
కేజీఎఫ్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యశ్ హీరోగా తెరకెక్కిన కన్నడ చిత్రం రికార్డులు సృష్టించింది. దీంతో ఈ చిత్రం రెండో భాగాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని కేజీఎఫ్ ఫ్యాన్స్ అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇందులో చాలా మంది ప్రముఖులు కనిపించనున్నారు. రవీనా టండన్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈరోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా కేజీఎఫ్ టీం ఆమె పోస్టర్‌ను విడుదల చేసింది.
THE gavel to brutality!!!
— Raveena Tandon (@TandonRaveena) October 26, 2020
Presenting #RamikaSen from #KGFChapter2. Thanks KGF team for the gift.#HBDRaveenaTandon @VKiragandur @TheNameIsYash @prashanth_neel@SrinidhiShetty7 @duttsanjay @Karthik1423@excelmovies @ritesh_sid @AAFilmsIndia @FarOutAkhtar@hombalefilms pic.twitter.com/EjxQ0rCrE4
దీనిని ట్విటర్ ద్వారా షేర్ చేస్తూ రవీనా టండన్ ‘ అధికారం నుంచి క్రూరత్వంలోకి’ అని పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె కేజీఎఫ్ టీం అందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఫోటోలో రవీనా ఒక మెరూన్ కలర్ శారీలో, కళ్లల్లో నీటి చెమ్మతో , బాధతో కూడిన వదనంతో ఒక చోట కూర్చొని కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాలో విలన్ అధీర పాత్రలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. క్యాన్సర్ నుంచి కోలుకున్న ఆయన నవంబర్ నుంచి షూటింగ్‌లో పాల్గొనున్నారు.
చదవండి: అదే జరిగి ఉంటే.. ఈ రోజు పండగే
Comments
Please login to add a commentAdd a comment