
రాకింగ్‌స్టార్ యష్ హీరోగా కైకాల సత్యనారాయణ సమర్పణలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం కేజీఎఫ్ 2. కన్నడ చలన చిత్ర చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. పాన్ ఇండియా చిత్రంగా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేశారు. దీంతో దీని సీక్వెల్‌ను తెరకెక్కించాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. భారీ అంచనాలతో దీనిని నిర్మిస్తున్నారు.
అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. తిరిగి ఆగస్టు 26 నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. బెంగుళూరులోని కంఠీవ స్టూడియోలో షూటింగ్ మొదలు కానుంది. దీని కోసం దర్శకుడు ప్రశాంత్ నీల్ , ఇతర కీలకమైన యూనిట్ సభ్యులతో కలిసి లోకేషన్ రెక్కీ నిర్వహించారు. 26 నుంచి జరిగే బ్యాలెన్స్ షూటింగ్‌లో ప్రకాశ్ రాజ్, మాళవిక తదితరులు పాల్గొననున్నారు. దీంతో కేజీఎఫ్ ఛాప్టర్-2 బ్యాలెన్స్ షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందా, ఎప్పుడు విడుదలవుతుందా అని దేశ వ్యాప్తంగా ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది మంచి శుభవార్త కానుంది. ఈ సినిమాలో అధీర పాత్రలో సంజయ్ దత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: శిక్ష పడిన వ్యక్తి నటించకూడదని చట్టంలో లేదు