సంక్రాంతి పండగ సంబరాలు ఆరంభమయ్యాయి. కొందరు బాలీవుడ్ స్టార్స్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘అందరికీ లోహ్రీ (భోగి పండగ) శుభాకాంక్షలు. లోహ్రీ అంటే నాకు చాలా విషయాలు గుర్తుకొస్తాయి. లోహ్రీ రోజు జానపద కళాకారులు ‘లోహ్రీ దా టక్కా దే, రబ్ యానూ బచ్చా దే’ అంటూ పాటలు పాడుకుంటూ ఇంటింటికీ వచ్చినప్పుడు వారికి దానం ఇవ్వడం ఆనవాయితీ. నా చిన్నప్పుడు మా అమ్మగారు ఇలా పండగ తాలూకు విషయాలు చెప్పేవారు’’ అని సోషల్ మీడియా ద్వారా అమితాబ్ బచ్చన్ షేర్ చేశారు.
T 4889 - Happy Lohri ..
— Amitabh Bachchan (@SrBachchan) January 13, 2024
'लोहड़ी दा टक्का दे, रभ थानू बच्चा दे ' ... 😁
this is how the chanting went when they came to homes and families to collect donations on the occasion of Lohri ..
Maa used to tell us these stories .. pic.twitter.com/t9rVu8Kb2j
‘‘లోహ్రీ తాలూకు వెచ్చదనాన్ని, పండగ సందర్భంగా మా అమ్మగారు చేసిన స్వీట్స్‌ని తలుచుకుంటున్నాను. ఇరుగు పొరుగుతో పంచుకున్న నవ్వులతో నా మనసు నిండిపోయేది. నేటి బిజీ జీవితంలో అప్పటి ఆనందకర సాధారణ రోజులను తలచుకుని, ఆనందిస్తున్నాను. అందరి జీవితాల్లో లోహ్రీ ఆనందం నింపాలని కోరుకుంటున్నా’’ అని సన్నీ డియోల్ పేర్కొన్నారు. ఇంకా అక్షయ్ కుమార్, సంజయ్ దత్, విక్కీ కౌశల్, ఇషా డియోల్, నేహా ధూపియా వంటి తారలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment