
బెట్టింగ్‌కు పాల్పడితే చర్యలు : ఎస్పీ
సూర్యాపేటటౌన్ : ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పతే చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఆన్లైన్ గేమ్స్, పేయింగ్ గేమ్స్, ఆన్లైన్ జూదం, రమ్మి లాంటి ఆటలతో పాటు ఇతరత్రా బెట్టింగ్‌లకు పాల్పడవద్దని సూచించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో యువత అధికంగా క్రికెట్ బెట్టింగ్ యాప్‌లు, ఇతర బెట్టింగ్‌ల మోజులో పడి వారి బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోవడమే కాకుండా ఆప్పుల పాలై ప్రాణాల మీదికి తెచ్చుకుంటోందని పేర్కొన్నారు. ఈ బెట్టింగ్ భూతాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సూచించారు. ఎవరైన బెట్టింగ్‌లకు పాల్పడినట్లు తెలిస్తే పోలీసులకు గానీ లేదా డయల్ 100కు గానీ సమాచారం ఇవ్వాలని కోరారు.
యోగిక్ అగ్రికల్చర్ శిక్షణలో
రైతు నర్సింహారావు
నడిగూడెం : నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన ఆదర్శ రైతు మారిశెట్టి నర్సింహారావు రాజస్థాన్‌లోని మౌంట్ అబూలో బ్రహ్మకుమారీస్ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 3 నుంచి 8 వరకు నిర్వహించిన శాశ్వత యోగిక్ అగ్రికల్చర్ శిక్షణలో పాల్గొన్నారు. మంగళవారం శిక్షణ ముగింపు సందర్భంగా ఆయన సంస్థ నుంచి ప్రశంసా పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగు మందుల వల్ల కలిగే దుష్ఫప్రభావాలు, ప్రకృతి కాలుష్యం అవుతున్న విధానం, తద్వారా జరిగే ప్రకృతి వైపరీత్యాలు, ఆహారం విషంగా మారడం, మానవ జాతికి విషాహారం వల్ల మానవజాతికి కలిగే అనర్థాలు తదితర అంశాలు నేర్చుకున్నట్లు తెలిపారు.
మహనీయుల ఆశయాలు ప్రతిబింబించేలా ఉత్సవాలు
నల్లగొండ టూటౌన్ : మహనీయుల ఆశయాలు ప్రతిబింబించేలా ఈ నెల 11 నుంచి 14 వరకు జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఎంజీయూ వీసీ ఖాజాఅల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఉత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 11న ఉదయం 6 గంటలకు 5కే రన్, పానెల్ డిస్కషన్, 12న విశ్వవిద్యాలయ యువకులకు కెరీర్ అవకాశాలపై అవగాహన, 13న సింపోసియం, 14న శ్రీసామాజిక పరివర్తనలో విశ్వవిద్యాలయాల పాత్రశ్రీపై సెమినార్ నిర్వహించనున్నట్లు తెలిపారు. వ్యాసరచన, వకృత్త్వం, పాటలు, కవితల పోటీలను నిర్వహిస్తామని వివరించారు. మహనీయుల భావ స్ఫూర్తిని విద్యార్థుల్లోకి తీసుకుపోయేందుకు ఈ కార్యక్రమాలను రూపొందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉత్సవాల చైర్మన్ కొప్పుల అంజిరెడ్డి, రిజిస్ట్రార్ అల్వాల రవి, శ్రీదేవి, వసంత, కె.ప్రేమ్‌సాగర్, సుధారాణి, అరుణప్రియ, సబీనా, హరీష్‌కుమార్, శ్రవణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
యాదగిరి క్షేత్రంలో లక్ష పుష్పార్చన
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఏకాదశిని పురస్కరించుకుని మంగళవారం లక్ష పుష్పార్చన పూజ నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు పుష్పాలు, తులసీ దళాలతో లక్ష పుష్పార్చన పూజ జరిపించారు. పూజల్లో భక్తులు అధికంగా పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక ఆంజనేయస్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. ఆలయంలో నిత్య పూజలు కొనసాగాయి.

బెట్టింగ్‌కు పాల్పడితే చర్యలు : ఎస్పీ

బెట్టింగ్‌కు పాల్పడితే చర్యలు : ఎస్పీ

బెట్టింగ్‌కు పాల్పడితే చర్యలు : ఎస్పీ