
పెండింగ్ బిల్లులు చెల్లించాలని ధర్నా
సూర్యాపేటటౌన్ : జీపీఎఫ్ పెండింగ్ బిల్లుల చెల్లింపుల్లో జాప్యం చేయడాన్ని నిరసిస్తూ జెడ్పీ కార్యాలయం ఎదుట ధర్నా శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్ యూటీఎఫ్) సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్.రాములు మాట్లాడుతూ జిల్లా పరిషత్ పరిధిలో నిర్వహిస్తున్న జెడ్పీ జీపీఎఫ్ పార్ట్ ఫైనల్స్, రుణాలు, ఫైనల్ పేమెంట్స్ సుమారు రూ.18 కోట్ల 72 లక్షలు రెండు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం చేయడంతోపాటు వరుస క్రమం పాటించకుండా చెల్లింపులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు సోమయ్య, సిరికొండ అనిల్ కుమార్, కె అరుణ భారతి, పి శ్రీనివాసరెడ్డి, వెంకటయ్య, ఆర్.దామోదర్, నాగేశ్వరరావు, వి.రమేష్, బి.ఆడం, డీ.లాలుసభ్యులు పాల్గొన్నారు.