కన్నడ చిత్రపరిశ్రమలో రేణుకాస్వామి హత్య పెద్ద సంచలనంగా మారింది. ఈ కేసులో మొదటి నిందితురాలిగా ఉన్న పవిత్రగౌడను గత కొద్దిరోజులుగా పోలీసులు విచారిస్తున్నారు. రేణుకాస్వామి తనకు అసభ్య మెసేజ్‌లు పెడుతున్నట్లు తన ప్రియుడు హీరో దర్శన్‌కు చెప్పడంతోనే ఈ హత్య జరిగిందని పోలీసులు వద్ద ఆమె ఒప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, పవిత్ర గౌడను పోలీసులు విచారిస్తున్న క్రమంలో ఆమె తీవ్రంగా ఒత్తిడికి గురైనట్లు తెలుస్తుంది. దీంతో ఆమె అస్వస్థతకు గురై బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.
పవిత్ర గౌడను గత 10 రోజులుగా పోలీసులు విచారిస్తున్నారు. దీంతో ఆమె ఆరోగ్యం కాస్త దెబ్బతినడంతో చికిత్స కోసం బెంగళూరులోని ప్రభుత్వాసుపత్రిలో పోలీసులు చేర్పించారు. రేణుకాస్వామి హత్య జరిగిన సమయంలో పవిత్ర గౌడ అక్కడే ఉన్నట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. హత్య జరిగాక పవిత్ర నేరుగా ఇంటికి వెళ్లిపోయింది, ఆ రోజు ఆమె ధరించిన దుస్తులు, దాడికి ఉపయోగించిన చెప్పును ఇది వరకే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రేణుకాస్వామిపై మొదట దాడిచేసింది పవిత్ర అని తెలిసింది.
ఈ కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో హీరో దర్శన్ ఫాంహౌజ్ మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీధర్ చనిపోతూ ఒక సూసైడ్‌నోట్ రాయడంతో పాటు ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. ఒంటరితనం వేధించడం వల్లే చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు లేఖ, వీడియోలో శ్రీధర్ తెలిపాడు. తన చావుకు తానే బాధ్యుడినని వేరే ఎవరూ కారణం కాదని స్పష్టం చేశాడు. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment