అతివేగంగా వాహనాలను నడిపే వాహనచోదకులను నియంత్రించాల్సిన పోలీసులే దూకుడుగా వాహనాలు నడుపుతున్నారు. పోలీసులమనే అహంభావంతోనో.. ఏమరుపాటుగానో వాహనాలను నడిపి ప్రజల ప్రాణాల మీదికి తెస్తున్నారు. కొద్దినెలల క్రితం చేర్యాలలో ఎస్సై జీపు ఢీకొని ఓ వ్యక్తి కాలు విరగింది. ఇటీవల నర్సంపేట పట్టణంలో పోలీస్ జీపు బైక్‌ను ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
నవంబర్ 24న కాకతీయ యూనివర్సిటీ క్రాస్‌రోడ్డులో సిగ్నల్ పాయింట్ వద్ద కరీంనగర్ నుంచి హన్మకొండకు వస్తున్న పోలీస్ జీప్ ఏకంగా రెడ్ సిగ్నల్ పడ్డాక కూడా ముందుకు దూసుకెళ్లి విధ్వంసం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఒక టాటాఏస్ వాహనం, ఒక ద్విచక్ర వాహనం ధ్వంసం కావడంతోపాటు ఆటోలో ఉన్న 8 మందికి గాయాలయ్యారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
అత్యవసరమైనా.. కాకున్నా ఇష్టారాజ్యంగా రోడ్లపై జీపులను అతి వేగంగా నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
ప్రాణాలు తీస్తున్న పోలీసు జీపులు
Published Mon, Dec 1 2014 3:24 AM | Last Updated on Tue, Oct 30 2018 7:39 PM
Advertisement