ఒకప్పుడు స్టార్ హీరోలుగా రాణించిన కొంతమంది ఇప్పుడు విలన్‌గాను దూసుకెళ్తున్నారు. తెలుగులో జగపతిబాబు విలన్‌గా రాణిస్తుంటే.. బాలీవుడ్‌లో సంజయ్ దత్ ప్రతినాయకుడిగా అదరగొడుతున్నాడు. ‘కేజీయఫ్ ఛాప్టర్ 2’లో అధీరగా సంజయ్ పండించిన విలనిజం సినిమా స్థాయిని పెంచేసింది. ఆ చిత్రం తర్వాత సంజయ్‌కి వరుసగా ప్రతినాయక పాత్రలే వస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా నటిస్తున్న ‘లియో’చిత్రంలో సంజయ్ నెగెటివ్ రోల్ ప్లే చేస్తున్నాడు. అలాగే చాలా కాలంగా తర్వాత టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు సంజయ్.
(చదవండి: బిగ్‌బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లే! గ్లామర్‌కు ఢోకానే లేదుగా!)
పూరి జగన్నాథ్ తెరకెక్కించబోతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రంలో విలన్ బిగ్‌బుల్ పాత్రలో నటిస్తున్నాడు. రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్(2019)’ చిత్రానికి సీక్వెల్ ఇది. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు పూరీ. అందుకే విలన్ పాత్ర కోసం సంజయ్‌ని ఎంపిక చేసుకున్నారు. పూరీ రాసుకున్న విలన్ పాత్రకు సంజయ్ మాత్రమే న్యాయం చేయగలరని, అందుకే ఆయనను ఎంపిక చేసుకున్నామని చిత్రబృందం పేర్కొంది.
(చదవండి: పెళ్లి రూమర్స్‌పై హీరో తరుణ్ క్లారిటీ!)
అయితే ఇందుకుగాను భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చారట. ఈ సినిమాకు గాను సంజయ్ దాదాపు 60 రోజుల కాల్షీట్లను ఇచ్చారు. ఇందుకుగాను రూ. 15 కోట్ల పారితోషికం అందించినట్లు అటు బాలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ టాక్ నడుస్తోంది. వచ్చే ఏడాది మార్చి 8న ఈ చిత్రం విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment