వైభవంగా ఆది బసవేశ్వర రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా ఆది బసవేశ్వర రథోత్సవం

Published Fri, May 2 2025 1:55 AM | Last Updated on Fri, May 2 2025 1:55 AM

వైభవం

వైభవంగా ఆది బసవేశ్వర రథోత్సవం

రాయచూరు రూరల్‌: రాయచూరు తాలూకా యరమరస్‌లో ఆది బసవేశ్వరస్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. బుధవారం రాత్రి వందలాది మంది భక్తుల సమక్షంలో రథాన్ని లాగారు. యరమరస్‌లో వెలసిన ఆది బసవేశ్వర స్వామికి ప్రత్యేక పూజలను కిల్లే బృహన్మఠాధిపతి శాంత మల్ల, సోమవారపేట మఠాధిపతి అభినవ రాచోటి శివాచార్యులు నెరవేర్చారు. రథోత్సవంలో రాయచూరు, మాన్వి, సింధనూరు, కొప్పళ, బళ్లారిలతో పాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ధరలు తగ్గించాలని పాదయాత్ర

రాయచూరు రూరల్‌: రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం పెంచిన పేదలు వినియోగించే వస్తువుల ధరలను తగ్గించాలని, కేంద్రం అమలు పరచదలచిన నాలుగు కార్మిక చట్టాలను ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎంఎల్‌) డిమాండ్‌ చేసింది. గురువారం గాంధీ సర్కిల్‌ వద్ద చేపట్టిన పాదయాత్రలో కార్యదర్శి వీరేష్‌ మాట్లాడారు. పంచ గ్యారెంటీలతో రాష్ట్ర ఖజానాను లూటీ చేసి విద్యుత్‌, బస్‌ చార్జీలు, పాల ధరలకు తోడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచడం వల్ల సామాన్య ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని, కార్మిక చట్టాలను విరమించుకోవాలని ఒత్తిడి చేశారు.

అసంఘటిత కార్మికులను ఆదుకోవాలి

రాయచూరు రూరల్‌: కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికులను ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి శరణ బసవ డిమాండ్‌ చేశారు. గురువారం సీఐటీయూ కార్యాలయంలో 138వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ప్రారంభించి ఆయన మాట్లాడారు. అసంఘటిత కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు. వేతనాలతో కూడిన సెలవులివ్వాలని, ప్రతి నెల రూ.7500 చొప్పున వేతనాన్ని బ్యాంక్‌ ఖాతాలో జమ చేయాలన్నారు. ఎస్‌యూసీఐ అభ్యర్థి వీరేష్‌ కార్మిక దినోత్సవాలను ఆచరించారు. ఈసందర్భంగా పద్మ, సులోచన, వరలక్ష్మి, మహేష్‌, చెన్నబసవలున్నారు.

వక్ఫ్‌ బిల్లు వ్యతిరేకిస్తూ

చీకటి రాత్రి

రాయచూరు రూరల్‌: కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తున్న వక్ఫ్‌ బిల్లును వ్యతిరేకిస్తూ మైనార్టీలు ఆందోళన చేపట్టారు. బుధవారం రాత్రి జిల్లా అంతటా మైనార్టీలు ఇళ్లలో, దుఖాణాల్లో, హోటళ్లలో 15 నిమిషాల పాటు విద్యుత్‌ దీపాలు బంద్‌ చేసి చీకటి రాత్రి నిరసన తెలిపారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని మరోసారి పున పరిశీలించి మైనార్టీలకు జరిగే అన్యాయాలకు కేంద్రానిదే బాధ్యత అన్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తున్న వక్ఫ్‌ బిల్లులో మార్పులు చేసి మైనార్టీల హక్కులను రక్షించాలన్నారు. వక్ఫ్‌ భూములు సర్కార్‌ పరం అయ్యే విధంగా చట్టాన్ని సవరించుకున్నారన్నారు.

వేర్వేరు చోట్ల ఇద్దరు మృతి

హోసూరు: వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. సూళగిరి సమీపంలోని కరియసంద్రం గ్రామానికి చెందిన జనపిరెడ్డి కొడుకు సుబ్బునాయుడు(16) అదే ప్రాంతానికి చెందిన మిత్రుడు ప్రవీణ్‌కుమార్‌తో కలిసి బుధవారం సాయంత్రం ద్విచక్రవాహనంలో సూళకుంట వైపు వెళ్తుండగా అదుపుతప్పి కింద పడ్డారు. ప్రమాదంలో తీవ్ర గాయాలేర్పడిన ఇరువురినీ క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఫలితంలేక సుబ్బునాయుడు మృతి చెందాడు. బేరికె పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. హోసూరు సమీపంలోని బీర్జేపల్లి గ్రామానికి చెందిన మంజునాథ్‌(44). ద్విచక్రవాహనంలో వెళ్తూ అదుపుతప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. సేలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉద్దనపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

వైభవంగా ఆది బసవేశ్వర రథోత్సవం  1
1/3

వైభవంగా ఆది బసవేశ్వర రథోత్సవం

వైభవంగా ఆది బసవేశ్వర రథోత్సవం  2
2/3

వైభవంగా ఆది బసవేశ్వర రథోత్సవం

వైభవంగా ఆది బసవేశ్వర రథోత్సవం  3
3/3

వైభవంగా ఆది బసవేశ్వర రథోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement