స్పీకర్ కాదు.. కంట్రోలర్ అనాల్సింది
-
శాసన సభాపతి మధుసూదనాచారి
కేయూ క్యాంపస్ : శాసనసభలో ‘స్పీకర్’ మాట్లాడటమనేది అసలే ఉండదని, సభ్యులే మాట్లాడుతారని స్పీకర్ అనేవారు సభను కంట్రోల్ చేస్తుంటారని.. అలాంటప్పుడు స్పీకర్ అని ఎందుకు అంటున్నారో అర్థం కావటం లేదని శాసన సభాసతి సిరికొండ మధుసూదనాచారి అన్నారు. కాకతీయ యూనివర్సిటీలో జర్నలిజం విభాగం ఆధ్వర ్యంలో ‘కేయూ ఎక్స్‌ప్రెస్’ అనే జర్నల్‌ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. స్పీకర్ అనే పదం వాడడంలో ఉన్న ఆంతర్యమేంటో జర్నలిస్టులే వెలికి తీయాలని నవ్వుతూ అన్నారు. రాష్ట్ర శాసనసభలో తాను స్పీకర్‌గా వ్యవహరిస్తున్నాని, తానేమీ మాట్లాడేది ఉండదని సభ్యులెవరైనా అదుపుతప్పి మాట్లాడితే కంట్రోల్ చేయడమే తన డ్యూటీ అని చెప్పారు.