ఉరకలెత్తిన ఉత్సాహం | grand celebration in Yuvajanotsavam | Sakshi
Sakshi News home page

ఉరకలెత్తిన ఉత్సాహం

Published Fri, Jan 10 2014 3:12 AM | Last Updated on Tue, Oct 30 2018 7:39 PM

ఉరకలెత్తిన ఉత్సాహం - Sakshi

ఉరకలెత్తిన ఉత్సాహం

నర్సంపేట, న్యూస్‌లైన్ : కాకతీయ యూనివర్సిటీ జాతీయ సేవాసంస్థ విభాగం ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని సిద్ధార్థ డి గ్రీ, పీజీ కళాశాల ప్రాంగణంలో జిల్లాస్థాయి యువజనోత్సవం వైభవంగా ప్రారంభమైంది. విద్యార్థుల కేరింతలతో ప్రాంగణం మార్మోగింది. ఆటపాటలతో విద్యార్థులు ఉర్రూతలూగించారు. కేయూ ఎన్‌ఎస్‌ఎస్ విభాగాధిపతి, ప్రొఫెసర్ సురేష్‌లాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్ గోగుల ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి సిద్ధార్థ విద్యాసంస్థల చైర్మన్ కందిగోపాల్‌రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రొఫెసర్ సురేష్‌లాల్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో సేవాదృక్పథాన్ని పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. సృజనాత్మకశక్తి వెలుగులోకి వస్తుందన్నారు. ఇనుములాంటి సమాజంలోని విద్యార్థులను ఎన్‌ఎస్‌ఎస్ అయస్కాంతంలా ఆకర్షిస్తోందన్నారు. దేశంలోని 250కిపైగా యూనివర్సిటీల నుంచి 3.75కోట్లమంది ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు గ్రామాల పునర్నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారన్నారు.

 కష్టపడితేనే ఉన్నతస్థానం
 కష్టపడి చదివితే భవిష్యత్‌లో ఉన్నతస్థానాలు అలంకరించవచ్చని రూరల్ ఎస్పీ కాళిదాసు వెంకటరంగారావు అన్నారు. యువజనోత్సవం ముగింపు సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ 1983లో రెండు సంవత్సరాలు తాను కూడా ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్‌గా పనిచేసినట్టు చెప్పారు. ఇంటర్‌లో 20 కిలోమీటర్లు, డిగ్రీలో ఆరు కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణం చేసి చదువుకున్నానన్నారు.

 విద్యార్థులు దేశానికి వెన్నెముకలాంటి వారని, దేశ భవిష్యత్ వారి చేతుల్లోనే ఉందన్నారు. పోలీసుల ఆధ్వర్యంలో ప్రబోధ్ పేరుతో ఒక వుహత్తర కార్యక్రవూన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహువుతుల ప్రదానం చేశారు.  కార్యక్రవుంలో కళాశాల డెరైక్టర్ గోగులసృజనప్రభాకర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ వీరవుళ్ల వూధవరెడ్డి, కూతురు వీరారెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement