:08 PM
Advertisement
Advertisement