హీరోలు, హీరోయిన్ల శుభాకాంక్షల వెల్లువ
చిరంజీవి షష్టిపూర్తి సందర్భంగా ఆయనను పలువురు హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, గాయకులు, సంగీత దర్శకులు.. ఇలా సినిమా రంగంలోని అన్ని విభాగాలకు చెందినవాళ్లు అభినందనలతో ముంచెత్తారు. అలనాడు ఆయనతో పాటు నటించిన ప్రముఖ హీరోయిన్లు రాధిక, సుమలత దగ్గర్నుంచి ఈనాటి టాప్ హీరోయిన్లు శ్రుతిహాసన్, అనుష్క లాంటివాళ్లు కూడా ట్విట్టర్ ద్వారా చిరుకు అభినందనలు తెలిపారు.
అలాగే హీరోయిన్లు ఇషాచావ్లా, మధుశాలిని, హీరోలు అల్లరి నరేష్, నితిన్, దర్శకులు గుణశేఖర్, శ్రీనువైట్ల, సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్, గాయకుడు బాబా సెహగల్ .. ఇలా చాలామంది ట్విట్టర్ ద్వారా మెగాస్టార్కు పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు. వాటిలోంచి కొన్నింటిని మీకు అందిస్తున్నాం..
Happy Birthday" to #MEGASTAR Chiranjeevi sir, God bless you and your Family,Long Live....Inspiring Personality #HappyBirthdayMegastar