యశవంతపుర : కేజీఎఫ్–2 సినిమా షూటింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించటాన్ని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు సోమవారం కొట్టివేసింది. కేజీఎఫ్–2లో నటిస్తున్న సంజయ్‌దత్‌పై టాడా చట్టం కింద కేసు నమోదై శిక్ష పడింది. ఒక నిందితుడు నటిస్తున్న సినిమాకు ప్రభుత్వం ఎలా అనుమతి ఇస్తుందని హుబ్లీకి చెందిన శివశంకర్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. కేసును సోమవారం ప్రధాన న్యాయమూర్తి ఏఎస్ ఓరా విచారించారు. వాదనలు విన్న న్యాయమూర్తి శిక్ష పడిన వ్యక్తి సినిమాలలో నటించకూడదని చట్టంలో లేదని, ఇందులో ఎలాంటి ప్రజా ప్రయోజనం లేదని భావిస్తూ కేసును కొట్టివేశారు.
Comments
Please login to add a commentAdd a comment