
లక్ష్యానికి మించి ఆదాయం
తిరుమలగిరి (తుంగతుర్తి): జిల్లాలో 2024– 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆరు వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా మార్కెటింగ్ శాఖకు నిర్దేశిత లక్ష్యానికి మించి ఆదాయం వచ్చింది. ఆరు వ్యవసాయ మార్కెట్లలో కోదాడ, హుజూర్‌నగర్ మినహా మిగిలిన సూర్యాపేట, తుంగతుర్తి, తిరుమలగిరి, నేరేడుచర్ల మార్కెట్లు టార్గెట్‌ను అధిగమించాయి. 2024–25లో మార్చి నుంచి ఏప్రిల్ వరకు మార్కెట్ కమిటీల ద్వారా రూ.32.02 కోట్ల మేర ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకోగా రూ.33.14 కోట్ల ఆదాయం సమకూరింది. సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్ సెలక్షన్ గ్రేడ్ మార్కెట్లుగా, తుంగతుర్తి స్పెషల్ గ్రేడ్ మార్కెట్‌గా, నేరేడుచర్ల గ్రేడ్–2 మార్కెట్‌గా, తిరుమలగిరి గ్రేడ్ – 3 మార్కెట్‌గా విభజించారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ లక్ష్యం రూ.10.57కోట్లు కాగా.. రూ.13.11కోట్లు వసూళ్లు సాధించింది. అదేవిధంగా తుంగతుర్తి మార్కెట్ లక్ష్యం రూ.2.25కోట్లు కాగా.. వసూళ్లు రూ.2.39 కోట్లు, తిరుమలగిరి మార్కెట్ లక్ష్యం రూ.5.23కోట్లు అయితే వసూళ్లు రూ.5.67కోట్లు, నేరేడుచర్ల మార్కెట్ కమిటీ లక్ష్యం రూ.1.77కోట్లు కాగా.. వసూళ్లు రూ.1.99కోట్లు సాధించింది. ఇక.. కోదాడ రూ.4.49కోట్లు, హుజూర్‌నగర్ మార్కెట్ కమిటీలు రూ.5.45కోట్ల వసూళ్లు సాధించాయి. మార్కెట్లలో జరిగే పంటల విక్రయాలు, పలు రకాల ఫీజులు, గోదాములు, దుకాణాల అద్దెలు, చెక్ పోస్టులు, సీసీఈ కొనుగోలు కేంద్రాలు, ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇలా పలు రకాలుగా ఆదాయం సమకూరింది.
5లక్షల ఎకరాలకుపైగా పంటల సాగు
జిల్లాలో ఈ సంవత్సరం 5 లక్షలకు పైగా ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఇందులో ఎక్కువగా వరి, పత్తి రైతులు సాగు చేశారు. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాల్లో రైతులు విక్రయించిన ధాన్యం, పత్తికి సంబంధించి మార్కెట్ ఫీజులు వసూలు కావడంతో ఎక్కువగా ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది.
ఫ టార్గెట్‌ను అధిగమించిన సూర్యాపేట, తుంగతుర్తి, తిరుమలగిరి, నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్లు
ఫ లక్ష్యం రూ.32.02 కోట్లు..
వసూలు రూ.33.14 కోట్లు
మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటాం
తిరుమలగిరి వ్యవసా య మార్కెట్‌లో సంవత్సరం పొడవునా క్రయవిక్రయాలు జరుగుతా యి. నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించాం. మార్కెట్‌లో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించాలని కోరుతాం.
– చామంతి,
మార్కెట్ చైర్‌పర్సన్, తిరుమలగిరి
ఆదాయ లక్ష్యాలు
మార్కెట్ లక్ష్యం వసూళ్లు
(రూ.కోట్లలో)
సూర్యాపేట 10.57 13.11
కోదాడ 6.32 4.49
హుజూర్‌నగర్ 5.86 5.45
తుంగతుర్తి 2.25 2.39
తిరుమలగిరి 5.23 5.67
నేరేడుచర్ల 1.77 1.99

లక్ష్యానికి మించి ఆదాయం