నేటి ఎంసెట్‌కు ఏర్పాట్లు పూర్తి | With today's EMSET | Sakshi
Sakshi News home page

నేటి ఎంసెట్‌కు ఏర్పాట్లు పూర్తి

Published Thu, May 22 2014 4:24 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

నేటి ఎంసెట్‌కు ఏర్పాట్లు పూర్తి - Sakshi

నేటి ఎంసెట్‌కు ఏర్పాట్లు పూర్తి

కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : గురువారం జరిగే ఎంసెట్-2014 నిర్వహణకు వరంగల్ రీజినల్ పరిధిలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రీజినల్ కోఆర్డినేటర్, కాకతీయ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసులు తెలిపారు. ఇంజనీరింగ్‌కు 14,323 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని, ఇందుకు 23 కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ పరీక్షకు 36 మంది అబ్జర్వర్లను నియమించామన్నారు.

మధ్యాహ్నం 2-30గంటల నుంచి సాయంత్రం 5-30 గంటల వరకు మెడిసిన్, అగ్రికల్చర్‌కు ప్రవేశ పరీక్ష జరుగుతుందని, 6,669మంది అభ్యర్థులు పరీక్షను రాయబోతున్నారన్నారు. ఈ పరీక్ష నిర్వహణకు 10  కేంద్రాలను ఏర్పాటు చేశామని, 18మంది అబ్జర్వర్లను నియమాకం చేశామని చెప్పారు. ఆయా పరీక్షలకు నిర్ధేశించిన విధంగా ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షాకేంద్రాలకు అనుమతించబోమని స్పష్టం చేశారు. గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు.
 
ఇంజనీరింగ్ పరీక్షా కేంద్రాలు ఇవే..
 
కేయూ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, వరంగల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సెన్సైస్ (విట్స్), చైతన్య డిగ్రీ కాలేజీ, ఏవీవీ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, న్యూసైన్స్ డిగ్రీ కాలేజీ, న్యూసైన్స్ డిగ్రీ పీజీ కాలేజీ, ఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, సుమతిరెడ్డి ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, ఎల్‌బి పీజీ కాలేజీ, ఎల్‌యూజీ కాలేజీ, జయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్, కాకతీయ మెడికల్ కాలేజీ, సీకెఎం, కాకతీయ కాలేజీ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, మాస్ట ర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ, ఎస్‌వీఎస్ కాలేజీ, కాకతీ య ప్రభుత్వ కాలేజీ, వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ, యూనివర్సిటీ కాలేజీ(హ్యూమనిటీస్ బిల్డింగ్), సహారా కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్
 
మెడిసిన్ అండ్ అగ్రికల్చర్ పరీక్షా కేంద్రాలు
 
వరంగల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సెన్సైస్(విట్స్), చైతన్య డిగ్రీకాలేజీ, ఏవీవీ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ, ఎల్‌బీ పీజీ కాలేజీ, ఎల్‌బి యూజీ కాలేజీ, కాకతీయ మెడికల్ కాలేజీ, కాకతీయ ప్రభుత్వ కాలేజీ, వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ, శ్రీ గాయత్రి డిగ్రీ కాలేజీ, సహారా కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ పరీక్షా కేంద్రాలుగా ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement