
యష్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కేజీయఫ్ 2’. కన్నడ భాషలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా చిత్రమిది. 2019లో మొదటి భాగం ‘కేజీయఫ్ ఛాప్టర్: 1’ విడుదలైంది. తాజాగా రెండో భాగం ‘ఛాప్టర్ 2’ చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టాండన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అయింది. సంజయ్ దత్ మెయిన్ విలన్ అధీరాగా కనిపిస్తారు. ఆయన భారీ యాక్షన్ సన్నివేశాల్లోనూ పాల్గొంటారని సమాచారం.
ఇటీవలే సంజయ్ దత్‌కి ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉందనే విషయం నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ముంబైలో చికిత్స మొదలుపెట్టారు. మరోవైపు షూటింగ్స్‌ని కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. నవంబర్‌లో ఆయన ‘కేజీయఫ్ 2’ లొకేషన్‌లో అడుగుపెడతారట. తన పాత్ర చిత్రీకరణ ముగిసే వరకూ ఈ షూటింగ్‌లో భాగమవుతారని సమాచారం. దాదాపు నెల రోజుల పాటు పాల్గొంటారని తెలిసింది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment