ఫోటోలు, వీడియోలతో నా భర్తను లొంగదీసుకుంది: దర్శన్‌ సతీమణి | Darshan Wife Vijayalakshmi Comments On Pavithra Gowda | Sakshi
Sakshi News home page

ఫోటోలు, వీడియోలతో నా భర్తను లొంగదీసుకుంది: దర్శన్‌ సతీమణి

Published Wed, Sep 11 2024 8:54 AM | Last Updated on Wed, Sep 11 2024 9:50 AM

Darshan Wife Vijayalakshmi Comments On Pavithra Gowda

కన్నడలో సంచలనం సృష్టించిన చిత్రదుర్గం వాసి రేణుకాస్వామి (29) హత్యకేసులో ‍ప్రధాన నిందితులుగా నటుడు దర్శన్‌, పవిత్రగౌడ ఉన్నారు. వారిద్దరూ సుమారు నాలుగు నెలలుగా జైలులో ఉన్న విషయం తెలిసిందే. రేణుకాస్వామి హత్యకు సంబంధించి    3,991 పేజీలతో   చార్జిషీట్‌ను పోలీసులు దాఖలు చేశారు. ఈ క్రమంలో దర్శన్‌ సతీమణి విజయలక్ష్మి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను కూడా చార్జిషీట్‌లో పొందుపరిచారు. దర్శన్‌, పవిత్రల గురించి ఆమె సంచలన విషయాలను బయటపెట్టింది.

కన్నడలో స్టార్‌ హీరోగా ఉన్న దర్శన్‌ వైవాహిక జీవితంలో మాత్రం సక్సెస్‌ కాలేకపోయాడు. 2000 సంవత్సరంలో విజయలక్ష్మిని  పెళ్లి చేసుకున్నాడు. అయితే, పలు విభేదాలు రావడంతో వారిద్దిరూ చాలాకాలంగా వేరువేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో హీరోయిన్‌ పవిత్ర గౌడ్‌ వారి జీవితంలో అడుగుపెట్టడంతో ఆ దూరం కాస్త మరింత పెరిగింది. అయితే, ఇప్పుడు రేణుకాస్వామి హత్యకేసులో చిక్కుకునన తన భర్త దర్శన్‌, పవిత్రల రిలేషన్‌ గురించి చార్జిషీట్‌లో విజయలక్ష్మి ఇలా తెలిపారు.

దర్శన్‌ను పవిత్రగౌడ ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌ చేసిందని దర్శన్‌ భార్య విజయలక్ష్మి విచారణలో చెప్పినట్టు సమాచారం. ఇదే విషయాన్ని పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. 2014లో పవిత్రగౌడతో దర్శన్‌ ప్రేమ, సహ జీవనం గురించి తాను గొడవపడినట్టు విజయలక్ష్మి తెలిపారు. ఈ క్రమంలో పవిత్రగౌడ దర్శన్‌తో ఏకాంత సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు చూపించి ఆయనను బెదిరించిందని ఆరోపించారు. దర్శన్‌ నుంచి పవిత్రగౌడ ఇళ్లు, కార్లు, కోట్లాది రూపాయల నగదు తీసుకుందని చెప్పారు. పవిత్రగౌడ పరిచయం కానంత వరకు తమ కాపురం సజావుగా సాగిందని తెలిపారు. మరోవైపు అంతా మంచి జరగాలని విజయలక్ష్మి అసోంలో గువాహటిలోని ప్రసిద్ధ కామాఖ్య మాత దేవాలయాన్ని దర్శించుకున్నారు.  పోలీసులు వేసిన చార్జిషీట్‌ గురించి కన్నడ టీవీ చానెళ్లలో విస్తృతంగా వార్తా కథనాలు ప్రసారమవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement