అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్.. ఇద్దరు ఒకప్పుడు స్టార్ హీరోలే. వారిద్దరి సినిమాలు బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయలు వసూలు చేశాయి. ఇద్దరికి కోట్లమంది అభిమానులు ఉన్నారు. వయసులో ఉన్నప్పుడు వైవిధ్యమైన సినిమాలతో వారిని అలరించారు. ఇప్పడు వయసు పైబడిన తర్వాత తమలోని మరో యాంగిల్‌ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. విలన్‌గా, తండ్రిగా, సోదరుడిగా, గురువుగా పలు పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇప్పుడు తాతయ్యలుగానూ అలరించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
రామ్ చరణ్‌కు తాతగా అమితాబ్
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ తర్వాత చరణ్ నటిస్తున్న చిత్రమిది. ఇది బుచ్చిబాబుకు రెండో సినిమా. ఉప్పెన తర్వాత చాలా గ్యాప్ తీసుకొని రామ్‌చరణ్ మూవీ (RC16) ప్రకటించాడు. రామ్‌చరణ్ బర్త్‌డే రోజు షూటింగ్ కూడా ప్రారంభించారు. అయితే ఈ సినిమా ఎలా ఉంటుందనే విషయాన్ని పక్కన పెడితే.. ఈ మూవీ కోసం బుచ్చిబాబు సెట్ చేస్తున్న కాంబినేషన్ మాత్రం ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడని ప్రకటించి అందరికి షాకిచ్చాడు.
అంతేకాదు శివరాజ్ కుమార్, జాన్వీ కపూర్, విజయ్ సేతుపతి ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారట. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌లోకి అమితాబ్ కూడా అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఓ కీలక పాత్ర కోసం అమితాబ్‌ని ఒప్పించే పనిలో పడ్డాడట బుచ్చిబాబు. అది రామ్ చరణ్ తాత పాత్ర అట. సినిమాలో ఆ పాత్ర చాలా కీలకం అని.. అమితాబ్ అయితేనే సెట్ అవుతుందని బుచ్చిబాబు భావించారట. నిర్మాతలు కూడా బడ్జెట్ విషయంలో ఫ్రీడం ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే భారీ క్యాస్టింగ్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఆత్మగా సంజయ్ దత్
ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’ అనే సినిమా చేస్తున్నాడు. హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మలయాళ భామమాలవికా మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నాడని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా సంజయ్ పాత్రకు సంబంధించి ఆసక్తికర విషయం ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో సంజయ్.. ప్రభాస్‌కు తాతగా నటించబోతున్నాడట. అకాల మరణం చెందిన సంజయ్..దెయ్యంగా తిరిగి వస్తాడట. ఆత్మగా మారిన తాత.. ప్రభాస్ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాడనే నేపథ్యంలో కథ సాగనుందట. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment