
తెలంగాణ పునర్నిర్మాణానికి పాటుపడాలి
తెలంగాణ పునర్నిర్మాణానికి ప్రతి ఒక్క రూ పాటుపడాలని టీజేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.
- {పజల్లో చైతన్యం కల్పించిన ఉద్యమం
- విద్యార్థుల పాత్ర గొప్పది
- టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం
కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : తెలంగాణ పునర్నిర్మాణానికి ప్రతి ఒక్క రూ పాటుపడాలని టీజేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. కాకతీయ యూనివర్సిటీ రీసె ర్చ్ స్కాలర్స్ అసోసియేషన్(కుర్సా) ఆధ్వర్యం లో శనివారం ‘తెలంగాణ రాష్ట్రం సమస్యలు- సవాళ్లు, విశ్వవిద్యాలయాల పాత్ర’ అంశంపై క్యాంపస్‌లోని సెనేట్‌హాల్‌లో సదస్సు నిర్వ హించారు. సదస్సుకు కోదండరాం ముఖ్యఅతి థిగా హాజరై మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీ విద్యార్థుల పాత్ర ఎంతో గొప్పదన్నారు. ఉద్యమా లు, సమ్మెలతోనే కాకుండా ఎంతోమంది విద్యార్థుల ఆత్మ బలి దానాలతో నేడు ప్రత్యేక తెలంగాణ ఏర్పడిందన్నారు. ఇదే స్ఫూర్తితో యూనివర్సిటీ విద్యార్థులు తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.
నాడు రాజ్యాంగం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణను విలీనం చేసిన సమయంలో చేసుకున్న పెద్ద మనుషుల ఒప్పందాలకు తూట్లు పొడిచి ఇష్టారాజ్యంగా వనరుల దోపిడీ జరిగిందని ఆయన ఆరోపించారు. ఆ విధంగా ఇంతకాలం నిధులు, నీళ్లు, ఉద్యోగాలు, భూమిని కొల్లగొట్టారని చెప్పారు. ప్రస్తుతం మాత్రం తెలంగాణ ఉద్యమం ఇక్కడి ప్రజల్లో ఎంతో చైతన్యాన్ని కలిగించిందన్నారు.
ప్రజలు సంఘటితమై ఉద్యమించగా ఏర్పడుతున్న తెలంగాణలో అభివృద్ధి ఫలాలు సామాన్యుల కు సైతం అందేలా పునర్నిర్మాణం జరగాల్సి ఉందని ఆయన వివరించారు. తెలంగాణ విలేజీ డెవలప్‌మెంట్ కమిటీలను కూడా ఏర్పా టు చేసుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని, విద్యార్థులు కూడా తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రజలను చైతన్యవంతులను చేయాలని కోదండరాం సూచించారు.
పల్లెల విధ్వంసం జరిగింది..
సీమాంధ్రుల పాలనలో పల్లెల విధ్వంసం జరగగా, చెరువులు కబ్జాకు గురయ్యాయని రాజ కీయ విశ్లేషకులు వి.ప్రకాష్ అన్నారు. చెరువు ల్లో పూడికతీత తీయకపోవడం మూలంగా సాగు విస్తీర్ణం తగ్గిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు అందరికీ లాభం జరిగేలా తెలంగాణ పునర్నిర్మాణం జరగాలం టే బలమైన ప్రభుత్వం రావాల్సిన అవసరముందని చెప్పారు.
అంబేద్కర్ వర్సిటీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటైన క్రమంలో అన్ని పార్టీల నాయకులు పునర్నిర్మాణాన్ని ఎన్నికల ప్రణాళికల్లో చేరుస్తూ కొత్త నాటకానికి తెరలేపాయని ఆయ న ఆరోపించారు. తెలంగాణ పునర్నిర్మాణం, నవ తెలంగాణ అని కాకుండా తెలంగాణ భవిష్యత్ నిర్మాణమంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ఏర్పాటు కాకముం దే టీఆర్‌ఎస్ అధినేత పునర్నిర్మాణమంటూ కొన్ని తాయిలాలు ప్రకటించారని, ఏనాడు ఉద్యమంలో పాల్గొనని పొన్నాల లక్ష్మయ్య ఇప్పుడు బంగారు తెలంగాణ అంటున్నారని, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తెలంగాణలో బీసీలకు సారథ్యం అనగానే ఆర్.కృష్ణయ్య కూడా తెరపైకి వస్తున్నారని ఆయన విమర్శిం చారు.
తెలంగాణపై.. పై నాయకుల్లో ఎవరికి ప్రేమ, చిత్తశుద్ధి లేవని.. ఏ ప్రభుత్వం ఏర్పడినా తెలంగాణ పునర్నిర్మాణం సక్రమంగా సాగుతుందా, లేదా అనేది అనుమానమేనన్నా రు. దీన్ని దృష్టిలో ఉంచుకుని యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమం మాదిరిగానే ఇప్పుడు కూడా ముఖ్య పాత్ర పోషించాలని సూచిం చారు. అనంతరం ఓయూ ప్రొఫెసర్ డాక్టర్ సి.కాశీం, కేయూ ప్రొఫెసర్లు కె.సీతారాంనాయ క్, పి.సాంబయ్య, తెలంగాణ విద్యావంతుల వేదిక బాధ్యులు ప్రొఫెసర్ కె.సీతారామారావు, ఏఐఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు వలీఉల్లాఖాద్రీ, కేయూ జేఏసీ నాయకులు సాదు రాజేష్, కె.వాసుదేవరెడ్డి, ఫిరోజ్‌పాషా, కుర్సా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చల్లా శ్రీనివాస్, మహ్మద్ సర్దార్‌తో పాటు కొంగర జగన్ మా ట్లాడారు. సదస్సులో ప్రొఫెసర్ సీహెచ్.దినేష్‌కుమార్, న్యాయవాది రాజేంద్రప్రసాద్, కేయూ అదనపు పరీక్షల నియంత్రణాధికారి ఈసం నారాయణ, డాక్టర్ సైదిరెడ్డి, అధ్యాపకు లు, పరిశోధకులు పాల్గొన్నారు.