
ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ గాయాలపాలయ్యాడు. కేడీ అనే కన్నడ సినిమా షూటింగ్‌లో బాంబ్ పేలడంతో అతడికి గాయాలయ్యాయి. బుధవారం నాడు బెంగుళూరులోని మగడి రోడ్డులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న కేడీ మూవీలో ఫైట్ మాస్టర్ రవి వర్మ ఆధ్వర్యంలో బాంబు బ్లాస్ట్ ఫైట్ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా అకస్మాత్తుగా బాంబు పేలడంతో సంజయ్ మోచేయి, ముఖానికి గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స తీసుకున్న అనంతరం ఆయన ముంబై వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంతో చిత్రీకరణను తాత్కాలికంగా నిలిపివేశారు.
కాగా 1971లో వచ్చిన 'రేష్మ ఔర్ షేరా' సినిమాతో బలనటుడిగా కెరీర్ ఆరంభించాడు సంజయ్ దత్. ఈ సినిమా వచ్చిన పదేళ్ల తర్వాత 'రాకీ' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. జానీ ఐ లవ్యూ, విధాత, నామ్, జాన్ కీ బాజీ, మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగే రహో మున్నా భాయ్.. ఇలా అనేక చిత్రాల్లో నటించాడు. హిందీ చిత్రపరిశ్రమలో దాదాపు నాలుగు దశాబ్ధాలుగా నటుడిగా రాణించాడు. కేజీఎఫ్ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. కేజీఎఫ్ 2 సినిమాల్లో విలన్‌గా నటించి దక్షిణాది వారికి మరింత దగ్గరయ్యాడు. ప్రస్తుతం ఆయన ధృవ్ సర్జా హీరోగా చేస్తున్న కేడీలో నటిస్తున్నారు. ఇదే కాకుండా ద గుడ్ మహారాజ, గుడ్చడి, లియో, బాప్ సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment